Connect with us

Uncategorized

కార్పొరేట్‌ చాణక్య సర్వేలో చలమలశెట్టిదే విజయం…!!

Published

on

chalamasetti

ఎన్నికలకు మూడు రోజుల ముందు విడుదలయిన తాజా సర్వే ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు రేపుతోంది. జాతీయ స్థాయి సంస్థ కార్పొరేట్‌ చాణక్య నిర్వహించిన తాజా సర్వే ఏపీ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది..

తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాలలో టీడీపీ సునాయాసంగా మెజారిటీ మార్క్‌ దక్కించుకోనుంది.. సైకిల్‌ ఏకంగా 101 స్థానాలు కొల్లగొట్టనుంది.. ఇక, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 77 స్థానాలకు పరిమితం కానుంది.. ఇటు, మూడో పార్టీగా ఫైట్‌ చేస్తోన్న జనసేనకి కేవలం 3 నియోజకవర్గాలలో విజయ కేతనం ఎగురవేయనుందట.. ఈ సర్వే ఫలితాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. దీంతో, వైసీపీకి షాక్‌ అవుతోంది..

గత ఎన్నికలలో టీడీపీకి ఓటు పోటెత్తి అధికారానికి దగ్గర చేసిన ఉభయ గోదావరి జిల్లాలు మరసారి అదే పార్టీని అక్కున చేర్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. గత ఎన్నికలలో సైకిల్‌కి ఈ రెండు జిల్లాలలోనే 25కిపైగా స్థానాలు దక్కించుకోగా, ఈ సారి అది కాస్త తగ్గినా మెజారిటీని నిలబెట్టుకోనుంది.. 22 స్థానాలకు పరిమితం అవుతుందని ఆ సర్వే అంచనా వేసింది.

అది పక్కనపెడితే, తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ లోక్‌సభ సెగ్మెంట్‌లో సైకిల్‌ దూసుకుపోతోంది.. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజక వర్గాలున్నాయి. వీటిలో అయిదింటికిపైగా స్థానాలను టీడీపీ దక్కించుకుంటుందని తాజా సర్వే తేల్చింది.. అంటే, కాకినాడ లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌ దూకుడు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఖాయమని తేలిపోయిందని అంటున్నారు ఎనలిస్టులు.. ఈ సర్వే ఫలితాలతో కాకినాడలో చలమల వర్గం అప్పుడు విజయానందంలో మునిగితేలుతోంది.. ఎన్నికలకు ముందుగానే సంబరాలు చేసుకుంటోంది.. మరోవైపు, ఆయన ప్రత్యర్ధి వంగా గీత నైరాశ్యంలో మునిగిపోయారని సమాచారం…

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

పొలిటోస్ కు ఏఎంబీలో ఎగబడుతున్న జనాలు

Published

on

హైదరాబాద్ లో ఇప్పుడు ఏఎంబీ మాల్ అంటే తెలియని వారు ఉండరు.. సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగుతున్న మహేష్ బాబు వ్యాపార రంగంలోకి దిగి మొదలుపెట్టిన వ్యాపారమే ఈ మల్టీప్లెక్స్ రంగం. ఇందులో సినిమా థియేటర్లతోపాటు మాల్, హోటల్స్, ఫుడ్ కోర్టులు సర్వం అందుబాటులో ఉంచేసరికి ప్రజలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వివిధ వర్గాల వారు ఇందులోకి రావడానికి ఎగబడుతున్నారు.ఇక మహేష్ బాబు కూడా తన సినిమాలకు సంబంధించిన వేడుకలు చేస్తుండడం.. ఈ మాల్ కు సొంతంగా ప్రాముఖ్యత తెస్తుండడంతో ఏఎంబీ మాల్ కు పేరు వస్తోంది. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా బ్రాండ్స్ ఇప్పుడు దీని వైపు చూస్తున్నాయి.

