Connect with us

Technology

‘తేజ్’ యాప్ కాస్త “జీ పే “గా మార్చిన గూగుల్ సంస్థ …!

Published

on

మనీ మేడ్ సింపుల్ ట్యాగ్ లైన్ తో గూగుల్ రూపొదించిన “తేజ్” యాప్ పేరు మారింది.యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ “తేజ్” సెప్టెంబర్ లో ప్రారంభమైన తేజ్ యాప్ ఏడాది గడిచిపోవడంతో సరికొత్త లుక్ తో ‘గూగుల్ పే’ గా మార్చినట్లు ఆ సంస్థ ట్విట్టర్ లో పేర్కొంది.పేరు మార్చుతూనే యాప్ లో కొత్త సర్వీసులు అందుబాటులో ఉంచింది.

తేజ్ యాప్ ను అప్ డేట్ చేస్తే కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. తేజ్ లో ఏ ఫీచర్లనైతే యూజర్స్ ఇష్టపడ్డారో.. అవన్నీ గూగుల్ పేలోనూ ఉంటాయని కంపెనీ తెలిపింది.గూగుల్ పే యాప్ తో.. రీటెయిల్ స్టోర్స్‌కు పేమెంట్స్ చేయొచ్చు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చువీటితో పాటు బుక్ మై షో, గోఐబిబో, ఫ్రెష్‌మెను, రెడ్‌బస్‌లాంటి యాప్స్ లో పేమెంట్ చేయొచ్చు. కొత్త గూగుల్ పే యాప్ తో… బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తోంది.ఏడాది కాలంలో.. రూ.2లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని చెప్పింది. మొత్తం 75 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయన్న గూగుల్… ప్రతి నెల ఈ యాప్‌ను 2 కోట్ల 20లక్షల మంది వాడుతున్నారని తెలిపింది.హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లతో గూగుల్ పే అనుసంధానం కావడంతో వినియోగదారులు రుణాలు కూడా పొందే అవకాశం ఉందని గూగుల్ పే అధికారులు తెలిపారు.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

మేఘా విద్యుత్ వెలుగులు…. రికార్డ్ సమయంలో కాళేశ్వరం లింక్-1 విద్యుత్ వ్యవస్థ పూర్తి

Published

on

By

Megha power lighting, Complete the power of the galvanized link-1, kaleswaram power praject during the record

ఇన్ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని, దేశంలోని అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లులు పూర్తి చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డు సొంతం చేసుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన లింక్-1లోని మూడు పంపింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే నాలుగు సబ్‌స్టేషన్లు, వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన నైపుణ్య ప్రతిభను చాటుకుంది. ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్దదైన తొలి ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి వద్ద భారీ సబ్‌స్టేషన్‌ను గడువుకన్నా ముందే పూర్తి చేసి పవర్‌ గ్రిడ్‌ నుంచి పురస్కారం అందుకుని జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన మేఘా తాజాగా కాళేశ్వరం లింక్-1లో భారీ విద్యుత్ వ్యవస్థను సిద్ధం చేసింది.

ఈ ప్రాజెక్ట్‌ లింక్-1 కింద 3 పంప్‌ హౌస్‌ల నుంచి 28 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయటానికి 1120 మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ప్రపంచంలో ఇంతపెద్ద స్థాయిలో విద్యుత్‌ను వినియోగించే ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు.

ఇప్పటి వరకు ప్రపంచంలో ఈజిప్ట్‌ లోని ముబారక్ పంపింగ్‌ స్టేషన్‌ మాత్రమే అతి పెద్దది. ఈ ఎత్తిపోతల పథకానికి 288 మెగావాట్ల విద్యుత్ వినియోగించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏడేళ్ళ కాలం పట్టింది. కానీ మేఘా ఇంజనీరింగ్ చేపట్టిన కాళేశ్వరం లింక్-1 విద్యుత్ వ్యవస్థ దానికన్నా దాదాపు నాలుగు రెట్లు పెద్దది కాగా ఏడాది సమయంలోనే పూర్తి చేసి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటుకుంది.

లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, రామడుగు (ప్యాకేజీ-8) 4 సబ్‌స్టేషన్లతో పాటు ట్రాన్స్‌ మిషన్ లైన్లను నిర్ణీత గడువు ఏడాదిన్నరలోగా పూర్తి చేసింది. రామడుగు (ప్యాకేజ్-8) సబ్‌స్టేషన్‌ 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి 2018 మే 6న గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. సుందిళ్ల సబ్‌స్టేషన్‌ను 2017 జులై 30న పనులు ప్రారంభించి 2018 జులై 18తేది లోగా పూర్తిచేసింది. ఏడాదికి ముందే ఈ సబ్‌స్టేషన్‌ పూర్తయ్యింది. అన్నారం సబ్‌స్టేషన్‌ పనులు 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి 2018 సెప్టెంబర్ 14న వినియోగంలోకి తెచ్చి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ 2017 ఏప్రిల్ ప్రారంభం కాగా 2018 సెప్టెంబర్ 29న ఛార్జ్ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మొత్తం లింక్-1లో వీటి పనులు పూర్తికావడం వల్ల జైపూర్ (అదిలాబాద్) విద్యుత్ కేంద్రం నుంచి మేడిగడ్డ వరకు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అయ్యే వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగింది. 2017లో నాలుగు సబ్‌స్టేషన్‌ల పనులను తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించగా రికార్డు సమయంలో అంటే 2018 మే నెల నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి వరుసగా నాలుగు సబ్‌స్టేషన్‌లను మేఘా అందుబాటులోకి తెచ్చిందని మేఘా పవర్ డిపార్ట్‌మెంట్ వైస్‌ప్రెసిడెంట్ ప్రవీణ్ శరథ్ దీక్షిత్ చెప్పారు.

రామడుగుతో మొదటి అడుగు :

ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ స్టేషన్‌ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 8లో భాగంగా మేఘా నిర్మించింది. ఈ పంప్‌ హౌస్‌లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 భారీ పంప్‌ మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మేఘా ఏర్పాటు చేసింది. సబ్‌స్టేషన్‌తో పాటు 18 కిలోమీటర్ల మేర 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్‌ మిషన్ లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ను కరీంనగర్ జిల్లా రామడుగులో నిర్మించింది.

ఏడాదిలోపే సుందిళ్ల :

సుందిళ్ల లింక్-1, లింక్-2ను అనుసంధానం చేస్తుంది. రోజుకు కనీసం రెండు టిఎంసిల నీటిని పంప్ చేసే విధంగా 9 మోటర్లను (పంపులను) ఏర్పాటు చేస్తున్నారు. 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంపింగ్‌ స్టేషన్‌లోని తొమ్మిది పంప్‌ మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 400/220/11 కేవీ సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌మిషన్ లైన్లను మేఘా ఏర్పాటు చేసింది. ఈ సబ్‌స్టేషన్‌ సుందిళ్ల పంపు హౌస్‌ పంపు మోటార్లకు విద్యుత్‌ను అందించడంతోపాటు 220/11 కేవీ అన్నారం, 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్‌లకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనిని పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల పంపు హౌస్‌ సమీపంలోని గోలివాడ గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.

అన్నారం సబ్‌స్టేషన్‌ :

480 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంపు హౌస్‌లోని 12 పంపు మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీ అన్నారం సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌ మిషన్ లైన్లను ఏర్పాటు చేశారు. 28 కిలోమీటర్ల 220 కేవీ టీఎండీసీ ట్రాన్స్‌ మిషన్ లైన్లను 400/220/11 కేవీ సుందిళ్ల సబ్‌స్టేషన్ నుంచి 220/11 కేవీ అన్నారం సబ్‌స్టేషన్ వరకు ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ను పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.

