గౌతమిపుత్రశాతకర్ణి కి రామ్ గోపాల్ వర్మ రివ్యూ

905

గౌతమిపుత్రశాతకర్ణి సినిమా సంబంధించిన ప్రతి దాని పై  పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ గానే స్పందిస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ప్రతీ విషయంమీద నెగిటివ్ షేడ్స్ చూపించే వర్మ శాతకర్ణి విషయంలో పూర్తిగా యూ టర్న్ తీసుకున్నాడు.  ఈ సినిమా ఫస్టాఫ్ తాను చూశానన్న రామ్ గోపాల్ వర్మ సినిమా అద్భుతంగా వచ్చిందని తన రివ్యూనిచ్చేశాడు. అయితే, ఈ సినిమాని తాను ఎక్కడచూశానన్నది..తనకు ఎవరు చూపించారన్నది మాత్రం చెప్పనంటూ తనస్టైల్ మెలిక పెట్టాడు. సినిమాని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన తీరు చూస్తుంటే, అతనిమీద తనకు అసూయగా ఉందన్నాడు. ఇంతకు మించి ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని.. రిలీజ్ రోజు మాట్లాడతానని వర్మ చెప్పుకొచ్చాడు.

untitled-3

Comments

comments