తాజాగా ప్రముఖ ఫుడ్ ప్రాడక్ట్స్ కంపెనీ పొలిటోస్ ఏఎంబీ మాల్ లోని ఫుడ్ కోర్టులో తమ శాఖను ప్రారంభించింది. మొదలు పెట్టిన రోజే కస్టమర్లు రావడం మొదలుపెట్టడం విశేషం.ఇప్పటికే చాలా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పొలిటోస్ ఔట్ లెట్స్ ఉండడం.. అలానే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లో ఈ బ్రాండ్ పాపులర్ అవ్వడం కూడా ఏఎంబీలో మొదలు పెట్టగానే ప్రాచుర్యం పొందడానికి కారణమైంది.పొలిటోస్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పొలిటోస్ చాలా బాధ్యతయుతమైన కంపెనీ అని.. సరసమైన ధరలకు, నాణ్యతతో ఆహార పదార్థాలను అందజేస్తోందని తెలిపారు. అన్ని రకాల చాలా రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయని.. వినియోగదారుల కోరిక వారిని సంతృప్తి పరచడమే తమకు ముఖ్యమని.. అందుకే ఈ విషయంలో రాజీపడమని ఆయన తెలిపారు. మరిన్ని ఔట్ లెట్స్ త్వరలోనే హైదరాబాద్లో చాలా చోట్ల ప్రారంభిస్తామని తెలిపారు.అందుకే ఏఎంబీ మాల్ కి వెళ్లే వాళ్లు పొలిటోస్ వైపు ఒక లుక్ వేసి ఆ రుచిని అస్వాదిస్తే మంచిది.

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరంలో ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ

Published

on

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా
దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం. మేడిగడ్డ (కన్నెపల్లి) పంపుహౌస్‌లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి జలాలు 1.053 కిలో
మీటర్ ప్రెషర్ మేయిన్స్ ద్వారా ప్రయాణించి డెలివరీ సిస్టర్న్ ద్వారా కాలువలోకి విడుదలయ్యింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. పుడమితల్లిని పులకరింపజేసింది. బీడువారిన తెంగాణ భూములను పచ్చని పంటలతో బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు పంపుహౌస్‌ నుంచి నీళ్లు పరుగు తీశాయి. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అందులోనూ మేడిగడ్డ నీళ్లు అన్నారం వైపు పరుగులు తీసే తొలి దృశ్యం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ప్రాజెక్టు విశిష్ఠతలను
గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఎంఇఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి వివరించారు. శుక్రవారం కాళేశ్వరం పథకం ప్రారంభంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్‌ &
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) సంస్థ నిర్మించిన మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి మూడు మెషీన్ల ద్వారా గోదావరి నీళ్లు ఉరకలేశాయి. ఈ కార్యక్రమంలో ఇఎన్‌సి వెంకటేశ్వర్లు, ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మేఘా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ బి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్యఅతిధిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌
రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మేడిగడ్డ పంప్‌ హౌస్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్దదైన ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకోగా అందులో మేడిగడ్డకు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్‌ స్టేషన్లు ఉండగా అందులో మేడిగడ్డ మొదటిది కావటం విశేషం. మేడిగడ్డ పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఉండగా, ఒక్కో మెషీన్‌ 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసి 60 క్యుమెక్స్‌ నీటిని డెలివరీ సిస్ట్రన్‌ ద్వారా గురుత్వాకర్షణ కాలువలోకి (13.5 కిలోమీటర్స్‌) నీటిని విడుదల చేస్తుంది. అంతకుముందు పంప్‌ నుంచి (ప్రెషర్‌ మెయిన్‌) 1.53 కిలోమీటర్ల డెలివరీ మెయిన్‌ ద్వారా ప్రయాణించి కాలువలోకి చేరిన నీరు అన్నారం బ్యారేజ్‌లోకి చేరుతుంది.

కాళేశ్వరం పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో 17 కేంద్రాలను ఎంఈఐఎల్‌ నిర్మిస్తున్నది. మొదటి దశ కింద లింక్‌-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్‌-2 లోని ప్రపంచంలోని అతిపెద్దదైన భూగర్భ పంపింగ్‌ కేంద్రం ప్యాకేజీ-8 నుంచి రోజుకు 2 టిఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధం చేసింది. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో ఒక్కొక్క యూనిట్‌ 40 మెగావాట్ల సామర్థ్యంతో 60 క్యూమెక్స్‌ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించారు. 91 మీటర్ల ఎత్తున గోదావరికి ఆనుకుని నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 660 క్యూమెక్స్‌ నీటిని
ఎత్తిపోయానేది లక్ష్యం. ఇందులో మొదటిదశ కింద 11 యూనిట్లతో 440 మెగావాట్ల పంపింగ్‌ కేంద్రం పనిచేస్తుంటుంది.
దాదాపు ఏడాదిన్నర కాలంలో అతిపెద్దదయిన ఈ ఎత్తిపోతల కేంద్రాన్ని నిర్మించడంలో ఎలక్ట్రోమెకానికల్‌ పనులతో పాటు సివిల్‌ పనులకు ప్రత్యేకత ఉంది. అప్రోచ్‌ కాలువ 9.75 లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతోనూ, వీటి గోడలు 51వేల
ఘనపు మీటర్లతోనూ, పంప్‌హౌస్‌ ముందుభాగం 45.73 లక్షల ఘనపు మీటర్లతోను నిర్మించారు. ఇంత తక్కువ కాలంలో వీటిని నిర్మించడం ఎంఈఐఎల్‌కు మాత్రమే సాధ్యమైంది. ప్రెషర్‌ మెయిన్‌కు 10.56, డెలివరీ సిస్టర్న్‌కు 10.50, మొత్తం అన్నీ కలిపి 77.07 లక్షల ఘనపు మీటర్ల పనిని ఎంఈఐఎల్‌ పూర్తి చేసింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని మళ్లీ అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలోకి చేర్చడానికి అవసరమైన భారీ కాలువను కోటి యాభై లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతో పూర్తి చేసింది. గోదావరి నీటిని ఎత్తిపోయడం మేడిగడ్డ నుంచే మొదవుతుంది. పైగా భూ ఉపరితంపైన ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా భారీ ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద నిర్మితమై పాక్షికంగా వినియోగంలోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం కాళేశ్వరంలో భాగంగా లక్ష్మీపూర్‌ వద్ద ప్యాకేజ్‌-8 ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 7 యూనిట్లతో నిర్మిస్తుండగా, ఆ తర్వాత స్థానాన్ని ప్యాకేజ్‌-6లో 7 యూనిట్లు ఒక్కోటి 124 మెగావాట్లు, ప్యాకేజ్‌ 10లో 4 యూనిట్లు ఒక్కోటి 106 మెగావాట్లు, ప్యాకేజ్‌-
11లో 4 యూనిట్లు ఒక్కోటి 135 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటిదశలో ఈ ఏడాది సాగునీరు అందించేవిధంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల కేంద్రాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజ్‌-6, 8 సిద్ధమయ్యాయి. వీటిలో ప్యాకేజ్‌-6 మినహా మిగిలినవన్ని ఎంఈఐఎల్‌ నిర్మిస్తోంది. మేడిగడ్డలో 17, అన్నారంలో 12, సుందిళ్లలో 14, ప్యాకేజీ 8 లో 7 యూనిట్లు
ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు నీటి పంపింగ్‌కు సిద్ధమయ్యాయి.

ఇప్పటి వరకు దేశం మొత్తం మీద అత్యధిక సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పంపింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఎంఈఐఎల్‌ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా భూ ఉపరితంపైన అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది. ఇప్పటికే లింక్‌-1లోని దాదాపుగా అన్ని యూనిట్లను ఎంఇఐఎల్‌ పంపింగ్‌ కు సిద్ధం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 4627 మెగావాట్ల సామర్థ్యంతో 120 పంపింగ్‌ యూనిట్లు ఏర్పాటవుతుండగా అందులో 105 యూనిట్లను ఎంఈఐఎల్‌ నిర్మిస్తోంది. దీనిని బట్టి కాళేశ్వరంలో ప్రధాన పాత్రను ఎంఈఐఎల్‌
నిర్వహిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన

పంప్‌లు, మోటార్లను బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలమ్‌ లాంటి ఎలక్ట్రోమెకానికల్‌ సంస్థలు సమకూరుస్తున్నాయి. అయితే నిర్మాణ పని మొత్తం ఎంఈఐఎల్‌ చేస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో ఒకేచోట 17 మెషీన్లతో పంపింగ్‌ కేంద్రం ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హంద్రీనీవా ఒక్కటే అతిపెద్దది కాగా, నిర్మాణంలో వున్న దేవాదుల కూడా పెద్దదే. కాగా, వాటిలో ఏ పంపింగ్‌ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో మొదటిదశ ఇప్పుడు వినియోగంలోకి రాగా, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 మెషీన్ల ద్వారా 868 మెగావాట్ల
పంపింగ్‌ సామర్ధ్యం వుండటం మరో ప్రత్యేకత. మెషీన్ల సంఖ్య రీతా.. ఇంతపెద్ద పంపింగ్‌ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా ఏర్పాటు కాలేదు. ఎంఈఐఎల్‌ ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కాళేశ్వరం సమీపంలో కన్నెపల్లి గ్రామం వద్ద నిర్మించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పరిగణించే కొలరాడో (అమెరికా), గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌
వండర్‌ (లిబియా) పథకాలతో పాటు దేశంలోని హంద్రీ-నీవా, కల్వకుర్తి, ఏఎమ్‌ఆర్పీ, దేవాదుల మొదలైన పథకాలు పూర్తి కావడానికి ఏళ్ళు పట్టింది. కొన్ని పథకాలైతే రెండు, మూడు దశాబ్దాల సమయం పట్టింది. కానీ మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని
కేవలం ఏడాదిన్నర సమయంలోపే ఎంఈఐఎల్‌ పూర్తి చేసింది. 2018-19 ఆర్థిక సంత్సవరంలో ఎంఈఐఎల్‌ ఈ ప్రాజెక్ట్‌లో 177 లక్షల ఘనపు మీటర్ల మట్టిపనిని రికార్డ్‌ సమయంలో పూర్తిచేసింది. ఇంత భారీ స్థాయిలో మట్టి పనిచేయడం ఓ రికార్డ్‌. అలాగే కాంక్రిట్‌ పనులు 8.62 లక్షల ఘనపు మీటర్ల మేర 22 నెలల కాలంలో పూర్తి చేసింది. అంటే రోజుకు సరాసరిన 1310 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పని జరిగింది. ఇక మెకానికల్‌ పనుల్లో 18 నెలల కాలంలో 39700 టన్నుల పనిని పూర్తి చేశారు. అన్నింటికీ మించీ కేవలం రెండేళ్ల కాలంలో లింక్‌-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌ హౌజ్‌లోని 2 టీఎంసీ పనులు దాదాపుగా పూర్తిచేయడం అత్యంత అరుదైన విషయం. పంపింగ్‌ కేంద్రం నుంచి కాలువలోకి (డెలివరీ సిస్టర్న్‌) నీరు పైప్‌లైన్ల ద్వారా సరఫరా అవుతుంది. ఇందుకు సంబంధించి 22 పైప్‌లైన్ల ఏర్పాటు పూర్తయ్యింది. మొత్తంగా 3 టీఎంసీ నీటిని తుది దశలో ఎత్తిపోసే విధంగా అవసరమైన
30 పైప్‌లైన్లకు గాను 22 పైప్‌లైన్లను ప్రస్తుతం 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేశారు.
భారీ విద్యుత్‌ వ్యవస్థ:
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ విద్యుత్‌ వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. రోజుకు 3 టిఎంసీ నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను, అందులో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది. తాగు, సాగునీటి అవసరా కోసం ఇంత పెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరంలో ‘మేఘా’ పంపులు

Published

on

ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల పధకం కాళేశ్వరంలో ప్రధానమైన లింక్ 1, 2 లోని ఎత్తిపోతల కేంద్రాలను మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్‌) యుద్ధప్రాతిపదికన రికార్డు సమయం లో పూర్తిచేసింది. లింక్ 1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్ 2లోని ప్రపంచంలోని అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రాన్ని (ప్యాకేజీ 8) సిద్ధం చేసింది.ఈ పనులను రెండేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేయడం ద్వారా ఎంఇఐఎల్‌ తన శక్తీ సామర్ధ్యాలను చాటుకుంది. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీస్థాయిలో పంపుహౌస్‌నుకాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేస్తున్నది. రోజూ గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 120 మెషీన్‌లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు వుంటాయి.

ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్‌లను ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేస్తుండటాన్ని బట్టి
ఎంత పెద్ద స్థాయిలో పను చేస్తున్నదీ అర్ధమవుతుంది. ఈ పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతూండగా అందులో 17 కేంద్రాలను మేఘా నిర్మిస్తున్నది.ఇప్పుడు మొదటి దశ కింద లింక్‌`1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను పాక్షికంగా నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్‌`2 లోని ప్రపంచంలోని అతిపెద్దదయిన భూగర్భ పంపింగ్‌ కేంద్రం (పాకేజీ
8) కూడా రోజుకు 2 టిఎంసీల నీటిని పంపు చేసే విధంగా సిద్ధం చేసింది.

ఈ నె 21 శుక్రవారం కాళేశ్వరం పథకాన్ని మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం వద్ద లాంఛనంగా ముఖ్యమంత్రులు ప్రారంభిస్తారు. ఇప్పటికే గోదావరి నీటిని మేడిగడ్డ పంపుహౌస్‌లోని ఫోర్‌బే లోకి తరలించారు. మోటారు ఆన్‌ చేయడం ద్వారా డెలివరీ సిస్టర్న్‌ (భూగర్భంలోని పైపు) నుంచి నీరు మళ్లీ గోదావరి లోకి అంటే ఎగువన వున్న అన్నారం బ్యారేజీ లోకిప్రవహిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో ఎంఈఐఎల్ డైరెక్టర్‌ బీ. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో మరెక్కడా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీమ్‌ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజీనీరింగ్ అధ్బుతం. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌ ఈ ప్రాజెక్టు సొంతం. మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 6 మెషిన్లను కేవలం పది
నెలల రికార్డు సమయంలో నెలకొల్పడం మరో ప్రపంచ రికార్డు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకునిపర్యవేక్షించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అని అన్నారు.

ప్రపంచంలోనే తొలిసారి
ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా ఇంత భారీ స్థాయిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించనే లేదు. ఇదే తొలి అతిపెద్దఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టిఎంసీల నీటిని పంపు చేయాలంటే 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. మొదటి దశలో 2 టిఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థలో ప్రధానమైన పంపింగ్‌ కేంద్రాలను, వాటికి అవసరమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థను దాదాపుగా ఎంఇఐఎల్‌ నిర్మించింది. విద్యుత్‌ వ్యవస్థకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. పంపింగ్‌ కేంద్రాల్లో సివిల్‌ పనులు రికార్డు సమయంలో పూర్తి కాగా, ఎలక్ట్రోమెకానికల్‌ అంటే మెషీన్ల ఏర్పాటు (మోటారు, పంపు) చురుగ్గా జరుగుతుండగా ఈ సీజన్‌లో నీటిని పంపుచేసేందుకు అవసరమైన మెషీన్లను ఎంఇఐఎల్‌ సిద్ధం చేసింది.

ప్రపంచంలో భారీఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌లోని గ్రేట్‌ మేన్‌మేడ్‌ రివర్‌ (జిఎంఎంఆర్‌) లాంటి వాటిని చెప్పుకుంటారు. అయితే వీటి పంపు సామర్ధ్యం కేవలం హార్స్‌పవర్‌లోనే ఉంది. వాటిని రెండు మూడు దశాబ్దాల సమయం తీసుకుని నిర్మించారు. ప్రపంచం మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తిపోతల పథకాలు2000 తరువాత మొదలయ్యాయి. అందులో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం లాంటి పథకాలు చెప్పుకోవచ్చు. అదే సమయంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఎత్తిపోతల పథకాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. అయితే ఆ పథకంలో మెషీన్‌ 40 మెగావాట్ల సామర్ధ్యం మాత్రమే కలిగి వుంది. దేశంలో ఎలక్ట్రోమెకానికల్‌ రంగంలో అగ్రగామిగా వున్న ఎంఇఐఎల్‌ రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని 2012 లోనే పూర్తిచేసి నిరాటంకంగా దాన్ని నిర్వహిస్తున్నది. ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎత్తిపోతల పథకాలు ఎంఇఐఎల్‌ నిర్మించింది, నిర్మిస్తున్నది.

పంపుహౌస్‌ నిర్మాణంలో రికార్డులే రికార్డులు:
కాళేశ్వరం పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల్లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. లింక్‌`1లోని ఈ మూడు పంపుహౌస్‌ కిందే 1720 మెగావాట్ల విద్యుత్‌వినియోగంలోకి వస్తోంది. అదే విధంగా ప్యాకేజీ 8లోని భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 యూనిట్లు (మెషీన్లు) ఏర్పాటుఅవుతూండగా ఇప్పటికే రోజుకి 2 టీఎంసీలు పంపు చేసే విధంగా 5 మెషీన్లు సిద్ధంగా వున్నాయి. ఇందులో ఒక్కొక్క మెషీన్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీ స్థాయి మెషీన్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటిని బిహెచ్‌ఇఎల్‌ విడిభాగాల రూపంలో సరఫరా చేసింది. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం వుంటుంది. బిహెచ్‌ఇఎల్‌ తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆండ్రిడ్జ్‌, జైమ్‌ సంస్థలు మెషీన్లను విడిభాగాల రూపంలో సరఫరా చేశాయి. ఆ తరువాత ప్యాకేజీ 11 లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేస్తున్నది. ఆ తరువాత ప్యాకేజీ 10 లోని నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటవుతున్నాయి. ప్యాకేజీ 6 లో ఇప్పటికే ఒక్కొక్కటి 124 మెగావాట్ల సామర్ధ్యం గల 7 మెషీన్లను ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. అత్యధికంగా మేడిగడ్డలో 17, సుందిళ్లలో 14, అన్నారంలో 12, ప్యాకేజీ`14లో 12, ప్యాకేజీ`21
(రెండు స్కీము)లో 18 పంపులు ఏర్పాటు అవుతున్నాయి.

