బాబు పర్యటనతో..జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డి, పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్..!!

528

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు కడప జిల్లా పర్యటన చేపట్ట నున్నారు. జగన్ ఇలాకాలో బాబు పర్యటిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముందస్తు చర్యగా కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఎంపిని హౌజ్ అరెస్టుచేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

పైడిపాలెం రిజర్వాయర్ పనులను 90 శాతం వైఎస్ఆర్ పూర్తి చేశారని , అయితే ప్రాజెక్టులన్నింటిని తానే పూర్తిచేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని ఎంపి అవినాష్ రెడ్డి విమర్శించారు.తనను నిర్భంధించడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఆయన చెప్పారు.జన్మభూమిలో సమస్యలు చెప్పుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందని, తమ సమస్యలు చెప్పుకొవడానికి రాకుండా అరెస్టు చేయడం సరైంది కాదని ఆయన ప్రశ్నించారు.

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో బాబుపై మరో సెటైర్ షూరు అయింది. ఇప్పటి వరకు జగన్ అంటేనే చంద్రబాబు బయపడుతారు అనుకున్నాం… ఇప్పుడు తమ్ముడు ఎంపి అవినాష్ రెడ్డి చూసి కూడా బాబు భయపడుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు.

Comments

comments