జగన్ ఇలాకా.. పులివెందులకు వచ్చి తొడకొట్టి సవాల్ విసిరిన జేసీ..!!

1723

తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి ప్రతి సారి నోరు జారుతున్నారు. సమయం సందర్బం లేకుండా నోటికొచ్చింది మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. వైసీపీ నేతలను, రెడ్డి కులాలను రెచ్చకొట్టేలా జేసీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి వైసీపీ నేతల్లో అగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటి విడుదల సందర్భంగా కడప జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్‌ చెంచాగాళ్లంతా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ”ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి గాడు నాలుక కోస్తానంటాడా. మగాళ్లైయితే రండిరా. పులివెందుల వచ్చా. వచ్చి టచ్ చేయండి. చూద్దాం. ప్రతి యధవనాకొడుకు మాట్లాడేదా. వాడికి తెలియదు నీకు( జగన్‌) తెలియదు. మీ తాత గుణాలు వచ్చాయి. మీ నాన్న గుణాలు కొన్నైన వచ్చి ఉంటే బాగుపడేవాడివి. తాత బుద్ది ఉన్నోడివి నీవు. అదే బుద్ది ఉన్న వాడిని తాడిపత్రి ఇన్‌చార్జ్‌గా పెడుతావా” అంటూ జేసీ ఫైర్ అయ్యారు. తాను జానీవాకర్ ను కాదని జేసీ చెప్పారు. తాగుడు అలవాటు తనకులేదని చెప్పారు.

జేసీ ఇప్పుడే కాదు గతంలోను ఇలాగే వాగారు. జగన్ వాడు తిక్క ముండా కొడుకు కాకుంటే.. అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లు కావాలనుకునే వారు పట్టిసీమను వ్యతిరేకిస్తారా అని నిలదీశారు. ప్రజలందరూ పోలవరం కావాలని అనుకుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో చెప్పాలన్నారు. అయితే, తిక్క ముండా కొడుకు వ్యాఖ్యలపై వైసిపి నేతలు భగ్గుమన్నారు. జగన్‌పై తీవ్ర వ్యాఖ్య జగన్‌ను ఉద్దేశించి ‘వాడు’ అని పదే పదే ఉపయోగిస్తుంటారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి తనకు దగ్గర అని, జగన్‌ను తాను చిన్నప్పటి నుంచి చూశానని, ఆ చనువుతో తాను జగన్‌ను ‘వాడు’ అంటుంటానని జేసీ వివరణ ఇస్తుంటారు. ఏది ఏమైనా.. ఓ ప్రజా నాయకున్ని అలా అనటం సరికాదు అని పలువు సీనియర్లు అంటున్నారు.

Comments

comments