తానే స్వయంగా వెళ్లి మరీ జైలు నుంచి తీసుకొచ్చాడు.. అదీ నిలబడటం అంటే..!!

264

 

వి లవ్యూ కొడాలి నానీ అంటూ కాలర్ ఎగరేసిన వైసీపీ నేతలు..!!
ఈ మధ్య సోషల్ మీడియాలో కొడాలి నాని పేరు మారు మోగిపోతుంది. గుడివాడలో ఏం చేసినా.. చివరికి కొడాలి నాని పేరు బయటకొస్తుంది. తాజాగా వైకాపా తరపున గెలిచి, మున్సిపాలిటీలో వైకాపా సాధించిన ఆధిక్యం మీద ఆధారపడి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన యలవర్తి ఇటీవలే తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు.ప్రజలు ఒక పార్టీకి మున్సిపాలిటీ అధికారాన్ని అప్పగిస్తే.. ఆయన అధికార పార్టీ వైపు జంప్ చేశాడు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు తీవ్రమైన ఆక్రోశానికే లోనయినట్టున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం మార్కుతో హాజరయ్యాడు యలవర్తి.
దీంతో కడుపు మండిన ఒక వైకాపా నేత యలవర్తిని బూటుతో కొట్టారు.

ఫిరాయించడానికి సిగ్గులేదా.. మా పార్టీ తరపు నుంచి దక్కిన పదవికిరాజీనామా చేసి పచ్చ కండువా కప్పుకో అని వ్యాఖ్యానిస్తూ.. ఈ తీవ్రమైన చర్యకు పాల్పడినట్టు సమాచారం.ఈ చర్యను వైఎస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సమర్థించారు. అలా చెప్పుకొట్టినందుకు గాను కార్పోరేటర్ రవికాంత్ ను జైలులో పెట్టారు. తాజాగా ఆయన రిలీజ్ అయ్యారు. అయితే రవికాంత్ ని కొడాలినాని తానే స్వయంగా జైలు నుండి విడుదల చేయించుకుని, తానే స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.

Comments

comments