బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి(66) కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే సహజంగా జరిగిన ఈ మృతి వెనక ఓ పెద్ద కుట్ర ఉందని పాకిస్దాన్ కు చెందిన టీవి ఛానెల్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఆ కుట్ర చేసింది ప్రధాని నరేంద్ర మోడి అని చెప్తూ ఓ పోగ్రాం ప్రసారం చేసింది. ఓంపురిది సహజ మరణం కాదని, ఆయనను హత్య చేశారాఅంటూ.. పాకిస్థాన్‌కు చెందిన బోల్‌టీవీ చానల్ ఆసక్తికర వార్తను ప్రసారం చేసింది.
ఓంపురి హత్య వెనక మోదీ హస్తం ఉందని ఆరోపించింది. పాకిస్థాన్ కళాకారులకు ఆయన మద్దతు పలకడంతో జీర్ణించుకోలేని మోదీ ఓంపురిని చంపించారని చెబుతోంది. అయితే ఇది హాస్యాస్పద కథనం కావడం గమనార్హం. ఓంపురి మృతి వెనక ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హస్తముందని బోల్ టీవీ ప్రసారం చేసింది.
తన వద్దకు వచ్చిన ఓంపురికి పీకలదాకా మద్యం తాగించారని కథనంలో పేర్కొంది. తర్వాత అక్కడే ఆయన దుస్తులు మొత్తం ఊడదీసి చితక్కొట్టారని వివరించింది. వారు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే ఓంపురి మృతి చెందారని, ఆయన మృతదేహంపై ఆయనను చంపిన వ్యక్తి ఆనవాళ్లు ఉన్నాయని చానల్ పేర్కొంది. అంతేకాదు వాటిని దగ్గరుండి చూసినట్టు పేర్కొంది. ఆ ఛానెల్ అక్కడితో ఆగకుండా…ఇప్పుడు మోదీ లిస్టులో పాకిస్థాన్ నటుడు ఫవాద్‌ఖాన్, బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా ఉన్నారని పేర్కొన్న చానల్ వారు ముస్లింలు కావడమే ఇందుకు కారణమని వివరించింది.