చిరంజీవి సాక్షిగా: ఇంకా కోపం తగ్గలేదు.. బన్నీని కొట్టేందుకు పక్కా ప్లాన్ ..!!

1380

 

 

ఇంకా వారిలో ఆ కోపం తగ్గలేదు. నివుకు గప్పిన నిప్పులా అలాగే ఉంది. తట్టి లేపితే ఖచ్చితంగా.. మంటలు వ్యాపించి తగలబడిపోతాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ పంక్షన్‌లో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. పవన్‌ కల్యాణ్‌ పేరును మెగా హీరోలు ప్రస్తావించలేదన్న కోపంతో ఫంక్షన్‌ ముగిసిన మరుక్షణమే పవన్ అభిమానులు విధ్వంసానికి దిగారు. వందలాది కూర్చీలను విరగొట్టి కుప్పగా పడేశారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. వారు చేసిన హాంగామా అంతా ఇంతా కాదు.. పోలీసులు, నిర్వహకులు కూడా అడ్డుకోలేకపోయారు. మెగా హీరోలను పచ్చిబూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దృశ్యాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే తాజాగా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

ఫంక్షన్‌కు వచ్చిన అల్లుఅర్జున్ కారు దిగగానే పవన్‌ అభిమానులు అతడిని చుట్టుముట్టారన్న వార్త బయటకి వచ్చింది. బన్నీ ముందుకు వెళ్లకుండా కేకలు వేస్తూ అడ్డుపడ్డారంట. ఆ సమయంలో బన్నీ కూడా ఏమీ చేయలేక కాసేపు ఆలాగే ఉండిపోయారు. చివరకు అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చారు. గతంలో సరైనోడు ఫంక్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి బన్నీ చేసి కామెంట్స్ ఇంకా వాళ్లు మరిచిపోలేదు.. అందుకే అల్లు అర్జున్ సభలో కూడా నేను కంట్రోల్ గా మాట్లాడానని అనుకుంటున్నట్లుగా తెలిపారు.

ఇప్పట్లో ఈ గొడవ సద్దుమనిగేలా కనిపించటం లేదు.. ఈ విషయంపై పవన్ స్పందించి.. సహనం పాటించమని చెబితే కానీ.. ఫ్యాన్స్ తగ్గేలా కనిపించటం లేదు.

Comments

comments