Health
క్యాన్సర్ రావటానికి అసలు కారణాలు ఇవే…

అదో మహమ్మారి వ్యాధి…ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను బలికొంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దీని బారిన పడ్డారు. ఎన్ని ఆపరేషన్లు చేసిన ఎన్ని మందులు వాడిన దీన్ని పూర్తిగా నివారించలేం. అదే మహమ్మారి క్యాన్సర్. ఈ వ్యాది బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఈ నేపధ్యంలో అందరం కలిసి దీన్ని తరిమి కొడుధాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. మన ఆరోగ్య అలవాట్లు,వ్యసనాలు క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అంతే కాదు క్యాన్సర్ కి గురవుతున్న పురుషుల్లో సగానికి పైగా పొగాకు,మద్యం సేవించడం మూలంగా క్యాన్సర్ బారిన పడిన వారే.ఇవే కాదు మన నిజ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా మనకి క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. మల బద్ధకం,నిద్ర లేమి, అసిడిటీ, ఒత్తిడి, ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు వీటిని పెద్ద సమస్య గా భావించరు. ఎక్కువ పట్టించుకోరు. కానీ అలాగే వదిలేస్తే ఈ చిన్న సమస్య కాస్తా పెద్దగా అయ్యి క్యాన్సర్ రూపంలో మీ ప్రాణాలనే హరించే అవకాశం ఉంది.ఇప్పుడైనా జాగ్రత్త పడండి.
Comments
Health
మీరు నైట్ షిప్ట్ చేస్తున్నారా..అయితే క్యాన్సర్ తో జాగ్రత్త..?

క్యాన్సర్ ఈ పేరు వింటేనే గుండెలు గుభేల్..క్యాన్సర్ వచ్చిందంటే అది నయం కావడం చాలా కష్టం…కాన్సర్ లలో కూడా చాలా రకాలే ఉన్నాయి. మనం చేసే పని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ డ్యూటీ..అవును మీరు ఎక్కువగా నైట్ డ్యూటీ చేస్తారా..అయితే బీ కర్ ఫుల్. నైట్ పూట ఎక్కువగా నిద్రపోకపోతే మీ ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశముంది. నైట్ షిఫ్ట్ డ్యూటీలతో క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ఫలితాలు షాకిచ్చేలా ఉన్నాయి. నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారి డీఎన్ఏ దెబ్బతింటుందని తేలింది. పగలు పనిచేసి రాత్రి నిద్రపోయేవారితో పోలిస్తే, రాత్రి పనిచేసి పగలు నిద్రపోయేవారిలో డీఎన్ఏ దెబ్బతినే అవకాశాలు 30 శాతం ఎక్కువట. ఆ తర్వాత నిద్రలేమి కారణంగా మరో 25 శాతం డీఎన్ఏ డ్యామేజ్ అవుతుందని ఈ సర్వే తేల్చింది. 28 నుంచి 33 ఏళ్లలోపు గల ఆరోగ్యవంతమైన ఫుల్ టైమ్ డాక్టర్లపై ఈ పరిశోధన జరిగింది. మూడు రోజులపాటు సరైన నిద్రలేని వాళ్ల రక్తాన్ని సేకరించి పరీక్షించారు. అంతేకాదు… నైట్ షిఫ్ట్ చేసినవారి నుంచి అదనంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరిశీలించారు. నిద్రలేమికి, డీఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉందని తేలింది. డీఎన్ఏ దెబ్బతింటే మళ్లీ బాగుచేయడం కష్టమని.. దీనివల్ల ఆరోగ్యానికే పెను ప్రమాదం సంభవిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే నైటి షిఫ్ట్ డ్యూటీ చేసే వాళ్లు తస్మాత్ జాగ్రతా..
Comments
News
భారత దేశం లో సగం మంది విషాన్నే తాగుతున్నారు…. పార్లమెంట్ కు నివేదికను పంపిన కేంద్రం.

