తన ఫంక్షన్ కి పర్మిషన్ ఇవ్వనందుకు చిరంజీవి హర్టయ్యాడా.?

173

దశాబ్ధం పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నం.150 అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముందుగా విజయవాడలో అనుమతి కోరగా చంద్రబాబు నిరాకరించినట్టు తెలుస్తోంది. పోనీ గుంటూరులో ఫంక్షన్ చేసుకోవడానికి కూడా చిరంజీవి సభకు అనుమతివ్వలేదు చంద్రబాబు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలోని కాపులంతా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమయంలో చిరంజీవి మీటింగ్ పెడితే ఇప్పటికే చిరంజీవి కాపు ఉద్యమానికి న్యాయకత్వం వహిస్తున్నందుకు కాపులంతా చిరంజీవి సభతో ఏకమై కార్యాచరణలు రూపొందించే అవకాశాలున్నాయని భావించే చంద్రబాబు ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిరంజీవి చాలా సీరియస్ గా తీసుకున్నారట..

కేంద్రమంత్రిగా పని చేశాను.. దశాబ్ధాల పాటు తిరుగులేని అగ్ర కధానాయకుడిగా వెలిగాను.. నాతమ్ముడు చంద్రబాబుకోసం కష్టపడి పనిచేశాడు.. అయినా చంద్రబాబు నా సభకు కనీసం అనుమతివ్వలేదని ఇందుకు తాను కూడా సమయం వచ్చినపుడు చెప్తా అంటూ సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది.

Comments

comments