Connect with us

Featured

వినయ విధేయ రామ…రివ్యూ ,రేటింగ్

Published

on

 

పక్కా మాస్ హీరో రామ్ చరణ్, అంతమించిన మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో అందలా నటి కైరా అద్వాని హీరోయిన్ గా మాస్ బీట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. మొదట పేరు అనౌన్స్ చేసినప్పుడే పెద్దగా ఆకర్షించని ఈ సినిమా …టీజర్ తరువాత ఓ మోస్తారు అనుకున్నారు. అంతలోనే ట్రైలర్ రిలీజ్ చేయటంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమాలో ఏదో ఉందన్న ఆలోచన పుట్టించింది.మరి నిజంగానే సినిమా సూపర్ హిట్ అయిందా.. ప్రేక్షకులు ఏమంటున్నారు.. ఓసారి లుక్కెద్దాం

కథ :

కథ విషయానికి వస్తే రోటీన్ స్టోరీ.. ఓ మాస్ కథ ఎలా ఉండాలో తరతరాలుగా ఎలా ఉన్నాయో సరిగ్గా అలాంటి కథ. ఏ మాత్రం తేడా లేని కథ. ఓ నలుగురు అనాథలకు ఓ అనాథ బాబు దొరుకుతాడు. అతడే రామ్ చరణ్, వాళ్లంటే అమితమైన ప్రేమ. వారి కోసం ఏమైనా చేస్తాడు. పెద్దన్నయ్య ఎలక్షన్ కమీనర్ ఆయన ఉద్యోగానికి అడ్డంకిగా మారుతాడు విలన్ వివేక్ ఓబేరాయ్. దీంతో వివేక్ వల్ల ఆ ఫ్యామిలీ డిస్ట్రబ్ అవుతుంది. దీంతో ఆ ఫ్యామిలీ సమస్యలో పడుతుంది. అంతటి పవర్ ఫుల్ విలన్ ను రామ్ ఎలా ఎదుర్కున్నాడు అతని నుంచి వారి కుటుంబాన్ని రామ్ రక్షించుకోగలిగాడా లేదా అన్నది వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

కథ పాతదే అవ్వటం వల్ల.. కథనంలో కాస్త మెరుగు దిద్దాల్సిన అవసరం ఏంతైనా ఉంది. కానీ బోయపాటి గత కొద్ది కాలంగా అదే రోటీన్ పద్దతిని పాలోఅవుతున్నాడు. గత సినిమా ఈ కోవలోనే తీసినా మళ్లీ మళ్లీ అదే పట్టుకుని తాను పట్టిందానికి మూడు కాళ్లు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్ నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ తీయాలన్న ప్రయత్నంలో బోయపాటి బోర్లా పడిపోతున్నారు. ఈ విషయంపైనే ఎక్కువ దృష్టిపెట్టడం వల్ల మిగతా కథ కాకి ఎత్తుకుపోతుంది. నిజానికి బోయపాటి శ్రీను ప్లస్ పాయింట్స్ యాక్షన్, అవే ఇప్పుడు ఆయన కొంప ముంచుతున్నాయి.

కథలో కొత్తదనం లేదు. రామ్ కో..ణి..దె..ల ఎపిసోడ్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ లు జనాలను కాస్త రంజింప చేస్తాయి.అక్కడక్కడా కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ఇక పాటల విషయానికి వస్తే దేవిశ్రీ మాత్రం ఒక్క పాట మినహా అంతగా ఆకట్టుకోలేదు.వాటిని రామ్ చరణ్ తన స్టెప్పులతో కాపాడారు అని చెప్పాలి.కానీ దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది.ఫస్టాఫ్ లానే సెకండాఫ్ కూడా సాఫీ గానే సాగుతుంది.

నటులు సీనియర్ నటి స్నేహ మరియు ప్రశాంత్ వారిని నటనతో ఆకట్టుకుంటారు.చరణ్ మరియు ఈ సినిమా విలన్ వివేక్ ఓబ్రాయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు,పోస్టర్లలో చూపించిన రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఫైట్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ సెకండాఫ్ కు హైలైట్ అని చెప్పొచ్చు.ఇక దర్శకుని విషయానికి వస్తే బోయపాటి తనదైన మార్క్ మాస్ నేటివిటీని చూపుతారు కానీ మిగతా అంశాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. సెకండాఫ్ కన్నా ఫస్టాపే బాగున్నట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

రామ్ చరణ్ డాన్సులు.
బోయపాటి మార్క్ మాస్ ఫైట్స్.
ఇంటర్వెల్ బ్లాక్,రామ్ కో..ణి..దె..ల డైలాగ్ ఎపిసోడ్.
తస్సాదియ్యా,రామ లవ్స్ సీత పాట.

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ.
పేలవమైన పాటలు.
సెకండాఫ్.

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే వినయ విధేయ రామ సినిమా ఒక రొటీన్ స్టోరీ లైన్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.ఏ మాత్రం కొత్తదనం లేని కథ,పేలవమైన సెకండాఫ్ ఈ సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పాలి.కానీ రామ్ చరణ్ మాత్రం మరోసారి తనదైన నటన డాన్స్ స్టెప్పులతో అలరించారు.ఈ సంక్రాంతి సీజన్ కి ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.

Rating : 2.5/5

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Published

on

By

ఆర్జీవీ ని… సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూస్తుంటే టెంపర్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తుంది. సార్… మీరు మారిపోయారు డైలాగ్. పోసాని మీరు మారారు సార్ అంటే లేదు నేను మారలేదు అన్న ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం అదే… అచ్చుగుద్దినట్టు ఇక్కడ వాడేయొచ్చు. ఇన్నాళ్లు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తో బుర్ర ఖరాబ్ చేసుకున్న వర్మ… ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నాడు. తన కూతురు చిన్నప్పుడు తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు సోషల్ మీడియా లో. అలాంటి మంచి రోజులు మళ్లీ తిరిగి రావని… అన్నింటినీ కోల్పోయాను అని ట్వీట్ చేశాడు పాపం. దీంతో వర్మ మూడ్ పై బెట్టింగ్ వేస్తున్నారు నెటిజన్లు. వర్మ మారిపోయాడు పక్కా అని కొందరు అంటే…. లేదు లేదు చుక్కేస్తే ఇలాంటివే గుర్తొస్తాయి అని… మందు దిగితే మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్తున్నారు.

 

Comments

comments

Continue Reading

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Published

on

By

మలైకా అరోరా మత్తెక్కిస్తుంది. కంటి చూపుతో కైపెక్కిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నైంటీస్ లో ఎంత హాట్ గా ఉందో … ఇప్పుడు దానికి మించి హాట్ గా కనిపిస్తోంది. 40 ఏళ్లలోనూ ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి గల రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా అంటున్నారు. న్యూ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసిన ఈ భామ.. తను నిల్చున్న కార్పెట్ కు కూడా కాక పుట్టించేలా ఉంది. ఈ ఫోటోపై కామెంట్స్ మామూలుగా హాట్, సెక్సీ అంటూ నెటిజన్ల నుంచి వస్తే… తన లవర్ మాత్రం మలైకాను ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తే తను మాత్రం మలైకా వర్కింగ్ స్టైల్ ను కొనియాడాడు. ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ముందుంటుందని కామెంట్ పెట్టాడు. తను కొత్తదనాన్ని కోరుకుంటుందని… నో .. నో .. నో .. వినూత్నంగా ప్రయత్నిస్తుందంటూ పొగిడేశాడు. దీనిపై నెటిజన్లు బాబు నీకు ఆ పిక్ లో అంత అర్ధం కనిపిస్తుందా… మాకు మాత్రం అందాలు అతిగా ఆరబోస్తున్న ఆంటీ కనిపిస్తుందంటున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement

Trending