ప్రజలు తాగుతున్న నీటిలో పొలాలలో పండిస్తున్న పంటలలోని నీటి కాలుష్యం ఎక్కువగా ఉండటంతో అనారోగ్యాలతో దేశం లో సగం జిల్లాలలోని ప్రజలు బాధపడుతున్నారు. వివిధ రకాల రసాయనాలు, పురుగులమందుల వల్ల నీరు కాలుష్యం అవుతున్నాయని కేంద్రం పార్లమెంట్ కు తెలిపింది.
కేంద్రం తెలిపిన వివిరాళ ప్రకారం దేశం లోని 386 జిల్లాల్లో(ప్రస్తుతం దేశంలో 718 జిల్లాలు ఉన్నాయి) ని భూగర్భ జలాల్లో హానికారక రసాయనాలు సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఏడింటిలో ఫ్లోరైడ్ కాలుష్యం తీవ్రంగా ఉంది. అలాగే దేశంలోని 335 జిల్లాల్లో ఫోర్లైడ్, 153 జిల్లాల్లో ఆర్సెనిక్, 24 జిల్లాల్లో కాడ్మియం వంటి రసాయనాలున్న నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
ఈ రసాయనాలు కాలుష్యం ఉన్న నీటిని ప్రజలు వాడితే చర్మ వ్యాధులు కిడ్నీ, కాలేయ, రక్తంలో ఆక్సీజన్ శాతం తగ్గిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో అన్నిరకాలైన విషపూరిత రసాయనాలు, భారీ లోహాలు ఉన్నాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.
Comments
Health
కిడ్నీ సమస్యలతో భాదపడుతున్నారా ?ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!

కొందరిలో సరిగా నిద్ర పట్టదు.. నీరసంగా ఉండటం.. చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం ఇలాంటి చాలా లక్షణాలు మనలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్న తొలిదశలో ఏర్పడుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే.. కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే నియంత్రించవచ్చు అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని సమస్యతీర్చుకోవాలి . మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే సమస్యలు, ఈ క్రింది విదంగా ఉంటాయి.
సరిగా నిద్ర పట్టకపోవడం
మన శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే సరిగా నిద్రపట్టదు మరియు రక్తంలో చేరే వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు శరీరం నుంచి బయటికి వెళ్లవు . దీనివల్ల రక్తంలో విషపూరిత పదార్థాల శాతం పెరిగిపోతుంది.ముఖ్యంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆడని పరిస్థితి మరియు గురక సమస్య ఉంటే వీలైనంత త్వరగా వైద్యులను కలిసి పరిక్షించుకోవాలి.
తలనొప్పి, నీరసం, బలహీనత..
ఆరోగ్యవంతమైన కిడ్నీలు మన శరీరం విటమిన్ డి ని సంగ్రహించుకునేలా మార్చుతాయి. దీనిలో ఎరిత్రోపొయెటిన్ (Erythropoietin-EPO) అనే హార్మోన్ విడుదల అవుతుంది . ఈ హర్మోన్ శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో EPO హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు. దానివల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి.. కండరాలు, మెదడు బలహీనం అవుతాయి.
చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం
కిడ్నీలు శరీరంలో మలినాలను, వ్యర్థ రసాయనాలను లవణాలు తగిన స్థాయిలో ఉండేలా చేస్తాయి . వ్యర్థాలు శరీరంలో పేరుకుపోవడం, తగినంతగా లవణాల స్థాయి లేనందున చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఎప్పుడూ చర్మం ఎండిపోయినట్లుగా ఉంటుండటం, దురదగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
సరిగా ఊపిరాడకపోవడం (షార్ట్ నెస్ ఆఫ్ బ్రీత్)
కిడ్నీలు సరిగా పనిచేయని సమయంలో రక్తంలో, శరీరంలో ద్రవాల శాతం పెరిగి ఉపిరితిత్తులలోకి నీరు చేరడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఛాతీలో గట్టిగా పట్టేసినట్టుగా ఉండడం మరియు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం రక్తానికి ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోయి ఎక్కువ సార్లు.. వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం రావడం వంటి సమస్యలు వస్తాయి. బ్రీత్ షార్ట్ నెస్ సమస్యకు ఆస్తమా, ఊపిరితిత్తుల కేన్సర్, గుండెనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
పాదాలు, చేతుల వాపు
కిడ్నీలు సరిగా పనిచేయక శరీరంలో మలినాలు, అదనపు రసాయనాలు పేరుకుపోయినప్పుడు శరీరంలోని పలుచోట్ల వాపు లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో అదనంగా పేరుకునే సోడియం కారణంగా మన శరీరంలో పాదాలు, చేతులు ఉబ్బి వాచిపోతాయి.అయితే కాలేయ వ్యాధులు, కాలి రక్తనాళాల్లో సమస్యలు, గుండె జబ్బుల కారణంగా కూడా శరీరంలో కింది భాగాలు వాపునకు గురయ్యే అవకాశం ఉంటుంది.
నడుము నొప్పి
ముఖ్యంగా కిడ్నీల్లో కణితులు ఏర్పడడం వల్ల ఈ రకం నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీల సమస్యల కారణంగా నడుము నొప్పి వచ్చినప్పుడు దానితోపాటు తీవ్ర అస్వస్థత, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, విపరీతంగా మూత్రం రావడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీల్లో కణితులు ఏర్పడడం వల్ల ఈ రకం నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం ద్వారా కూడా నడుమునొప్పి వస్తుంటుంది.
మూత్రంలో మంట.. మూత్రం రంగు మారడం..
కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో మూత్రం పోసినప్పుడు మంటగా ఉండడం, మూత్రం రంగు మారడం మరియు మూత్రం లో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్రానికి లేవాల్సి వస్తుంది.మూత్రం నురగగా వస్తుండడం, బుడగల్లాంటివి ఏర్పడడం అంటే కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ప్రొటీన్లు వెళ్లిపోతున్నాయని అర్థం.
అధిక రక్తపోటు
మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థకు కిడ్నీలకు మధ్య సంబంధం ఉంటుంది. కిడ్నీలలో ఉండే నెఫ్రాన్లు రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను, అధికంగా ఉన్న ద్రవాలను వడగడతాయి. అయితే అధిక రక్తపోటు కారణంగా శరీరంలో అతి సన్నని రక్తనాళాలు దెబ్బతింటుంటాయి. ఇలా అధిక రక్తపోటు కారణంగా కిడ్నీల్లోని నెఫ్రాన్లకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు దెబ్బతిన్నప్పుడు… నెఫ్రాన్లకు ఆక్సిజన్, పోషకాలు అందక దెబ్బతింటాయి. ఈ కారణం వల్లే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.దాంతోపాటు శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి.
Comments
-
Featured1 week ago
తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్
-
Featured1 week ago
మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్
-
Featured5 days ago
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేస్తుంది చంద్రబాబే… ఇప్పటికి కొనసాగుతున్న బాబు వెన్నుపోటు
-
Featured4 days ago
సైకిల్ తొక్కాలి ఆరోగ్యానికి… సైకిల్ నే తొక్కాలి ఏపీ బాగుకి..- నాగబాబు
-
Featured2 days ago
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ … ప్రేమ, దగల మధ్య నలిగిన అసలు కథ … నిమిషాల్లో లక్షల్లో వ్యూస్
-
Featured3 days ago
యాత్ర గురించి గొప్పగా చెప్పిన వర్మ
-
Featured7 days ago
అనుమానంతో భార్య నగ్న చిత్రాలను కుటుంబీకులకు సెండ్ చేసిన భర్త
-
Featured7 days ago
పవన్ కు న్యాయం చేయాలి – కత్తి మహేష్