మేడిగడ్డతో అందుబాటులోకి నాలుగు సబ్‌స్టేషన్‌లు :

మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ చార్జింగ్ ప్రక్రియ పూర్తికావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని నాలుగు సబ్‌స్టేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మేడిగడ్డ పంప్‌ హౌస్‌లోని 17 పంప్‌ మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ను మేఘా ఏర్పాటు చేసింది. ఈ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు గానూ 400/220/11 కేవీ సుందిళ్ల సబ్‌స్టేషన్‌ నుంచి 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ వరకు 80 కిలోమీటర్ల మేర 220 కేవీ టీఎండీసీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని మేడిగడ్డ పంప్‌ హౌస్‌ వద్ద ఏర్పాటు చేశారు.

లింక్-1లో మేఘా చేపట్టిన కీలకమైన అన్ని సబ్‌స్టేషన్‌లు అందుబాటులోకి రావడంతో త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం, అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల, సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించేందుకు ఆయా పంప్‌ హౌస్‌ల్లోని మోటార్ల డ్రై, వెట్రన్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ ట్రాన్స్‌ మిషన్‌, సబ్‌స్టేషన్‌ల నిర్మాణంలో సంస్థకు ఉన్న అనుభవంతో పాటు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువుతోపాటు, తమ నిరంతర పర్యవేక్షణ ద్వారా పనుల వేగం పెంచడం వల్ల ఈ రికార్డును నెలకొల్పేందుకు సాధ్యమైందని, ఇది అరుదైన విషయం అని మేఘా పవర్ డిపార్ట్‌ మెంట్ వైస్‌ ప్రెసిడెంట్ ప్రవీణ్ శరథ్ దీక్షిత్ చెప్పారు. ఇంత తక్కువ సమయంలో 4 సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ మిషన్‌ లైన్లు పూర్తిచేయటం ఇంతకు ముందు ఎప్పుడు, ఎక్కడా జరగలేదని ఆయన వివరించారు.

మేఘా గతంలో అనేక సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ మిషన్‌ లైన్లను నిర్ణీత సమయంలో పూర్తిచేసి రికార్డును నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఎన్పీ కుంట వద్ద ఏర్పాటు చేసిన 400/220 కేవీ పవర్ గ్రిడ్‌ను కేవలం ఏడు నెలల్లోనే పూర్తిచేయడం ద్వారా జాతీయస్థాయిలో రికార్డును నెలకొల్పడంతోపాటు ప్రతిష్ఠాత్మక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డును కూడా అందుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం లింక్-1లో నాలుగు, లింక్-2లో రెండు సబ్‌స్టేషన్‌ల పనులను మేఘా చేపట్టింది. ఇప్పటికే లింక్-1లోని నాలుగు సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ మిషన్ లైన్ల చార్జింగ్ ప్రక్రియ పూర్తయ్యింది.

Comments

comments

Continue Reading

Technology

ఐఫోన్ రేట్లు తగ్గినట్టున్నయ్ ఓ నాలుగు కొనేయండి మరి..

Published

on

iphone mobiles prices got reduced

అంత రేటు ఎందుకు ఉంటుదో ఎవరికి అర్థం కాదు,కాని అందరికి ఆ ఫోనే కావాలి.లక్ష రూపాయలకు 180 కేజీల బైక్ వస్తున్న ఈ రోజుల్లో 180 గ్రాములు కూడా సరిగ్గ ఉండని ఈ ఐఫోన్ల కు భలే క్రేజ్.కొనగలిగే వాళ్ల సంగతి పక్కన పెడితే,ప్రతి ఒక్కరికి ఐఫోనే కావాలని ఉంటుంది. అరే ఒక్క పదివేలు తగ్గితే కొందాం అని అనుకునే వారు బహుశా కొన్ని లక్షలు…సారీ కొన్ని వేల మంది ఉండి ఉంటారు.ఆ వేల మందికి ఆనందం కలిగించే మేటర్ ఇది.ఇందులో సీక్రేట్ ఏం లేదు క్లియర్ గా టైటిల్ ను చూస్తే అర్థం అయ్యే ఉంటుంది.మరీ తగ్గిన ఐఫోన్ రేట్లు ఏంటో చూడండి.ఈ కింద ఉన్న రేట్లన్ని మనం ఏదో ఎక్వయిరీ చేసి రాసింది కాదు,మన పెద్ద పెద్ద వెబ్ సైట్లు ఈనాడు,సాక్షి లాంటి వాటిల్లో చదివి రాసింది.

