చిరంజీవి కాంగ్రెస్‌ని వీడి ఆ పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం..!!

  0
  595

  చిరంజీవి అడుగులెటువైపు..!!

   

   

  తిరుగులేని నాయకుడిగా వెండితెర‌పై దుమ్ము దుళిపిన హీరో మెగాస్టార్ చిరంజీవి. రెండు ద‌శాబ్దాల పాటు ఓ ఊపు ఊపిన అసలు సిసలు మాస్ హీరో చిరు. ఇలా వెండితెరపై వెలిగిన మోగాస్టార్… పొలిటిక‌ల్ ఆన్‌స్క్రీన్ పై అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఏపీని ఏలుదామనుకుంటే.. రాజ్యసభలో కూర్చోవాల్సి వచ్చింది. 2007లో చివ‌రి సినిమా శంక‌ర్‌దాదా జిందాబాద్ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన చిరు 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోర‌మైన ఓట‌మిని ఎదుర్కొన్నాడు. త‌ర్వాత త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్య‌స‌భ‌కు ఎంపికై కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశాడు.

  ఇక చిరు ద‌శాబ్దం విరామం త‌ర్వాత తిరిగి వెండితెర‌మీద రీ ఎంట్రీ ఇస్తున్నాడు. త‌న కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత తిరిగి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే తాను కేంద్ర‌మంత్రిగా ప‌నిచేసిన కాంగ్రెస్ పార్టీకి ఇటు ఏపీలోను, అటు కేంద్రంలోను ఇప్ప‌ట్లో ఫ్యూచ‌ర్ ఉండే ఛాన్సులు లేవు. ఆ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డా అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆశ‌లు కూడా సాధార‌ణ జ‌నాల‌తో పాటు చిరుకు కూడా లేవు.

  ఈ క్ర‌మంలోనే చిరు త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ను స‌రికొత్త‌గా ప్లాన్ చేసుకోవాల‌ని చిరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీకి చిరు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. చిరు ఇటీవ‌ల బీజేపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే గుంటూరులో జ‌రిగిన ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు అటు బీజేపీ, ఇటు టీడీపీ మంత్రులు ఇద్ద‌రూ హాజ‌ర‌య్యారు.

  ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు ఈ ఫంక్ష‌న్‌లో త‌ళుక్కున మెరిశారు. ఈ ఫంక్ష‌న్ త‌ర్వాత చిరంజీవి పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి హాయ్‌లాండ్‌లో పునాది ప‌డిందని జోరుగా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని కొంద‌రు, కాదు సైకిల్ ఎక్క‌నున్నార‌ని మ‌రికొంద‌రు బలంగా వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఏదేమైనా ఖైదీ రిలీజ్ అయ్యాక‌…వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే చిరు బీజేపీ లేదా టీడీపీల‌లో ఏదో ఒక పార్టీలో చేర‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి చిరు రూటు ఎలా మారుతుందో చూడాలి.

  Comments

  comments

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here