ఆర్ నారాయణ మూర్తికి అండగా నిలిచిన రామోజీ రావు..!!

  0
  161

  ఇండస్ట్రీలో మంచి వ్యక్తిగా ముక్కుసూటిమనిషిగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆర్ నారాయణ మూర్తి. అయితే రీసెంట్ గా తన చిత్రం రిలీజ్ చేసుకోవడానికి ఒక థియేటర్ అయినా ఇవ్వండంటూ నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం బహిరంగంగా వేడుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు కానీ..ఊహించని విధంగా ..ఆర్ నారాయణ మూర్తిగా ఓ పెద్ద అండ లభించేసింది. మీడియా మొఘల్ రామోజీరావు… మూర్తిగా అండగా నిలిచారు.

  ప్రస్తుతం అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్న రామోజీ… ఆర్. నారాయణ మూర్తి పడుతున్న ఇబ్బంది చూసి చలించిపోయారని తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన తన స్టాఫ్ ని పిలిచి నారాయణ మూర్తి ఇబ్బందులు తీర్చేయండని చెప్పారంట. అంతే క్షణాల్లో మూర్తి చిత్రానికి 100కు పైగా థియేటర్లు దొరికిపోయాయి. రామోజీ ఆధ్వర్యంలో మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ధియోటర్స్ ని ఎరేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  ఈ క్రమంలోనే హైదరాబాదులోని సంధ్య 35ఎంఎం థియేటర్లోనూ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజ్ కానుందట. ”తొలిసారి నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ నెల 14న రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ఈ సంక్రాంతికి నా సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. మెగాస్టార్ – యువరత్న మధ్యలో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్లతో నాకు పోటీ లేదు. ఐతే నా సినిమాకి ఒక్క థియేటర్ కూడా దొరకని పరిస్థితి. మరీ ఒక్క థియేటర్ కూడా లేదు అంటుంటే ఏడుపొస్తోంది. కొంత మంది చేతుల్లో థియేటర్లుండటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజవుతుంది కదా థియేటర్లు ఎన్ని దొరికాయి అని నిర్మాతని అడిగినప్పుడు ఆయన ఒక్క థియేటర్ కూడా దొరకలేదని చెప్పగానే ఏడుపొచ్చింది అంటూ ఆర్. నారాయణ మార్తి ఆవేదనగా అన్నారు. ఈ సంక్రాంతికి ‘ఖైదీ నెం 150, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి, జయసుధలు జంటగా నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంట్రామయ్య’ కూడా జనవరి 14న రిలీజ్ కానుంది.

  Comments

  comments

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here