రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ భారత్‌‌లో పుట్టడం మన దేశానికే గర్వకారణం: పవన్

72

రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ జీవితకథ ఆధారంగా నిర్మితమైన చిత్రం దంగల్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. రికార్డు కలెక్షన్లతో పాటు ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చిందట. ఆ సినిమాను, అమీర్‌ను ప్రశంసిస్తూ పవన్‌ ట్వీట్‌ చేశాడు.  ఇటీవలే దంగల్‌ సినిమా చూశాను. దానిపై నా అభిప్రాయాన్ని పంచుకోకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదనిపించింది.

 అమీర్‌ చక్కని నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకున్నారు. అలాంటి నటుడు భారత్‌లో పుట్టడం మన దేశానికే గర్వకారణం. ఇక, దర్శకుడు నితీష్‌ తివారి మనస్సును కదిలించేలా సినిమాను రూపొందించారు. ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా, సన్యా మల్హోత్ర అద్భుతంగా నటించార్ణని పవన్‌ ప్రశంసించాడు.

Comments

comments