వల్లభనేని వంశీకి కొడాలి నానితో పనేంటి..వల్లభనేని చూట్టు ఏం జరుగుతుంది.. !!

867

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ రూమర్లు షికారు చేస్తున్నాయి. ఇవన్ని ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ.. వల్లభనేని సోషల్ మీడియాలో గట్టిగానే టార్లెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై రాద్దాంతం జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం వంశీ తెగ ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారం చేతిలో ఉన్నా.. ఏం చేయలేని పరిస్ధితిలో వంశీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు ఆయన మీద వచ్చిన రూమర్లను చూడుచుకుంటూ వస్తున్నారు. అవి ఇప్పుడు మితి మీరిపోతున్నాయి.

వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్తారంటూ కొద్దికాలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆరా తీసిన వంశీకి సొంత సామాజికవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే ఈ ప్రచారం చేయిస్తున్నట్టు స్పష్టమైందని చెబుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా వంశీ వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం చేయిస్తున్నట్టు ఆయనకు అర్థమైందట. ఇలా చేయడం వెనుక తనను దెబ్బతీసే కుట్ర ఉందని వంశీ అనుమానిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ నేతలు, తానంటే గిట్టని వారే ఈ ప్రచారం చేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో వంశీకి మంచి సంబంధాలు ఉండడం, గతంలో ఒకసారి జగన్‌ వస్తే కౌగిలించుకోవడం వంటి అంశాలను కూడా చూపిస్తూ వంశీ ఎప్పటికైనా వైసీపీలోకి వెళ్లేవారే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కారణంగా టీడీపీ అధినాయకత్వం కూడా వంశీని అనుమానాస్పదంగానే చూస్తోంది. దీంతో వంశీ చికాకుపడుతున్నారు. ఈ ప్రచారానికి ఎలాగైనా చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు వంశీ.

Comments

comments