Connect with us

News

రాముడు ఒక దగుల్బాజీ.. సీత రావణాసురుడితోనే ఉంటే బాగుండేది..!: కత్తి మహేష్ పై కేసు నమోదు

Published

on

కత్తిపై-కేసు-నమోదు

   ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోనో, లేదా న్యూస్ ఛానల్స్ స్టూడియోల్లో ఉంటారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్. పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కత్తిపై  కేపీమెచ్ బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ సారి ఆయన ఏకంగా దేవుడినే టార్గెట్ చేశారు. రాముడిని కత్తి దుర్భాషలాడారంటూ హిందూ జనశక్తి నేతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన డిబేట్ లో కత్తి మహేష్ పాల్గొొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ లో తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ.. రామాయణం అనేది తనకొక కథ మాత్రమే అంటూ.. రాముడనేవాడు ఎంత దర్శవంతుడో అంత దగుల్బాజీ అని తాను నమ్ముతానని అన్నారు. రామాయణంలో సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో.. న్యాయం జరిగి ఉండేదేమో ఆవిడకు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కత్తి మహేష్ వ్యాఖ్యలతో ఆగ్రహంచారు జనశక్తి నేతలు. ఆయనపై కేజీహ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కత్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

comments

Featured

ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా.. ఎందుకో తెలుసా..?

Published

on

By

 

ప్రస్తుతం మానవజీవితాలు మొత్తం సోషల్ మీడియా చుట్టు తిరుగుతున్నవి. ఏ పండగొచ్చినా.. పబ్బం వచ్చినా.. కష్టం వచ్చినా సంతోషం వేసినా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫోటోలో ప్రత్యేక ఏంటని అనుకుంటున్నాారా.. అయితే ఒక్కసారి చూడండి.

పెళ్లికి ముందు, పెళ్లి తరువాత వివిధ సందర్భాల్లో ఫోటోలు దిగుతూ ఉంటారు. అయితే, కాలం మారుపోయింది. పెళ్లికి ముందే ఎంతో అన్యోన్యమైన దంపతులు చెప్పుకునేలా…ఎంతో కాలం నుంచి పరిచయమున్న ప్రేమికుల్లా, వధూవరులు ఫోటోలు దిగుతున్నారు.

తాజాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు తీయించుకున్న పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల పుణ్యమాని వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ పెరట్లోని ఓ చిన్న నీటి కుంటలో తట్టలో కూర్చుని, వర్షపు జల్లులు కురుస్తుండగా, తన్మయత్వంతో మునిగి తేలుతున్నట్టు ఓ ఫోటో తీయించుకున్నారు. అప్పుడు అక్కడ వర్షం లేదు. వారు అంత తన్మయత్వాన్నీ పొంది వుండరు. కానీ, ఈ చిత్రం మాత్రం దూసుకుపోతోంది. వారి అన్యోన్యతకు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.

Comments

comments

Continue Reading

News

రేవంత్‌ రెడ్డిని రవ్వంత లెక్క చేయని ఉత్తమ్…???

Published

on

By

Revanth reddy is the not count to Uttam kumar

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతున్నాయా..? సీనియర్‌ నేతలు ఒకరిపై ఒకరు గుర్రుగా ఉన్నారా.?? ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి ఆ పార్టీ తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చుక్కలు చూపిస్తున్నాడా..? అనే టాక్‌ జోరుగా వినిపిస్తోంది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

రేవంత్‌ రెడ్డి తనకు రాజకీయ జన్మను ఇచ్చిన టీడీపీని వదిలి కాంగ్రెస్‌ చెంతకు చేరారు. ఎన్టీఆర్‌ భవన్‌కు గుడ్‌ బై చెప్పి, గాంధీ భవన్‌లో కొలువు దీరారు. రేవంత్‌ రెడ్డి పార్టీలో చేరుతున్నప్పుడు ఆయనకు ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ రెండు హామీలు ఇచ్చాడట. అందులో ఒకటి తెలంగాణ ఎన్నికల కమిటీకి ప్రచార సారధిగా నియమించడం కాగా, చివరికి ఆ పార్టీ రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది..

రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ టీడీపీ నుండి తనతోపాటు వచ్చిన, రేవంత్‌ రెడ్డి తెచ్చిన నేతలకు పదిమందికి పైగా టికెట్‌లు ఇవ‌్వడం. నాడు రాహుల్‌ గాంధీ రేవంత్‌కి అభయం ఇచ్చినా, తాజాగా ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారట. రేవంత్‌ రెడ్డికి అంత సీన్‌ లేదని, ఆయన సీటు ఆయన గెలిచినా, పార్టీలో ఇతరులను గెలిపించే సీన్‌ లేదని, రేవంత్‌ పార్టీ ప్రచారానికి వస్తే అవినీతి పరుడు అనే ముద్ర క్లియర్‌గా కనిపిస్తుందని, కర్నాటకలో గాలి జనార్దన్‌ రెడ్డి మాదిరిగా రేవంత్‌కి ప్రజా బాహుళ్యంలో నెగిటివ్‌ ఇమేజ్‌ ఉందని నివేదించారట.. దీంతో, రేవంత్‌ టీమ్‌కి చివరికి రెండు సీట్లతోనే సరిపెట్టాల్సి వస్తుందని సమాచారం..

