Connect with us

Crime

జయరాం హత్యతో ఇద్దరి చీకటి బాగోతాలు బయటపడ్డాయి

Published

on

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయిన కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో భయంకర నిజాలు బయటికొస్తున్నాయి. మొదటి దీనిని రోడ్డు ప్రమాదంగా భావించడం.. తర్వాత అనుమానాస్పద మృతి అని అనుకోవడం.. చివరికి ఇది హత్యేనని తేల్చేయడం ఇలా జయరాం హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. ఈ హత్య చేసింది రాకేష్ రెడ్డి అని తేలడంతో పాటు మరికొన్ని ఊహకందని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య జరిగినప్పటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేర్లలో శిఖా చౌదరి పేరు ఒకటి.

జయరాం మేనకోడలిగా పరిచయమైన శిఖా చౌదరి అతడితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నానని స్వయంగా ఒప్పుకుంది. తమ మామాయ్య తనతో పాటు తన అక్కను కూడా లైంగికంగా వేధించాడని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు, తనకు రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఈ ఇద్దిరితోనూ విడిపోయాయని వెల్లడించింది. ఈ సమయంలోనే శిఖా చౌదరికి రాకేష్ రెడ్డి పరిచయం అయ్యాడట. ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం.. తర్వాత పెళ్లి చేసుకుందామనుకుని విడిపోవడం చేశారని తెలిసింది. అంతేకాదు, నిందితుడు రాకేష్‌ను జయరాంకు పరిచయం చేసింది కూడా శిఖానే.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కూడా సకల కళా వల్లభుడని పోలీసుల విచారణలో తేలింది. రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకోవడం.. అమ్మాయిలను ట్రాప్ చేయడం ఇలా ఎన్నో బాగోతాలు నడిపాడు. అలాగే, పలానా ప్రజాప్రతినిధి మనిషినని చెప్పుకుని చాలా మంది దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని తెలిసింది. ముఖ్యంగా రాకేష్ రెడ్డి టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌తో అఫైర్ నడిపాడని తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకునని చెప్పుకొంటూ అఫైర్ నడపడమే కాక, ఆమెను వ్యభిచార ఊబిలోకి దింపాడని తెలిసింది.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

నా చావుకి కారణం మోహన్ బాబే… సూసైడ్ లెటర్ రాసిన సీరియల్ నటి

Published

on

By

మోహన్ బాబు కారణంగా మనస్తాపం చెందిన ఓ తమిళ నటి సూసైడ్ చేసుకుంది. ప్రేమించి మోసం చేసిన మోహన్ బాబు మోసం చేయటం తోనే చనిపోతున్న అంటూ తన అమ్మకి మెసేజ్ పంపి మరి చనిపోయింది. మేరీ షీలా జేబిరాణి అలియాస్ యాషిక యాక్టింగ్ మీద మక్కువతో చెన్నై వెళ్ళింది. అక్కడ అవకాశాలు దక్కించుకొని పాలు సీరియళ్లలో నటించింది. కాగా చెన్నై వెళ్లాకా… యాషిక హాస్టల్లో ఉంది. అక్కడ సమీపంలో ఉన్న మొబైల్ షాప్ ఓనర్ అరవింద్ అలియాస్ మోహన్ బాబు తో స్నేహం మొదలై ప్రేమగా మారింది . కొన్ని నెలల పాటు వీరిద్దరూ సహజీవనం కుడా చేసారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో యాషికని మోహన్ బాబు హింసించటం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన యాషిక మోహన్ బాబుని ఇంట్లో నుండి బయటకి పంపింది. మోహన్ బాబు తర్వాత యాషికని పట్టించుకోవటం మానేసాడు. దీంతో తాను మోసపోయాను అని గ్రహించిన యాషిక చనిపోవాలని డిసైడ్ అయింది. చనిపోయే ముందు తన చావుకి మోహన్ బాబే కారణం అతనిని శిక్షించండి అంటూ తల్లికి మెసేజ్ చేసి ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. యాషిక తల్లి పోలీసులకి చెప్పటంతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మోహన్ బాబు ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

 

