టిక్కెట్లు దొరకలేదని గొంతు కోసుకున్న పిచ్చి అభిమాని..!!

  0
  172

   

   

  రోజు రోజుకు పిచ్చి అభిమానం ముదిరిపోతుంది. సినిమాల కోసం, హీరోల కోసం.. అభిమానులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో కన్నవాళ్లు, కట్టుకున్నది, పిల్లలున్నారన్న ద్యాసే లేకుండా.. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కేవలం సినిమా కోసం ప్రాణాలను పనంగా పెట్టి దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నారు.

  గతంలోను.. ఫ్యాన్స్ ఫ్యాన్ మధ్య పెద్ద గొడవలు జరిగాయి. మా హీరో గొప్ప వాడంటే.. మా హీరో గొప్ప వాడని వాదన పెట్టుకున్నారు. ఆ వాదన కాస్త వివాదంగా మారింది.. చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్ధితి వెల్లిపోయారు. ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం చెలరేగింది. పైకి అంతా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోవాలి కానీ ఇలా.. కొట్టుకుంటారా, చంపుకుంటారా అని అనుకుంటూనే.. సమయం వచ్చినప్పుడు చేసే వెధవ పనులు చేస్తునూ వున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహణ తిరుపతి ఘటనే..

  తాజాగా చిరు 150వ సినిమా టిక్కెట్టు కోసం జరిగిన ఘటన చాలా సిగ్గు చేటుగా అనిపిస్తుంది. కేవలం చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న ఉద్దేశంతో.. టిక్కెట్ల కోసం పరుగు తీసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. టిక్కెట్టు కోసం క్యూ లైన్ లో తిరుగుతున్న సమయంలో గొంతు కోసుకు పోయింది. చొక్కా చినిపోయింది. చాలా దారుణమైన పరిస్ధితిలోకి వెళ్లిపోయాడు. గొంతు నుంచి రక్తం వడి వడిగా కారిపోతుంటే.. పట్టించుకునే దానుడే అక్కడ కరువయ్యాడు.

  ఇవాళ కాకపోతే రేపు చూడవచ్చు ..రేపు కాకపోతే ఎల్లుండి చూడవచ్చు ..ఎప్పుడు చూసిన అదే సినిమా ..అదే స్టొరీ ..ఇవాళ చూడకపోతే స్టొరీ మారుతుందా ..?లేదా హీరో మారతాడా ..?నువ్వు పోతే నీ కుటుంబానికి దిక్కు ఎవరు ..? వాళ్ళ గురించి ..వాళ్ళ సినిమాల గురించి ఆలోచించకుండా మీ భవిష్యత్ గురించి ఆలోచిస్తే మీరు మీ జీవితంలో రియల్ హీరో అని పదిమంది అనుకుంటారు. ఇప్పటికైనా మారండి.. మీ కుటుంబం కోసం బ్రతకండి.

  Comments

  comments

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here