ఆ పేరు ఎత్తగానే కూర్చీల్లోంచి లేచి సభలో గందరగోళం చేసిన వైసీపీ నేతలు..!!

1201

 

కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. చంద్రబాబు పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పులివెందులకు నీళ్లు రాకుండా వైసిపి అడ్డుకుందని ఆరోపించారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చి తామేమిటో నిరూపించుకున్నామన్నారు. ఇక పులివెందులలో గొడవలు ఉండవని చెప్పారు. పులివెందులను దేశానికి ఆదర్శంగా మారుస్తానని చెప్పారు.

అక్కడితో సొంత డబ్బాలతో ఆగని బాబుగారు… పులివెందులకు నీళ్లు ఇచ్చినందుకు వైసిపి నేతలు అసహనంతో ఉన్నారన్నారు. ఇక్కడ ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. అనుభవం లేని వ్యక్తులు నన్ను విమర్శిస్తున్నా మీకోసం (ప్రజలు) భరిస్తున్నానని చెప్పారు. ఎప్పుడు పులివెందుల ఫ్యాక్షన్‌తో రగిలి పోవాలని కోరుకుంటున్నారని వైసిపిని ఉద్దేశించి మండిపడ్డారు. దీంతో అక్కడే సభలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కసారిగా లేచి గందరగోళం సృష్టించారు. వైసీపీని, జగన్ ని ఏదైనా అంటే ఊరుకునేది లేదని అరుపు గుప్పించారు.

ఇవన్ని వింటున్న బాబు మరింతగా రెచ్చిపోయారు. వైసీపీ అభివృద్దిని అడ్డుకుంటుందని అన్నారు. దీనికి వైసీపీ అభిమానులు లేచి తుండులతో కాదుఅన్నట్టుగా ఊపుతూ.. నినాదాలు చేశారు.

Comments

comments