ఐఫోన్‌ 6ఎస్‌

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 32జీబీ మోడల్‌ ఇంతకు ముందు రూ.52,240కి అమ్మేవాళ్ళు, ఇప్పుడు మాత్రం రూ.34,900లకే అమ్ముతున్నారు. ఇకపోతే ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 128జీబీని రూ.61,450 నుంచి రూ.44,900కు తగ్గించింది.

యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌

ఐఫోన్‌ ఎక్స్‌ 64 జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.95,390 ఉండగా, రూ.91,900 నుంచి ప్రారంభంకానుంది. టాప్‌ ఎండ్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,08,930 ఉండగా, ఇక నుంచి రూ.1,06,900 లభించనుంది.

యాపిల్‌ ఐఫోన్‌ 8

ఐఫోన్‌ 8 ప్లస్‌ ధరను సైతం యాపిల్‌ తగ్గించింది. 64జీబీ ఇక నుంచి రూ.69,900లకే లభించనుంది. గతంలో దీని ధర రూ.77,560గా ఉండేది. ఐఫోన్‌8 ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.91,110 నుంచి రూ.84,900లకు తగ్గించింది.

ఐఫోన్‌ 8 64జీబీ రూ.67,940 ఉండగా, ఇప్పుడు రూ.59,900లకే లభించనుంది. ఐఫోన్‌ 8 టాప్‌ ఎండ్‌ మొబైల్‌ ధరను రూ.81,500 నుంచి రూ.74,900లకు తగ్గించింది.

యాపిల్‌ ఐఫోన్‌7

ఐఫోన్‌ 7ప్లస్‌ 32జీబీ, 128జీబీ వేరియంట్‌ ధరలు వరుసగా రూ.49,900, రూ.59,900లకే లభించనున్నాయి. ఇక ఐఫోన్‌ 7 32జీబీ వేరియంట్‌ను రూ.52,370 నుంచి రూ.39,900లకు తగ్గించింది. అలాగే ఐఫోన్‌7 128జీబీ ధరను కూడా రూ.61,560 నుంచి రూ.49,900లకు తగ్గించింది.

 

Comments

comments

Continue Reading

movies

ఆ థియేటర్ మొత్తం ఫుల్ స్క్రీన్… ఆధునికటెక్నాలజీలో ఇదో ట్రెండ్‌

Published

on

By

that-theater-is-a-full-full-screen-this-trend-in-moderntechnology

మనం ఇంతవరకు బెంచి, నేల టిక్కెట్ నుంచి మొదలైన చిత్రపరిశ్రమ నేడు మంచి అద్బుతమైన టెక్నాలజీ వరకు వెల్లాం. రోజు రోజుకు అదునాతనం గా మన థియేటర్లు రూపుదిద్దుకుటూనే ఉన్నాయి.. అలాగే ఇప్పుడు కొత్త తరహ స్క్రీన్స్ వచ్చాయి.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం నిర్మాణ సంస్థలకు కత్తిమీద సాములా మారింది. దీంతో ఎప్పటికప్పుడు వారిని ఆకట్టుకుని థియేటర్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. త్రీడీ, ఐమ్యాక్స్‌, 7డీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకు వెళ్లి ఇప్పటి వరకు అచ్చెరువొందించారు. తాజాగా ఒకే థియేటర్‌లో మూడు తెరలున్న “స్క్రీన్‌ ఎక్స్‌” థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.