మొదటిదశలో 63 మెషీన్లు ఏర్పాటు లక్ష్యంగా ఎంఇఐఎల్‌ పనులు ప్రారంభించగా అనతికాలంలో అంటే కేవలం 2ఏళ్లసమయంలో 33 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ`8, ప్యాకేజీ`14లోని పంపుహౌస్‌లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా వున్నాయి. సాగునీటిపథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తి కావడానికి దశాబ్దా సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఎంఇఐఎల్‌ చేపట్టి రెండేళ్ల
కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధం చేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను ఎంఇఐఎల్‌ సొంతం చేసుకుంది. మేడిగడ్డ పథకానికి 2018 19 ఆర్ధిక సంవత్సరంలో 177 లక్షల ఘనపు మీటర్ల మట్టిపనిని పూర్తి చేసింది.

అంటే రోజుకు సరాసరిన లక్షల ఘనపు మీటర్ల పని జరిగింది. ఇంజనీరింగ్‌ పనుల్లో ఇది ఒక రికార్డు. అదే విధంగా 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే. 10 నెలల సమయంలో 6 మెషీన్లను మేడిగడ్డలో ఆండ్రిడ్జ్‌, జైమ్‌ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసి ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా జరగని విధంగా తక్కువ సమయంలో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది. అదే విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో అన్నారం ఎత్తిపోతల పథకంలో 8 నెలల కాలంలో 115 లక్షల ఘనపు మీటర్ల మట్టి పనిని, 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును

ఏర్పాటు చేసే పనిని ఎంఇఐఎల్‌ పూర్తి చేసింది. ఈ పంపింగ్‌ కేంద్రంలో కూడా 6 మెషీన్లు అదే సమయంలోపూర్తయ్యాయి. ఇక సుందిళ్ల విషయానికి వస్తే 6 నెలల కాలంలో 108 లక్షల ఘనపు మీటర్ల మట్టిపనిని, 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. 21 నెలల కాలంలో 40447 టన్నుల పైపునుభూగర్భంలో అమర్చారు. 6 నెలల సమయంలో 6 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసారు. భూగర్భ ఇంజనీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం ప్యాకేజీ 8 పంపింగ్‌ స్టేషన్‌ ఇది ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల పంపింగ్‌ స్టేషన్‌. భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించినది. ఒక్కొక్కటి
139 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 7 యూనిట్లు కలిగిన ఈ పంపింగ్‌ స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించడం మరో అరుదైన విషయం. సాంకేతికంగా, శాస్త్రీయంగా ఇక్కడ భూమి దిగువన పంపింగ్‌ స్టేషన్‌ నిర్మించాల్సి వచ్చింది. దీని ద్వారా రోజుకు 3 టిఎంసీల నీరు ఎత్తిపోయడం జరుగుతుంది.

ఈ పంప్‌ హౌస్‌లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం అయింది. ఇందులో మొదటిదశలోని 5 యూనిట్లు 57,049 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రతి అంతస్తు నిర్మించగా, రెండో దశలోని రెండు (6, 7 మెషీన్లు) యూనిట్లు ప్రతి అంతస్తు 30,946 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. పంపు హౌస్‌లో ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్‌బేలు, కంట్రోల్‌ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్‌ రూం (అంతస్తు) ఒక్కొక్కటి చొప్పున వున్నాయి. అదే విధంగా ఎల్‌టి ప్యానల్స్‌, పంప్‌ ఫ్లోర్‌, కంప్రెషర్‌లు కలిపి మొత్తం 4 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఈ పనిని ఎంఇఐఎల్‌ ఛాలెంజింగ్‌ గా తీసుకుని బిహెచ్‌ఇఎల్‌ సహకారంతో అనితరసాధ్యమనే రీతిలో మొదటి దశ పూర్తిచేసింది. బిహెచ్‌ఇఎల్‌ సరఫరా చేసిన ఈ మెషీన్లు సాంకేతికత రీత్యా అత్యధునాతనమైనవి. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా రోబోస్ట్‌ ఇంజనీరింగ్‌, సిఎఫ్‌డి (కంప్యుటేషనల్‌ ఫ్లూయీడ్‌ డైనమిక్స్‌) పరిజ్ఞానంతో
ఇవి రూపొందించబడ్డాయి. భూ అంతర్భాగంలో వీటిని ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎటువంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

