వరుసవ్యాఖ్యలతో చెలరేగాడు.. చివరిలో తుస్సుమనిపించాడు.. ఇదెవ్వరూ గమనించలేదు..

1755

వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకుల విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా కడపజిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్, జగన్ పార్టీపై నిప్పులు చెరిగారు. శ్రీకాంత్ రెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. వయసులో చిన్నవాడు.. చిన్నప్పటి నుంచి చూసినవాడు అనే ఉద్దేశంతో కొద్దిగా ఆప్యాయంగా వాడు అని జగన్‌ను సంభోధించాను తప్ప పొగరుతో కాదన్నారు.

తాను అలా పిలవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. అందుకే ఇకనుంచి జగన్‌ను ‘వాడు’ అని సంబోధించనని, ‘శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు’ అని సంబోధిస్తానని వెటకారంగా మాట్లాడారు.. జగన్‌కు తాత గుణాలు వచ్చాయని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డి విమర్శలపైనా జేసీ స్పందించారు. తాను బూట్లు నాకేవాడిని అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినన్నారు. నా నాలుక చీలుస్తావా? అంత మగాడివా? ఎక్కడికి రావాలో చెప్పు.. నీ ఊరికొస్తా.. పులివెందులకు వస్తా.. నన్ను ముట్టుకొని చూడు ఏం అవుతదో తెలుస్తది అంటూ రాయలసీమ యాసలో ఆగ్రహించారు. 2019లో పులివెందులలో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా సభ వేదికపైనే ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని జేసీ, సీఎంతో అన్నారు. ఏపని చేయాల్సివచ్చినా లంచం అడుగుతున్నారని ఆయా అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజల సమక్షంలోనే చెప్పేసాడు.. చంద్రబాబు వద్దు.. వద్దు.. అంటూ సైగ చేసేలోపే జేసీ లూజ్ టంగ్ తో మొత్తం బయటపెట్టేసాడు.. దీంతో అందరూ నవ్వుకున్నారు. ధ్వజమెత్తారు.. దృష్టికి తీసుకువచ్చారు. సూట్‌ పేరుతో దళారుల సాగిస్తున్న దందాను ఆపించాలని కోరారు. అయితే చంద్రబాబు ఎదురుగా ఇలా చేయడం పార్టీ నేతలకు మాత్రం ఎంతో సిగ్గనిపించింది

Comments

comments