మళ్లీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలని ఉంది..!!

5878

లేపండిరా సుమ్మోలు.. తీయండి కత్తులు అని డైలాగ్ ఎవరి నోటి నుంచైనా వచ్చిందంటే.. ఆ వ్యక్తి పక్కా వివి వినాయక్ సినిమాలు చూసాడనే చెప్పాలి. తన కెరియర్ మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు వినాయక్. టాలీవుడ్ టాఫ్ హీరోలందరితో సినిమాలు తీసిన వినాయక్ తాజాగా ..మోగా స్టార్ తో సినిమా చేస్తున్నాడు. ‘ఖైదీ నంబర్ 150’తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. మెగా అభిమానులతో పాటు ఎంతో మంది సినీ జనాలు వినాయక్ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ‘ఖైదీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తనతో పాటే కెరీర్ స్టార్ట్ అయిన మరో ఇద్దరు డైరెక్టర్లతో తనకున్న అనుబంధాన్ని వినాయక్ ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎవరెస్టుకు ఎక్కించిన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, ఆరు నెలల్లోనే అద్భుతమైన సినిమా తీసిపడేసే పూరీ జగన్నాధ్. ఈ ఇద్దరి గురించి వినాయక్ ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే..

రాజమౌళితో చాలా స్నేహంగా ఉంటానని వివి వినాయక్ చెప్పారు. తనకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పారు. నేను వచ్చాను అంటే.. ‘హే వినయ్ గారు వచ్చారు’ అని చాలా ఆనందంగా ఫీలవుతారు. నాకది చాలా ఇష్టం. రాజమౌళిగారు కొంచెం కూల్. కానీ జగన్ అలా కాదు. నాకు జగన్ లో నచ్చేదే అది. నాకు కేరియర్ లో జీవింతంలో కష్టాలు వస్తే.. జగన్‌ను తలచుకోవాలనిపిస్తుంది. అసలు భయం కానీ, కేర్ కానీ ఏమీ ఉండదు. ఎప్పుడూ అదే జోష్ తో ఉంటారు. అలా ఉండటం చాలా కష్టం. మళ్లీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి.’’అని వినాయక్ అన్నారు.

Comments

comments