Connect with us

Featured

అతడు ఆటో డ్రైవరు.. భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు…అయినా ఓ ఇంటర్‌ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు..?

Published

on

అతడో ఆటో డ్రైవరు.. భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. ఓ ఇంటర్‌ విద్యార్థిని అతడి ఆటోలో కాలేజీకి వెళ్లి వస్తుండేది. ఆమెకు ఏ మాయమాటలు చెప్పాడో.. లేక ఎదిగీ ఎదగని వయసులో ఆ విద్యార్థిని ఏ బలహీనతకు లొంగిపోయిందో అతడి వెంటే నడవడానికి సిద్ధపడింది. ఇది రెండు కుటుంబాల్లోనూ కలతలు రేపింది. కేసులు, పంచాయతీలు.. ఆత్మహత్యాయత్నాలు కూడా జరిగాయి. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. దీంతో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. ఆపై తమ ప్రేమను అంగీకరించని ఈ లోకంలోఉండలేమంటూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతడి భార్యా పిల్లలు అనాథలుగా మిగలగా.. ఎదిగిన కుమార్తె ఇలా దారితప్పి లోకాన్ని వీడడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కోకిలంపాడుకు చెందిన జొన్నలగడ్డ తిరుపతిరావు(23)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ గ్రామానికే చెందిన కొంగల శ్రీలక్ష్మి(18) తిరువూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. రోజూ తిరుపతిరావు ఆటోలోనే కాలేజీకి వెళ్లివస్తుండేది. ఆ క్రమంలో వారి పరిచయం శ్రుతిమించింది. ఇది తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టుకోవడంతోపాటు పలుమార్లు పెద్దమనుషుల వద్ద పంచాయతీలూ జరిగాయి. అయినా అతడిని వదలకపోవడంతో నాలుగు రోజుల క్రితం శ్రీలక్ష్మిని తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్లగొట్టారు. దీంతో తిరుపతిరావు ఆమెను తిరువూరు తీసుకొచ్చి ఓ ఇంట్లో ఉంచి అక్కడే తాళి కట్టాడు. బుధవారం ఉదయం అతడు తమ బంధువైన గొల్లమందల శివను దగ్గరలోని ఓ గుడికి వెళ్దాం రమ్మని పిలిచాడు. అతడు వచ్చాక ముగ్గురూ ద్విచక్రవాహనంపై గుడికి చేరుకున్నారు. అప్పటికే పురుగులమందు కలుపుకొని తెచ్చుకున్న శీతలపానీయాన్ని తాగేశారు. కొంతసేపయ్యాక శివకు ఆ విషయం చెప్పారు. దీంతో కంగారుపడిన శివ ఆసుపత్రికి తీసుకువెళ్దామని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. ముగ్గురూ కలిసి సత్తుపల్లి వైవు కొంతదూరం వెళ్లారు. ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో తిరిగి పెనుబల్లి వైద్యశాలకు వెళ్దామని వెనుతిరగగా మార్గమధ్యంలో తిరుపతిరావు, శ్రీలక్ష్మి అపస్మారకస్థితిలో పడిపోయారు. శివ వెంటనే స్థానికుల సాయంతో పెనుబల్లి వైద్యశాలకు తరలించాడు. అక్కడ చికిత్స చేస్తుండగానే ఇద్దరూ మృతి చెందారు.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Published

on

By

ఆర్జీవీ ని… సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూస్తుంటే టెంపర్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తుంది. సార్… మీరు మారిపోయారు డైలాగ్. పోసాని మీరు మారారు సార్ అంటే లేదు నేను మారలేదు అన్న ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం అదే… అచ్చుగుద్దినట్టు ఇక్కడ వాడేయొచ్చు. ఇన్నాళ్లు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తో బుర్ర ఖరాబ్ చేసుకున్న వర్మ… ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నాడు. తన కూతురు చిన్నప్పుడు తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు సోషల్ మీడియా లో. అలాంటి మంచి రోజులు మళ్లీ తిరిగి రావని… అన్నింటినీ కోల్పోయాను అని ట్వీట్ చేశాడు పాపం. దీంతో వర్మ మూడ్ పై బెట్టింగ్ వేస్తున్నారు నెటిజన్లు. వర్మ మారిపోయాడు పక్కా అని కొందరు అంటే…. లేదు లేదు చుక్కేస్తే ఇలాంటివే గుర్తొస్తాయి అని… మందు దిగితే మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్తున్నారు.

 

Comments

comments

Continue Reading

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Published

on

By

మలైకా అరోరా మత్తెక్కిస్తుంది. కంటి చూపుతో కైపెక్కిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నైంటీస్ లో ఎంత హాట్ గా ఉందో … ఇప్పుడు దానికి మించి హాట్ గా కనిపిస్తోంది. 40 ఏళ్లలోనూ ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి గల రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా అంటున్నారు. న్యూ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసిన ఈ భామ.. తను నిల్చున్న కార్పెట్ కు కూడా కాక పుట్టించేలా ఉంది. ఈ ఫోటోపై కామెంట్స్ మామూలుగా హాట్, సెక్సీ అంటూ నెటిజన్ల నుంచి వస్తే… తన లవర్ మాత్రం మలైకాను ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తే తను మాత్రం మలైకా వర్కింగ్ స్టైల్ ను కొనియాడాడు. ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ముందుంటుందని కామెంట్ పెట్టాడు. తను కొత్తదనాన్ని కోరుకుంటుందని… నో .. నో .. నో .. వినూత్నంగా ప్రయత్నిస్తుందంటూ పొగిడేశాడు. దీనిపై నెటిజన్లు బాబు నీకు ఆ పిక్ లో అంత అర్ధం కనిపిస్తుందా… మాకు మాత్రం అందాలు అతిగా ఆరబోస్తున్న ఆంటీ కనిపిస్తుందంటున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement

Trending