చిరు సినిమాలో జగన్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..!!

6712

కర్నూలు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆ యాత్రకు ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. జగన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అప్పుల బాధతో చనిపోయిన రైతన్నల కుటుంబాలను పరామర్శిస్తూ యువనేత ముందుకు కదిలారు.వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర పెద్ద సక్సెస్ అయింది..

 

దారి పొడవునా ప్రజల్ని పలకరిస్తూ ముందుకు సాగారు జగన్‌. లింగాపురంలో వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకంచేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగన్.
ఈ భరోసా యాత్రను భేస్ చేసుకుని జగన్ అభిమానులు చిరు సినిమాలోని నీరు నీరు సాంగ్ ని జగన్ కి లింక్ చేస్తూ.. ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ వీడియో వైరల్ గా మారింది.

Comments

comments