ఐజయ్య కొట్టిన దెబ్బకు బిత్తరపోయిన చంద్రబాబు.. మళ్లీ ఆ తప్పు జన్మలో చేయడంట..!!

339

బాబుకు ఐజయ్య భయం పట్టుకుంది.. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు..!!

కర్నూలు జిల్లా ముచ్చమర్రి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఇచ్చిన కౌంటర్‌ చంద్రబాబుపై గట్టిగానే పనిచేసింది. ఐజయ్య కొట్టిన దెబ్బతో సోషల్ మీడియాలో బాబు పరువు పోయినంత పని అయింది. ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సభలో గంటన్నరపాటు ప్రాజెక్టు తన వల్లే సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోగా.. చివర్లో వచ్చి బాబు పరువు తీశాడు. ఇదంతా వైఎస్ చలవేనంటూ ముక్త కంఠంగా చెప్పుకొచ్చాడు. మరోసారి అలాంటి అనుభవం చంద్రబాబుకు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో పైడిపాలెం ప్రాజెక్టుకు నీటి విడుదల కోసం వస్తున్న చంద్రబాబు ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఇక్కడ కూడా ప్రాజెక్టు తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటారు. అలాంటి సందర్బంలో స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డిని అనుమతిస్తే ఆయన తప్పకుండా వైఎస్‌ హయాంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం 90 శాతం పూర్తయిందని చెప్పడం ఖాయం. అందుకే ఆయన్ను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. అవినాష్‌ రెడ్డితో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులను కూడా చంద్రబాబు పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే ఐజయ్య చేసిన పని చంద్రబాబుపై గట్టిగానే ప్రభావం చూపినట్టుగా ఉంది.

Comments

comments