Connect with us

Uncategorized

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Published

on

దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న ట్రుజెట్‌ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితంహైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రుజెట్‌
క్రమంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాంలో విస్తరించింది. 2015 జులైలో రెండు ఎటిఆర్‌ 72 విమానాతో ప్రారంభమైన సంస్థ అనతికాలంలోనే వాటిని 5కు పెంచుకోగలిగింది. దేశవ్యాప్తంగా 20 కేంద్రాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. ఓవైపు ప్రాంతీయ విమాన సర్వీసులు ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మూతపడుతుంటే ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసిన ట్రుజెట్‌ మాత్రం తన సేవలను, వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పటిష్టపడటమే కాకుండా లాభాల బాటలోకి
అడుగుపెట్టింది. ప్రధానంగా ‘ఉడాన్‌’ పథకం కింద సేవలను నిర్వర్తిస్తూ 2019 డిసెంబరు నాటికి 5 ఎటిఆర్‌ 72 విమానాల నుంచి 10 ఎటిఆర్‌ 72 విమానాలను పెంచుకునే విధంగా ఏర్పాట్లు, ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎంఇఐఎల్‌ డైరెక్టర్‌ కె.వి. ప్రదీప్‌ తెలిపారు.

ట్రుజెట్‌ ‘ఉడాన్‌’ రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలనుఅందిస్తోంది. ఈ పథకం కింద సేవలను అందించే అతిపెద్ద విమానయాన సంస్థగా ట్రుజెట్‌ పేరు సంపాదించుకుంది. గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలో విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రధానమంత్రి ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ‘ఉడాన్‌’ పథకం కింద తొలుత దక్షిణ భారతదేశంలో సేవలు ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తోంది. దేశంలో 20 నగరాలకు సేవల విస్తరణ
గడచిన ఏడాది కాలంలో అహ్మదాబాద్‌ను ట్రుజెట్‌ రెండవ కేంద్రంగా చేసుకుని తన సిబ్బందిని 700కు పైగా పెంచుకుంది. త్వరలో మరో బేస్‌ కేంద్రాన్ని ట్రుజెట్‌ ఏర్పాటు చేయనుంది. అంతేకాక ప్రస్తుతం వున్న 5 విమానాలతో దేశంలోని 20 గమ్యస్థానాలకు సేవలను నిర్వహిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో తన
వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ట్రుజెట్‌ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకోసం తక్కువ ధరకు టికెట్లు అందించడం, ముందుగానే సీట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం, బోర్డింగ్‌ పాస్‌ లో వ్యాపార ప్రకటనలు ముద్రించడం వంటి చర్యలను చేపట్టింది. దేశీయ విమానయాన సేవలు అందిస్తున్న ట్రుజెట్‌ అంతర్జాతీయ
విమానయానం చేసే ప్రయాణికులకు సైతం ఉపయోగపడేలా వారికి కనెక్టివిటీ కల్పించేందుకు గానూ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుందని ట్రూజెట్ సిఎఫ్ఓ విశ్వనాధ్ చెప్పారు

సామాజిక సేవలో కూడా..

కేరళలో వరదలు సంభవించినప్పుడు బాధితులకు తన వంతు సేవగా పలు ప్రాంతాల నుండి కేరళకు ఆహారం, మందు, మంచినీరు, దుస్తులు తన విమానాలల్లో ఉచితంగా రవాణా చేసిన ఏకైక విమానయాన సంస్థగా నిలిచింది. ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ కార్యక్రమంలో గ్రామీణ బాలలకు ఉచితంగా విమాన ప్రయాణాన్ని అందించింది. ట్రుజెట్‌ నాల్గవ వార్షికోత్సవ సందర్భంగా తలసీమియా బాధితులకు సంస్థ సిబ్బంది 100 మంది జులై 5న రక్తదానం నిర్వహించారు. అదే సమయంలో విమాన ప్రయాణం అంటే తెలియని పేద
వృద్ధ మహిళలను 45 మందిని నాందేడ్‌కు ఉచితంగా తమ విమానంలో తీసుకువెళ్లి వెనక్కి తీసుకువచ్చారు. అదే విధంగా అనాధ పిల్లలను బళ్లారి, కడప తదితర ప్రాంతాలకు విమానంలో ఉచితంగా తీసుకువెళ్లడంతో పాటు అనేక ఉచిత, చైతన్య అవగాహన కార్యక్రమాలను ట్రుజెట్‌ నిర్వహించింది.

