చిరంజీవి ఖైదీ జగన్ రైతుభరోసా యాత్రను ప్రశంసించినట్టేనా.?

820

 

మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధం తర్వాత తీసిన సినిమా ఖైదీ నం.150.. ఈ సినిమా విడుదలై ఇప్పటికే హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డుల మాట పక్కనుంచితే ఈ సినిమా నేపధ్యం మొత్తం రైతు సమస్యలపై తిరుగుతోంది. రైతుల కధాంశంగానే ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇప్పటికే ఏపీలో రైతుల పరిస్థితి అత్యంత అద్వాన్నంగా ఉంది.

దీనికితోడు ప్రతిపక్షనేత జగన్ కూడా రైతు భరోసా యాత్రలు చేస్తున్నారు. ఈ సమయంలో రైతుల పై వచ్చిన ఈ సినిమా మరింత ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా కనిపిస్తోంది. పైగా చిరంజీవి తీసిన సినిమాల ప్రభావం తెలుగువారిపై దాదాపుగా ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే చిరంజీవి సభకు ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.

అయితే బాబు పాలనలో రైతులు కష్టాలు పడుతున్నారని, ప్రతిపక్షనేత జగన్ రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చిన సినిమా కూడా పరోక్షంగా జగన్ కి సపోర్ట్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం విడుదలైన ఈ సినిమాతో ప్రజలు, రైతుల్లో ఈ ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో వేచిచూడాలి.

Comments

comments