త్వరలో వైసీపీలోకి నటి హేమ.. అందుకే అలా..!!

637

నటి హేమ పద్దతి చూస్తుంటే.. త్వరలో వైసీపీలోకి చేరుతున్నట్లు సంకేతాలు పంపితున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజకీయాల్లో వచ్చిన హేమ .. జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటి చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించలేదు. కనీసం తన నోటి వెంట ఎప్పుడూ రాజకీయాలను ప్రస్తావించిన దాఖలా కూడా లేదు ఓడిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య సినిమాలు తగ్గటంతో మళ్లీ రాజకీయాల వైపుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. శనివారం రోజు అప్పన్న స్వామిని దర్శించుకున్న హేమ..కాపుల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా హేమ చంద్రబాబును తీవ్ర స్ధాయిలో దుమ్మెత్తి పోశారు.

తాజాగా ముద్రగడకు మద్దతు పలుకుతూ.. టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాపులకు అండ గురువారం నాడు జరిగిన కాపు మహిళా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ముద్రగడకు ఉడతాభక్తిగా తనవంతు సహాయం అందించేందుకే తనకు తానుగా సదస్సుకు వచ్చానని చెప్పారు. కాపు ఉద్యమంలో పాల్గొంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేదన్నారు. కాపు రిజర్వేషన్ గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామిని గుర్తుచేస్తూ.. కాపులను బీసీల్లో చేరుస్తామన్న మేనిఫెస్టోను గుర్తెరిగి కూడా మిగతా కులాల నాయకులు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారని హేమ ప్రశ్నించారు. సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. మొత్తానికి కాపు ఉద్యమానికి తనవంతుగా మద్దతు ప్రకటించిన హేమ.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే ప్రయత్నమేమైనా చేస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే తాను రాజకీయాల్లోకి వస్తే.. ఖచ్చితంగా వైసీపీలోకి వస్తారన్న ఊగహాగానులు వినిపిస్తున్నాయి.

Comments

comments