Connect with us

Featured

పెళ్ళికాని వారు తప్పకుండా దర్శించ వలసిన దేవాలయం ఎక్కడుందో తెలుసా..?

Published

on

పెళ్ళి కాని వారిని ” కళ్యాణ ప్రాప్తిరస్తు ” అని దీవించే కళ్యాణ వెంకటేశ్వర స్వామి

 

పెళ్ళి జరగడం ఆలస్యం అవుతున్న వారి మనోవేదనను తొలగించి వారిని ” కళ్యాణ ప్రాప్తిరస్తు ” అని దీవించి అనుగ్రహించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతికి అత్యంత సమీపంలోని శ్రీనివాసమంగాపురం . ఇక్కడే స్వామి వారు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు . ఆయన్ను దర్శించే భక్తుల జీవితాలలో కల్యాణానికి సంబంధిచిన అడ్డంకులను పారద్రోలి సంతోషాన్ని చిగురింపజేస్తారు .

పెళ్ళికాని వారితో శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వీరిలో పెళ్లి కావాలని కోరుకుని కంకణాలు కట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని… గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాల్లోపు పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల విశ్వాసం.

నిన్నమొన్నటి వరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రజలే కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎక్కవుగా వచ్చేవారు. అయితే ఈ నమ్మకం ఆ నోట…ఈ నోట పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామి విశిష్టత ఈ మధ్యకాలంలో అందరికీ తెలియడంతో… ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.

భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నవెంటనే పెళ్లికాని అమ్మాయిలకు.. అబ్బాయిలకు వెంటనే పెళ్లిళ్లు జరగడంతో స్వామి వారికి ఇటీవల కాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది. ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది. తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.

వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతోన్న అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు ప్రతీ రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఎగబడుతున్నారు. వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన అబ్బాయిలు, అమ్మాయిలు… జంటలుగా స్వామి వారి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకి 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఇక స్థలప్రాశస్త్యం వివరాల్లోకి వెళితే… పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల గిరులకు ఈమార్గం గుండా వెళ్తుంటే… నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదని అగస్త్యమహాముని సూచించారని… దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలలు పాటు ఉండిపోయారన్నది పురాణప్రాశస్త్యం. ఈ కారణంగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రాను సారం ఎలాంటి పూజలు, కైంకర్యాలు జరుగుతాయో శ్రీనివాస మంగాపురంలోను అదే తరహాలో పూజా కైంకర్యాలు జరుగుతాయి.

తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.తిరుమల యాత్రకు వచ్చే భక్తులు తప్పకుండా దర్శించవలసిన అద్భుత ఆధాత్మిక క్షేత్రం మన శ్రీనివాసమంగాపురం

ఈ విషయాలను అందరికీ తెలియజేసి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం అందరిపై వర్షించాలని ఆకాంక్షిద్దాం …

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Published

on

By

ఆర్జీవీ ని… సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూస్తుంటే టెంపర్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తుంది. సార్… మీరు మారిపోయారు డైలాగ్. పోసాని మీరు మారారు సార్ అంటే లేదు నేను మారలేదు అన్న ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం అదే… అచ్చుగుద్దినట్టు ఇక్కడ వాడేయొచ్చు. ఇన్నాళ్లు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తో బుర్ర ఖరాబ్ చేసుకున్న వర్మ… ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నాడు. తన కూతురు చిన్నప్పుడు తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు సోషల్ మీడియా లో. అలాంటి మంచి రోజులు మళ్లీ తిరిగి రావని… అన్నింటినీ కోల్పోయాను అని ట్వీట్ చేశాడు పాపం. దీంతో వర్మ మూడ్ పై బెట్టింగ్ వేస్తున్నారు నెటిజన్లు. వర్మ మారిపోయాడు పక్కా అని కొందరు అంటే…. లేదు లేదు చుక్కేస్తే ఇలాంటివే గుర్తొస్తాయి అని… మందు దిగితే మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్తున్నారు.

 

Comments

comments

Continue Reading

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Published

on

By

మలైకా అరోరా మత్తెక్కిస్తుంది. కంటి చూపుతో కైపెక్కిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నైంటీస్ లో ఎంత హాట్ గా ఉందో … ఇప్పుడు దానికి మించి హాట్ గా కనిపిస్తోంది. 40 ఏళ్లలోనూ ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి గల రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా అంటున్నారు. న్యూ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసిన ఈ భామ.. తను నిల్చున్న కార్పెట్ కు కూడా కాక పుట్టించేలా ఉంది. ఈ ఫోటోపై కామెంట్స్ మామూలుగా హాట్, సెక్సీ అంటూ నెటిజన్ల నుంచి వస్తే… తన లవర్ మాత్రం మలైకాను ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తే తను మాత్రం మలైకా వర్కింగ్ స్టైల్ ను కొనియాడాడు. ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ముందుంటుందని కామెంట్ పెట్టాడు. తను కొత్తదనాన్ని కోరుకుంటుందని… నో .. నో .. నో .. వినూత్నంగా ప్రయత్నిస్తుందంటూ పొగిడేశాడు. దీనిపై నెటిజన్లు బాబు నీకు ఆ పిక్ లో అంత అర్ధం కనిపిస్తుందా… మాకు మాత్రం అందాలు అతిగా ఆరబోస్తున్న ఆంటీ కనిపిస్తుందంటున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement

Trending