తాజాగా ఒకే థియేటర్‌లో మూడు తెరలున్న “స్క్రీన్‌ ఎక్స్‌” థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా థియేటర్‌లో 270 డిగ్రీ కోణంలో సినిమా చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రేక్షకుడు సన్నివేశాలను చూస్తున్నట్లు కాకుండా తన చుట్టూ జరుగుతున్న అనుభూతికి లోనవుతాడు. ప్రస్తుత పరిస్తితుల్లో కొన్ని పెద్ద కంపెనీలు కొన్ని సినిమాలను నెటోలోనే విడుదల చేస్తున్నాయి.. ఈ తరుణంలో థియేటర్స్ కు వచ్చే వారే తక్కువైయ్యారు.. అందుకు అనుగుణంగా సినిమా హాల్ నిర్వాహకులు కూడా ఎప్పటి కప్పుడు అదునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. అటువంటి ప్రయోగాల నుంచి వచ్చిందే “స్క్రీన్‌ ఎక్స్‌”. కాగా అదునాతన టెక్నాలజీని దక్షిణ కొరియాకు చెందిన సీజీవీ సంస్థ అభివృద్ధి చేసింది. కాగా ఈ సాంకేతికతను కేవలం సినిమా హాల్ వరకు పరిమితం కాకుండా చిత్రీకరణలోనే ఈ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుందని నిర్వహకులు తెలుపుతున్నారు. ఈ సాంకేతిక కెమరాల్లో హర్రర్, యాక్షన్ చిత్రాలు రూపోందిస్తే అద్బుతంగా వీక్షకులు అనుభూతి చెందుతారని చెబుతున్నారు.. ఇటీవ వచ్చిన ది మెగ్‌, యాంట్‌ మ్యాన్‌ అండ్‌ ది వ్యాన్స్‌ లాంటి సినిమాల్లో స్క్రీన్‌ ఎక్స్‌ సాంకేతికతను వాడారు. ద నన్‌, ఆక్వామెన్‌, షాజమ్‌ లాంటి హాలీవుడ్‌ సినిమాలు త్వరలో రానున్నాయి.

Comments

comments

Continue Reading
Advertisement
Featured2 weeks ago

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Featured2 weeks ago

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Featured2 weeks ago

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Featured2 weeks ago

మహేష్… నీ నవ్వుతోనే బ్రతుకుతున్నా.. నమ్రత

Featured2 weeks ago

ముగ్గురు హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న రానా… మరీ అంత క్లోజా…

Featured2 weeks ago

మహా శివుడికి అభిషేకాలు చేసిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

Featured2 weeks ago

కింద కూర్చొని తినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?

Featured3 weeks ago

ఏరి పారేస్తుంది చెట్లనా..? ఉగ్రవాదులనా..?- సిద్దు

Featured3 weeks ago

ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనున్న అలియా

Featured3 weeks ago

అల్లు అర్జున్ 20 వ మూవీ ఈ డైరెక్టర్ తోనే..? మరి 19 వ మూవీ ఎప్పుడు..?

Featured3 weeks ago

తన సెక్స్ పిక్స్‌ను విడుదల చేసిన శ్రీరెడ్డి

Featured2 weeks ago

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Featured2 weeks ago

మహేష్… నీ నవ్వుతోనే బ్రతుకుతున్నా.. నమ్రత

Featured2 weeks ago

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Featured2 weeks ago

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Featured2 weeks ago

కింద కూర్చొని తినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?

Featured2 weeks ago

మహా శివుడికి అభిషేకాలు చేసిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

Featured2 weeks ago

ముగ్గురు హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న రానా… మరీ అంత క్లోజా…

Featured3 weeks ago

ఆడవారికి ఈ సమయంలో సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయట

Crime3 weeks ago

ఫ్రెండ్ లవర్‌ను నమ్మించి రేప్ చేశాడు

Trending