సరిహద్దులో కాపలా కాస్తున్న తేజ్ బహదూర్ చేసిన ఆరోపణలపై స్పందించిన బీఎస్‌ఎఫ్‌..!!

121

సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను చేసిన ఆరోపణలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క వీడియోతో జవాన్లకు సరైన తిండిపెట్టడం లేదన్న ఆరోపణలు ఇండియన్ ఆర్మీ ఎదురుకుంది. ఈ విషయంపై బీఎస్‌ఎఫ్‌ స్పందించింది. ఆరోపణలు చేసిన కానిస్టేబుల్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌.. పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తి అని తెలిపింది. 2010లో సీనియర్‌ అధికారిపై తుపాకి గురిపెట్టినందుకు ఆయనకు సైనిక కోర్టు 89 రోజుల కఠిన కారాగార శిక్ష కూడా విధించిందని వెల్లడించింది. యాదవ్‌ కుటుంబం, పిల్లలను దృష్టిలో ఉంచుకుని అప్పుడు విధుల నుంచి తొలగించలేదని తెలిపింది. యాదవ్‌పై పలు రకాల ఫిర్యాదులు ఉన్నట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

యాదవ్‌ ఇప్పటికే స్వచ్ఛంద పదవీవిరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. జనవరి 31న విధుల నుంచి వైదొలగనున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ శిబిరంలో జవాన్ల నుంచి ఆహారానికి సంబంధించిన ఫిర్యాదులు అందలేదని, తాజాగా జరిపిన ప్రాథమిక విచారణలోనూ ఎవరూ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేయలేదని వెల్లడించారు. ఆరోపణలపై విచారణ పారదర్శకంగా జరగడానికి యాదవ్‌ను మరో కేంద్రానికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

Comments

comments