గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్..!!

159

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా మొదలైనప్పటి నుంచి యాక్టర్ ఎవరు, స్టోరీ ఎక్కడ ప్రధానంగా జరిగింది. అనే విషయాలు పట్టించుకోకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సినిమాకు అండగా నిలిచారు. ఓపెనింగ్ రోజు నుంచి ఈ సినిమా గురించి తోడుగా ఉన్నారు కేసీఆర్. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాలేదు. కేసీఆర్ ఆరో జు చెప్పారు. ఇది చరిత్ర గలిగిన సినిమా.. ఇక్కడ మూలాలు ఉన్నాయి. తప్పుకుండా ప్రభుత్వం సహాకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగా శాతకర్ణి సినిమాకు పన్ను మినహా ఇంపు ఇచ్చారు.

చరిత్ర పట్ల గౌరవం ప్రకటించడం అంటే అదీ. తెలంగాణ ప్రభుత్వం వారు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.గతంలో రుద్రమదేవి సినిమాకి కూడా కేసిఆర్ పన్ను మినహాయింపు ఇచ్ఛారు. కానీ ఆంధ్రా ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు.మరి గౌతమీ పుత్ర శాతకర్ణి సంబంధించినది మూలం తెలంగాణ నుంచి ఉన్నా.. శాతకర్ణి ఎక్కువ కాలం ఆంధ్రాలోనే ఉన్నారు.అయినా ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేదు. పన్ను మినహాయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్ కు బాలకృష్ణ సీఎంని కలిసి ప్రత్యేక ప్రదర్శన కు ఆహ్వానించి తన కృతజ్ఞతలు తెలియజేశారు. చదువు సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి ఉన్న చోట కళలు వర్ధిల్లుతాయని ప్రజలంతా అనుకుంటున్నారు.

Comments

comments