తాను కనీసం పదికిపైగా స్థానాలను దక్కించుకొని, పార్టీలో తన సొంత కూటమిని ఏర్పాటు చేసుకోవచ్చని భ్రమపడితే చివరికి సీన్‌ ఇలా రివర్స్‌ అవుతుందని భావించడం లేదంటూ వాపోతున్నాడట రేవంత్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డిని రవ్వంత రెడ్డిగా టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్న వ్యాఖ్యలు నిజమే అని, ఆయనకు నిజంగా అంత సీన్‌ ఉంటే.. తక్షణమే కాంగ్రెస్‌ రాజీనామా చేసి టీటీడీపీలో జాయిన్‌ అవ్వాలని టీఆర్‌ఎస్‌ నేతలు ఈ తాజా పరిణామంపై వ్యాఖ్యానిస్తున్నారు.. మరి, రేవంత్‌కి నిజంగా అంత సీన్‌ ఉందా..? ఉంటే ఆయన మరో నాలుగు స్థానాలయినా తన అనుంగు మిత్రులకు, నమ్ముకొని పార‌్టీలోకి వచ్చిన వారికి దక్కించుకుంటారా..? ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి తన స్థాయి ఏంటో ప్రూవ్‌ చేస్తాడా…? అనేది చూడాలి..

Comments

comments

Continue Reading

News

మనుషుల్ని చంపుతుందని మర్డర్ చేశారు – అనాధలైన పిల్లలు

Published

on

avani tiger killed

మనుషుల్ని చంపే-మనుషలకి ఉరి శిక్ష వేసి చంపేస్తారు..ఇలాంటి ఉరి శిక్ష పడ్డ వారి వార్తలు మనం ఎన్నో వందలు చదివే ఉంటాం.కాని ఇది మనుషుల్ని చంపిన పులిని మర్డర్ చేసిన వార్త.వివరాల్లో ఎంటర్ అయిపోతే..మహారాష్ట్ర అడవుల్లో తిరిగే ఒక పులి..దాని పేరు అవని..అది మనుషుల రక్తానికి రుచి మరిగి దాదాపు 13 మందిని చంపేసింది.ఇక ఇలా వదిలేస్తే చాలా ప్రమాదం అని తెలిసి దాన్ని చంపడం ఒక్కటే మార్గమని డిసైడ్ చేసి కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులని ఇచ్చింది సుప్రీం కోర్టు.బాగా కరుడు గట్టిన తీవ్రవాది లాంటి ఈ పులిని ఈ సంవత్సరం జనవరి నుంచి వెతుకుతుంటే నిన్న ఫారెస్ట్ రేంజర్లకు చిక్కి చచ్చింది.ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఈ ఆడ పులిని అత్యంత దగ్గర నుండి ఒకే ఒక్క గన్ షాట్‌తో చంపిన షూటర్ పేరు అస్కర్ అలీ ఖాన్

change.org సంస్థ ఈ పులిని చంపకుండా పట్టుకుని బంధిచాలనే పిటీషన్ రన్ చేసినా,కోర్టు ఒప్పుకోలేదు.మనుషుల రక్తం రుచి మరిగిన ఈ పులిని ఇలా వదిలేయడం మంచిది కాదు అనే ఉద్దేశంతో దాన్ని చంపడం ఒక్కటే మార్గం అని గట్టిగా ఆర్డర్ కూడా పాస్ చేసింది.ఇక పోతే ఈ పులిని చంపినందుకు చుట్టుపక్కల గ్రామస్థులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పాపం ఈ పులికి పుట్టిన రెండు పిల్లలు మాత్రం తల్లి మరణంతో అనాధలుగా మిగిలిపోయాయి.

ఈ పులి చంపిన వారి వివరాలు : 

  • 2016 నుంచి ఇప్పటి వరకు 13 మందిని చంపింది.
  • ఇందులో 11 మంది పంధర్‌కవాడ్ అటవి ప్రాంతంలో ఉండే గొర్రెల కాపరులు.
  • మరీ ఇద్దరు వ్యవసాయం చేసుకునే రైతులు.
  • ఈ మొత్తంలో ఐదుగురు ఒక్క డిసెంబర్ 2017 లోనే చనిపోయారు..
  • 2018 జనవరిలో ఒకరు,ఆగస్టులో మరో ముగ్గురు ఈ పులి చేతిలో మరణించారు.

పులి చనిపోయినందుకు ఆనందంలో పండగ చేసుకుని,టపాకాయలు కాలుస్తున్న గ్రామస్థులు,కింద ట్వీట్‍లో చూడవచ్చు..

Comments

comments

Continue Reading
Advertisement
Featured3 weeks ago

జగన్ కు భాస్కర్ అవార్డు ఇస్తానన్న లోకేశ్ తర్వాత ఏమైంది.?

cm kcr and komati reddy
Telangana Elections3 weeks ago

కేసిఆర్ ముఖంలో భయం కనబడుతుంది

Telangana Elections3 weeks ago

తెలంగాణ ప్రచారంలో అమిత్ షా : అధికారం బీజేపీదే

Uncategorized3 weeks ago

కొండా విశ్వేశ్వరరెడ్డి వెనక..కాంగ్రెస్ నేతల బెదిరింపులు ఉన్నాయా?

Featured4 weeks ago

నాగచైతన్యకు సమంత సర్ ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ..సోషల్ మీడియాలో వైరల్..?

Featured4 weeks ago

జగన్ నిజంగా భయపెట్టాడా.. తండ్రిలా బెదిరించి వదిలేసాడా.?

trend in telangana voting
Political3 weeks ago

ఓటు వేయండి ఐఫోన్ గెలవండి : తెలంగాణలో నయా ట్రెండ్

Featured2 weeks ago

పెళ్లి తరువాత దీపికా ఇలా చేసింది ఏంటి..?

Featured2 weeks ago

అలీయా బట్ తో డేటింగ్ లో ఉన్న నిఖిల్..?

Featured2 weeks ago

మళ్లీ ప్రియాంక- మోడీ సోషల్ మీడియాలో వైరల్

Trending