లాభాలతో, విజయవంతంగా : కెవి. ప్రదీప్‌

ఎంఇఐఎల్‌ డైరెక్టర్‌ కె.వి. ప్రదీప్‌ మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా ట్రుజెట్‌ ప్రాంతీయ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రాంతీయ సేవల విభాగంలో తమతోపాటుగా ప్రారంభమైన విమానసేవల కంపెనీల్లో ట్రుజెట్‌ ఒక్కటే విజయపథంలో సాగుతోందన్నారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు అందించడం తమకు మంచి అవకాశమని పేర్కొన్నారు. దశలవారీగా దీన్ని మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు
సాగుతామన్నారు. సంస్థ సిఇఒ, రిటైర్డ్‌ కల్నల్ ఎల్‌.ఎస్‌.ఎన్‌. మూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను విమాన సేవ పరిధిలోకి తీసుకువచ్చే అంశంలో ట్రుజెట్‌ విశేషమైన కృషి చేసిందన్నారు. ఇది మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతృ సంస్థ ఎంఇఐఎల్‌ నుండి తమకు పూర్తి సహాయసహాకారాలు అందుతున్నాయన్నారు. అంతేగాక విమానాల నిర్వహణ, విమానాశ్రయాల సేవలు, పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌, బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో పాటు 700 మంది
సిబ్బందితో ట్రుజెట్‌ దేశీయ విమానయాన రంగంలో మరింత విస్తృతం కానుందని
చెప్పారు.

ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో…

నాలుగేళ్ల క్రితం అంటే 2015 జులై నెలలో టర్బోమేఘా ఏవియేషన్‌ లిమిటెడ్‌ తన విమాన సేవల బ్రాండ్‌ ట్రుజెట్‌ పేరుతో తన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ కేంద్రాలుగా దేశంలో 20కి పైగా పట్టణాలకు వారానికి 300 విమాన సర్వీసులను అందిస్తున్నది. ముంబయ్‌, చెన్నయ్‌, బెంగళూరు, గోవా, ఔరంగాబాద్‌, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, సేలం, విద్యానగర్‌, మైసూర్‌,
నాందేడ్‌, పోర్‌బందర్‌, నాసిక్‌, కాండ్లా, జైసల్మీర్‌, ఇండోర్‌ నగరాలకు తన విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం ట్రుజెట్‌ చేతిలో ఎటిఆర్‌ 72 రకం విమానాలు 5 వున్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 700కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఉడాన్‌ 1, ఉడాన్‌ 2 పథకంలో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించిన ఏకైక సంస్థ ట్రుజెట్‌. ఉడాన్‌ 3 పథకంలో పేర్కొన్న ప్రాంతాలకు కూడా తన సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. గత నాలుగేళ్లలో దాదాపు 2 మిలియన్‌ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి పలుఅవార్డులను, ప్రశంసలను అందుకుంది. కార్యక్రమంలో ట్రూజెట్ సీసీవో సుధీర్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Published

on

ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణరావు సూపర్ మార్కెట్’. బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలనే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీ నటులు – కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురం
నిర్మాత‌లు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్

కథ:

అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఇక అర్జున్ ప్రేమను చూసిన సంజన కూడా అతని ప్రేమలో పడుతుంది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సడన్ గా ఒక చెడు పరిణామం సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంజనను చంపుతాడు. అతను ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అతన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ లు తమ వారసులను హీరోలుగా సినీ ప్రపంచంలోకి తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కమెడియన్ల కొడుకులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ వంతు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. మొదటి సినిమా అయినా కూడా అలాంటి భావన మనకు ఎక్కడా కనిపించదు. కిక్-బాక్సింగ్ చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటి లాగే తన నటనతో సూపర్ అనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. చాలా బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కృష్ణారావు సూయర్ మార్కెట్. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసాడు. భవిషత్తులో అతనికి మరిన్ని మంచి సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం కృష్ణారావు సూపర్ మార్కెట్.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు
హీరో కృష్ణ నటన
విలన్ సస్పెన్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
దర్శకత్వం

రేటింగ్: 3.5/5

Comments

comments

Continue Reading

Uncategorized

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Published

on

తెలంగాణ ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ స్వాహా చేసేస్తోంది అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదు. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్కి చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో మేఘ 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Published

on

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గానూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం (07-09-2019) హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డ్ లను అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, అతితక్కువ కాలంలో పూర్తిచేసిన ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కు ఐసీఐ అవార్డును అందించింది.  ఈ అవార్డును ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఇఐఎల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని మరోసారి రుజువైంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో ఎంఇఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. లింక్-1లోని మూడు పంప్ హౌస్ లలో దాదాపు 21 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించాం. ఇలాంటి అరుదైన ఘనతను సాధించినందుకు గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో పనిచేసిన 1500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’ అని ఆయన చెప్పారు.ఈ ఇక కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఐసీఐ తెలంగాణ సెంటర్ ఛైర్మన్ పీ. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*సాగునీటి పథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తికావడానికి దశాబ్దాల సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన మేఘా చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంచేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను మేఘా సొంతం చేసుకుంది.
*మేడిగడ్డ పంప్ హౌస్ లో 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే.
*అదేవిధంగా అన్నారం ఎత్తిపోతల పథకంలో 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటుచేసే పనిని మేఘా పూర్తిచేసింది.
*ఇక సుందిళ్ల విషయానికి వస్తే 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తిచేసింది.  ఈ పంపు హౌస్ లన్నింటిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసింది.
*ఇక ఈ మూడు పంప్ హౌస్ లలో మొత్తం  దాదాపు 21 లక్షల కాంక్రీట్ పనిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసి  తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించింది.

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending