ఆయనను బట్టలూడదీసి కొట్టేంత సీన్ జలీల్ కు ఉందా.?

560

తాజాగా కడప జిల్లాలో జరిగిన పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరుగిన కార్యక్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెలరేగిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు, కేవీపీలపై జలీల్ ఫైరయ్యారు. జగన్ పార్టీపైనా విరుచుకుపడ్డారు. వంద మంది జగన్‌లు వచ్చినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్ రక్తపుటేరులు పారించిన పులిచింతల కాలువలో చంద్రబాబు మంచి నీరు పారిస్తున్నారని అన్నారు.

20 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా.. జగన్‌ ఎందుకు వెళ్లారో అడగలేదని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉండడం దురదృష్టకరమన్నారు. దోపిడీలో కేవీపీ నెంబర్ వన్ వ్యక్తి అన్న జలీల్ ఖాన్.. కేవీపీని బట్టలూడదీసి కొడితే ఎంత దోచుకున్నాడో బయటపడుతుందన్నారు. అయితే చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకు అన్నారా లేదా ఏదో అనాలి కదా అని అన్నారో తెలియదు కానీ తన స్థాయి మరిచి మాట్లాడారని తెలుస్తోంది.

ఎందుకంటే జగన్ పార్టీనుంచి గెలిచి జగన్ ని పొగిడిన జలీల్ ఈవిధంగా మాట్లాడడం టీడీపీ నేతలకే నివ్వెరపోయేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీనుంచి టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో కొందరు జంపింగ్ లు తిరిగి తప్పైపోయిందంటూ వైసీపీలోకి చేరేందుకు యోచిస్తున్నారు. ఈ క్రమంలో జలీల్ జగన్ ను ఇష్టానుసారంగా మాట్లాడి ఆ ఉన్నకాస్త అవకాశాన్నీ పొగొట్టుకుని బీకాంలో ఫిజిక్స్ తెలివితేటలు చూపించాడు.

Comments

comments