చిరు రోజా వీళిద్దరిని కలిపింది ఎవరో తెలుసా..!!

1268

కనిపిస్తే కారాలు మిరియాలు.. మైక్ ఇస్తే ముష్టి యుద్దం చేసుకునే వాళ్లు.. తీరా ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటయ్యారు వారే రోజా చిరంజీవి. ఒకరినొకరు సర్ ప్రైస్ చేసుకున్నారు. గ్రీటింగ్ చెప్పుకున్నారు. ఆ సన్నివేశం చూస్తే హీరోయిన్లు జంటలా గతాన్ని తలపించారు. ఇంతకీ అంత సాన్నిహిత్యానికి తెర లేపింది ఎవరు.? వీరిద్దరు ఇలా కలవాలని పక్కా ప్లాన్ గీసింది ఎవరు..? ఇప్పుడు ఈ ప్రశ్న సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఓ టీవీ ఛానల్ కోసం రోజా అలా చిరంజీవిని ఇంటర్వూ చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి మీద అభిమానం ఉంటే విషెస్ చెబుతారు. కానీ వెరైటీగా ఇంటర్వూ చేసింది. అసలు ఏం జరిగింది.. దీని వెనకాల ఎవరున్నారు.

చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఈజీ గోయింగ్ గా కనిపిస్తారు. అలా మెగాస్ఠార్ గా ఎదిగారు. ఎదగటం తప్ప మరొ పని మీద అసలు ఆలోచనే ఉండదు మెగా స్టార్ కి. కానీ రాజకీయంలో చతికిల పడ్డారు. అయినా.. రాజకీయాల మీద ఇష్టం ఏ మాత్రం తగ్గలేదు మెగాస్టార్ కి. కానీ అనుకున్నవి ఏవీ జరగపోవటంతో.. సినిమాలకు వచ్చారు. అయినా రాజకీయాలపై మక్కువ చావలేదు. అందుకే తన స్టైల్ లో కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టబోతున్నారు చిరు.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. చిరంజీవికి చంద్రబాబుకి కొసగటం లేదు.. ఆ విషయం బహిరంగానే తెలుస్తోంది. అంటే టీడీపీతో కటీఫ్ చెప్పినట్టే..ఇక కాంగ్రెస్ పనైపోయింది. మిగిలింది వైసీపీ.. ఇప్పటికే కాపు కోసం పొరాడుతున్న ముద్రగడ జగన్ తో సన్నిహితంగా నే ఉన్నారు. దాసరి కూడా.. ఇక మిగిలింది చిరంజీవి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తో కాంగ్రెస్ జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే.. జగన్ తో ఇప్పటినుంచే సంబంధాలు కొనసాగిస్తే మంచిదన్న ఉద్దేశంతో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే విధంగా వైసీపీ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కర్ర ఇరగకుండా.. పాము చావకుండా .. జగన్ ఈ విషయాన్ని డీల్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు చాలా మంది. ఇదే కనుక జరిగి చిరంజీవి వైసీపీకి సపోర్ట్ చేస్తే.. జగన్ ప్రభంజనాన్ని 2019లో ఆపటం ఎవరి తరం కాదంటున్నారు వైసీపీ శ్రేణులు.

Comments

comments