Comments

comments

Continue Reading

Crime

పాకిస్తాన్ పై యుద్దానికి మరో కుమారుడిని పంపిస్తా…

Published

on

By

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో అతి కిరాతకంగా ఉగ్ర వాదులు దాడులకి పాల్పడ్డారు. ఈ ఉగ్ర దాడిలో 44 మంది సిఆర్పియఫ్ జావానులు నేలకొరిగారు. దీనిపై దేశం మొత్తం ప్రతీకార చర్య కోసం రగిలి పోతుంది. పాకిస్తానీ ఉగ్రవాదులపై మరో సారి సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకార దాహాన్ని తీర్చుకోవాలని భారితీయులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశ ప్రదాని మోడీ కూడా ఈ దాడిపై ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ ఉగ్ర దాడిలో మరణించిన ఓ జవాన్ తండ్రి చెప్పిన మాటలు… అందరిలో రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. బీహార్ భాగల్ పూర్ కి చెందినా రతన్ ఠాకూర్ ఉగ్ర దాడిలో మరణించిన సైనికులలో ఒకరు. అయితే కుమారుడి మరణ వార్త విన్న తండ్రి గుండె పగిలిపోయేలా దు:ఖించాడు. ఈ దాడిపై రతన్ ఠాకూర్ తండ్రి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడు… నా పెద్ద కొడుకును భరత భూమి సేవలో కోల్పోయాను … ఇప్పుడు మరో కొడుకుని కూడా మాతృ భూమి సేవకి పంపుతాను. దేశ సేవలో నా కొడుకుని త్యాగం చెయటానికి సిద్దంగా ఉన్నాను. కాని పాకిస్తాన్ పై మాత్రం ప్రతీకారం తీర్చుకొని సమాదానం చెప్పాల్సిందే అంటూ ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. ఈ జవాను తండ్రి మాటలు అందరిని ఉద్వేగానికి లోను చేస్తున్నాయి.

Comments

comments

Continue Reading

Crime

మేన కోడలిని చంపి రక్తం తాగిన కసాయి అత్త…

Published

on

By

భర్తకి దూరంగా ఉండటంతో మానసిక ఒత్తిడికి లోనయింది. దీంతో సైకోగా మారింది. తన మేనకోడలైన ఆరేళ్ళ చిన్నారిని చంపి రక్తం తాగింది. ఈ నిర్ఘాంత పోయే ఘటన విశాఖ మన్యం లోని పెదబయలు మండలంలో చోటు చేసుకుంది. వంతాల రాస్మో అనే మహిళా…ఆమె భర్తతో గొడవల కారణంగా చాలా కాలంగా తన సొంత ఊరైనా పెదబయలు మండలం లయపుట్టోలు లోని అమ్మగారింట్లో ఉంటంది. చాలా కాలంగా భర్తకు దూరంగా ఉండటంతో మానిసిక ఒత్తిడికి లోనయింది. దీనికి తోడు రాస్మో తమ ఇంటినుండి పోయి భర్తతో కలిసి ఉండాలంటూ తముడి భార్యతో పాటు ఇతర కుటుంబ సబ్యులు ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళపై కక్ష పెంచుకుంది రాస్మో. మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యి సైకో లాగా ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తన తమ్ముడు కూతురుని చంపాలనుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆరేళ్ళ చిన్నారి అయిన తన మేన కోడలును కట్టెల కోసం అంటూ సమీప కొండపైకి తీసుకేల్లి కత్తితో తలపై నరికింది. దీంతో ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు వదిలింది. తరవాత ఆ చిన్నారి రక్తాన్ని తాగింది. ఈ ఘటనను దూరం నుండి గ్రహించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే చిన్నారి మృతి చెందింది. దీంతో వంతాల రాస్మో ని చెట్టుకి కట్టేసి కొట్టారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించగా…ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు చిన్నారి మృత దేహాన్ని స్వాదినం చేసుకొని నిందితురాలు రాస్మోని అదుపులోకి తీసుకున్నారు. కాగా గతేడాది క్రితమే తన భర్త చనిపోవటం… ఇపుడు తనకంటూ ఉన్న చిన్నారి కూడా మృతి చెందటంతో చిన్నారి తల్లి బోరున విలపిస్తుంది.

Comments

comments

Continue Reading
Advertisement
Featured3 weeks ago

కేటీఆర్ పని తీరుచూసి అవాక్ అయిన సీనియర్ నాయకులు..?

Featured3 weeks ago

రెగులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఆడవాళ్లకు ఎంత ప్రమాదమో తెలుసా..?

Featured3 weeks ago

అబ్బాయిలు ఇలా చేస్తే ఎక్కువసార్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చట

Featured3 weeks ago

వైఎస్ జగ‌న్‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వైర‌ల్ కామెంట్స్‌..!

Featured1 week ago

తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్

Featured2 weeks ago

ఛీ చీ.. బ్రాతో ట్రెండ్ మిల్ పై రాశి…వీడియో చూస్తే థ్రిల్ అవుతారు..?

Crime2 weeks ago

అమ్మా శృంగారం అయిపోయింది.. చాక్లెట్ ఇస్తావా..!

Life Style3 weeks ago

హైదరాబాద్ జనాన్ని మాయ చేసిన ప్రియా టాటూ!

Crime4 weeks ago

త‌ల బ‌య‌ట‌పెడితే తెగిప‌డింది..!

Featured1 week ago

మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్

Trending