మొత్తం పనిలో 40 శాతం బిహెచ్‌ఇఎల్‌ వాటా.. అంటే మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయడం కాగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ 8 వద్దకు తీసుకొచ్చాక అసెంబల్‌ / ఎరక్షన్‌చేయడం కీలకమైన 60 శాతం పనిని ఎంఇఐఎల్‌ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది. నిర్మాణ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రోమెకానికల్‌ పనుల్లో 25 ఏళ్ల అనుభవం కలిగిన ఎంఇఐఎల్‌ ఈ పనిని అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని సైతం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పంపుహౌస్‌లో ప్రత్యేకత రెండు టన్నెల్స్‌ (ట్విన్‌ టన్నెల్స్‌) పక్కపక్కనే నిర్మితమవడం. వీటిని కుడి ఎడమ టన్నెల్స్‌గా పిుస్తుంటారు. 10.5 మీటర్ల వ్యాసంతో వీటిని తొలిచి నిర్మించారు.

ఒక్కొక్కటి 4,133 మీటర్ల పొడవున వున్నాయి. వీటి లైనింగ్‌ తదితర పనులు కూడా పూర్తయ్యాయి.
పంపుహౌస్‌తోపాటుగా ఇందులోని సర్జ్‌పూల్‌, అడిషనల్‌ సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే అతిపెద్దవి. పైగా
భూగర్భంలో ఇలా నిర్మించడం ఇదే తొలిసారి. పంపుహౌస్‌ పరిమాణం 330 మీటర్ల లోతు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తులో వుందంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. పంపు చేయడానికి అవసరమైన నీరు సర్జ్‌పూల్‌కుచేరుతుంది. ఇక్కడ భారీ పరిమాణంలో నీరు వుండాలి. అందుకు తగిన విధంగా 3 సర్జ్‌పూల్స్‌ నిర్మించారు. 200x20x67.8 మీటర్ల పరిమాణంతో ప్రధాన సర్జ్‌పూల్‌ నిర్మాణం పూర్తయింది. అదనపు సర్జ్‌పూల్‌ నిర్మాణం 60x20x69.5 మీటర్ల సామర్ధ్యంతోను పూర్తి చేశారు. 2వ దశ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం 189.5 మీటర్ల దిగువన 115x25x64.75 మీటర్ల పరిమాణంతో పని పూర్తయింది. అదే విధంగా ట్రాన్స్‌ఫార్మర్‌బేను కూడా ప్రత్యేకంగా కింది భాగంలో నిర్మించారు. పంపుహౌస్‌ దిగువభాగం.. అంటే నేలభాగం గ్రౌండ్‌లెవెల్‌ నుంచి 330 మీటర్ల దిగువకు ఉండటం ఒక ప్రత్యేకత. వర్టికల్‌ పంపును 138 మీటర్ల దిగువన ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. ప్రతి పంపు మోటారూ బరువు 2,376 మెట్రిక్‌ టన్నులు ఉందంటే ప్రతీ యూనిట్‌ ఎంత పెద్దదో చెప్పాల్సిన పని లేదు.
అరుదైన విద్యుత్‌ వ్యవస్థ:
రోజుకు 3 టిఎంసీల నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. దేశంలో కొన్నిరాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల మొత్తం విద్యుత్‌ డిమాండే అంత వుంటున్నదంటే ఈ పథకం ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను, అందులో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లను 3057 మెగావాట్ల సామర్ధ్యం మేర ఎంఇఐఎల్‌ నిర్మించింది. తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంత పెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనతికాలంలోనే అంటే రెండేళ్ల వ్యవధిలో ఇంతపెద్ద విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఇఐఎల్‌ మరో రికార్డు అధిగమించింది. ఈ ప్రాజెక్టు ద్వారా
మొత్తం 37.08 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
పూర్తవుతుంది.

Comments

comments

Continue Reading
Advertisement

Trending