చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచకుండా పోటీ చేస్తామని చెప్పగలరా.?

  0
  117

  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుమ్మెత్తిపోసారు.. తాజాగా విజయవాడలో సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రెండు లక్షలు కూడా లేనివారు ఎన్నికలయ్యాక కోట్లు సంపాదిస్తున్నారని చెప్పడం తమగురించేనా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని చెప్పడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందని వాసిరెడ్డి అన్నారు. సాక్షాత్తూ మీపార్టీ ఎమ్మెల్యే, స్పీకర్‌ కోడెలలు ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టానని బహిరంగంగా చెప్పి అడ్డంగా దొరికి పోయిన సంగతి అందరివద్దా వీడియో ఉందని చెప్పారు.

  పైగా డిజిటల్‌ మనీ గురించి మాట్లాడే చంద్రబాబుకు డిజిటల్‌ ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని ప్రశ్నించారు. 500, వెయ్యి నోట్లు పంచి గెలుస్తున్నారని పత్తిత్తులా మాట్లాడే చంద్రబాబు రానున్న ఎన్నికల్లో డబ్బులు పంచకుండా పోటీ చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ నుంచి గెలిచిన 21 మందికి కండువాలు కప్పి చేర్చుకున్న చంద్రబాబు వారిచేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి స్టేలు తెచ్చుకుంటున్నారు.. అయినా నీతి సూత్రాలు వల్లించడం సిగ్గుచేటన్నారు. బాబు చేసిన అరాచకాలాన్నీ వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు మరిచిపోతున్నారని పగటి కలలు కంటున్నారని.. కానీ బాబు ఓడించే ఎన్నికల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబుకు ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పారు.

  Comments

  comments

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here