దేవుళ్లని, దేవతలని ఏమన్నా ఏం ఫీకలేరనే ధైర్యంతోనే అలా చేశారు.. బుద్దిచెప్పాల్సిందే..!!

  0
  216

  మానం, ప్రాణం, బూతు అమ్ముకోవడానికే అన్నట్టుగా తయారైంది నేటి సమాజం. గతంలో బ్రతకటం కోసం వ్యభిచారం చేస్తే.. నేడు బ్రతకాలంటే బూతు మాట్లాడాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చారు జనం. విచ్చవిడి బూతులతో టీవీల్లో పొగ్రాం చేస్తూ.. దాంతో విపరీతమైన డబ్బులు సంపాదిస్తుంటే.. అదే మహా బ్రహ్మ పదార్ధంగా ఫీలు అవుతున్నారు నేటి తరం క్రియేటివీటి డైరెక్టర్స్ .

  క్రియేటివిటి పేరుతో సినిమాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో విపరీత పోకడలకు పోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. వెకిలితనమే కామెడీ అనుకునే స్దాయిలోకి వెళ్లింది ప్రస్తుత పరిస్ధితి. ఇలాంటి వాటికి విపరీతంగా దక్కుతున్న ఆదరణ ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటివి సమాజానికి చెడు చేస్తాయని కోర్టు వరకు వెళ్లినా.. అవి నిలబడటం లేదు. దీంతో మునుపు కంటే రెచ్చిపోవడం నిర్వాహకుల వంతైంది. ఇలాంటి వాటికి ప్రధాన కారణం సొంత టాలెంట్ లేకుండా.. పద్దతి పాడు లేకుండా.. బూతులతో కోట్లు సంపాదించాలన్న ఆశతో కృష్ణా నగర్ కి వచ్చి, పక్కింటి పెళ్ళాల మీద, గర్ల్ ఫ్రెండ్స్ మీద, లవ్ మీద, అక్రమ సంబంధాల మీద, మాడాలా మీద చూపించిన పైత్యాన్ని మెల్లగా దేవుళ్ళ వైపు షిఫ్ట్ చేసి తమ పైత్యానికి హద్దులు లేవని రుజువు చేస్తున్నారు.

  ఈ మధ్యే ‘ద్యేవుడా’ అనే మూవీకి సంబందించిన టీజర్ లాంటి ట్రైలర్ విడుదల అయ్యింది. అందులో అన్ని కొత్త మొహాలే. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని ఓ ఇంట్లో దెయ్యం బదులు దేవుడు ఉంటె ఎలా వేదిస్తాడు అనే పాయింట్ మీద కథ రాసుకున్నారు. కాని ట్రైలర్లో చూపించిన సన్నివేశాలు మాత్రం అతి జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. శివుడిని అభిషేకం చేస్తునట్టు చూపించి చికెన్ ముక్కలు, సిగరెట్ పీలికలు, బీర్ ధారలు ఇలా ఒకటేమిటి మితిమీరినతనానికి పరాకాష్టగా చూపించారు. పైగా ఆ చిత్ర దర్శకుడు సాయి రామ్ దాసరి అట.. ఏకంగా దేవుడితో మాట్లాడి మరీ తీసాడట. హిందూ దేవి దేవతలను ఏమన్నా ఎవరు ఏం పీకలేరన్న మొండి ధైర్యంతో ఈ సినిమా తీసినట్టుగా కనిపిస్తుంది. పబ్లిసిటీ కోసం ఇంత దిగాజారుడుగా తీసి పైగా అదేదో ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇవ్వడం.. ఇలాంటి ఎదవల్ని దగుల్బాజీ గాళ్ళని ఏమిచేయాలో అర్థం కావట్లేదు.

  Comments

  comments

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here