Connect with us

Uncategorized

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

Published

on

https://www.youtube.com/watch?v=nqxBFvBw0GQ

బదిలీల కోసం లంచాలంటూ ఉద్యోగులను వేధిస్తే తాటా తీస్తానంటూ ఆంధ్రప్రదేశ్ RTA  కమీషనర్ PSR ఆంజనేయులు   రవాణా శాఖ లోని అవినీతిపరులకు ఇచ్చిన వార్నింగ్ వీడియోనెట్టింట హల్ చల్ చేస్తోంది. గత ప్రభుత్వం హయాం లో RTA  శాఖ లో జరిగిన అవినీతి పర్వాలపై ఇప్పటి కే కొరడ ఝళిపిస్తోన్న ఈ IPS అధికారి తాజా వీడియో, రవాణా శాఖ లోపాతుకుపోయిన అవినీతి అనకొండల కు దడపుట్టిస్తోంది.2015 నుండి బదిలీలు కాకుండా లంచాలిచ్చి అప్పటి రవాణాశాఖ కమీషనర్ ఫ్రీ హ్యాండ్ తో  ఆమ్యామ్యాలకు ఇష్ఠ్యా రాజ్యంగా మారిన RTA  డిపార్ట్మెంట్ లో ఇప్పటి కే అవినీతి అధికారులదుమ్ముదులుపుతున్న రవాణా శాఖ కమీషనర్ తాజా వీడియో సమావేశాల్లో డిప్యూటీ ఆర్టీఏ అధికారులకు, మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లుకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..
ఏపిలో కొత్తగా ఏర్పడ్డ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, పారదర్శకత లో భాగంగా కఠినంగా వుండాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయం లో ఎలాంటి అవినీతిఅధికారులను ఉపేక్షించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో సీఎం ఆదేశాలను అమలు చేస్తూన్నారు రవాణా శాఖ ఉన్నతాధికారులు.
శాఖలోని అధికారులు బదిలీలకోసం ఉద్యోగుల నుండి లంచాలు వసూలు చేస్తున్నారనే  సమాచారం ఆయనకు రావడంతో బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్న అనకొండలతో ప్రత్యేకమీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ల నుండి డిప్యూటీ కమీషనర్ రేంజ్ స్థాయి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడుసామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  లంచాలు, రికెమెండెషన్ లు లేని వారికే మొదటి ప్రియారిటీ అన్న కోటాలో తాజా బదిలీలు రవాణ శాఖలో తొలిసారిగా జరిగాయని RTA ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆ శాఖ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నాటినుండి ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలపై కఠిన చర్యలు, వాటితో పాటు దొంగ ఇన్ వాయిస్లతో లైఫ్ టాక్స్ఎగ్గొట్టిన డీలర్ల పై ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు  కమీషనర్ PSR ఆంజనేయులు. తాజా గా జరిగిన బదిలీల ప్రక్రియ లో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పారదర్శకంగా, కఠినంగాచేపట్టడంతో దాదాపు 300 మందికి పైగా ఉద్యోగులలో బదిలీలు నయాపైసా ఖర్చుకాకుండా జరిగాయని రవాణా శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు..

ఆర్టీఏ లో అవినీతిపై ఆంజనేయ యుద్దం

ఏపి RTA డిపార్ట్మెంట్ లో సంస్కరణలు చేపట్టాలనుకుంటున్న ఉన్నతాధికారులకు తనిఖీలకు వెళ్లిన కొద్దీ గత సర్కారు హయాంలో జరిగిన అవినీతి మూలాలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అడ్డంగా దోచుకున్న విధానం తెలుసుకున్న అధికారులు విస్తుబోతున్నారట. వాహనాల లైఫ్ టాక్స్ ఎగవేత- ఉచిత LLR పేరుతో వసూళ్ళు- డీలర్ల దోపిడీ- ఏజెంట్ల కక్కుర్తి – నకిలీ ఇన్ వాయిస్ లతో కోట్ల రూపాయల దోపిడీ విధానం- అయిన వాళ్లకు పప్పులూబెల్లాల పంచేయడంతో రికవరీకి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు వేస్తూ తాట తీయడానికి సిద్ధమవుతున్నారు.
గత ప్రభుత్వం హయాం లో ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా వున్న. బాలసుబ్రహ్మణ్యం స్థానంలో వచ్చిన IPS అధికారి పీ.సీతారామాంజినేయులు తన బృందాలతో డిపార్ట్మెంట్ లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. PSR బృందం తనిఖీల్లో అవాక్కయే స్కాం లు బయటపడుతున్నాయి. రాష్ట్రం లో విజయవాడ- విశాఖపట్నం- అనంతపురం జిల్లాలో దాదాపు 46 మోటార్ వాహనాల షో రూం లపై రవాణా శాఖ అధికారులు జరిపిన మెరుపుదాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్దాయి. రవాణా శాఖలో కీలకమైన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ లో కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని అధారాలతో సహ వెలికి తీసారు.

విజయవాడ లో 19మంది డీలర్లు విశాఖపట్నం లో 22మంది అనంతపురంలో 5గురు డీలర్ల గుప్పిట్లో రాష్ట్ర రవాణా శాఖ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విభాగం లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాలను 50-60 వేల రూపాయలకు అమ్మినట్టు ఇన్ వాయిస్ లు తయారు చేసి.. రాష్ట్ర రవాణా శాఖ కు చెల్లించాల్సిన బీమా పన్నులను ఎగవేసినట్టుగా అధికారుల సోదాల్లో బట్టబయలు అయ్యుంది. అనంతపురం జిల్లాలో ఒకడీలర్ ఏకంగా 18 లక్షల రూపాయలు స్వాహా చేయడం బట్టబయలు కావడం తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వున్న డీలర్లు దాదాపు 250-300 కోట్ల రూపాయలు బీమాటాక్స్ చెల్లించకుండా RTA ఖజానాకు సున్నంపూశారని అధికారుల దాడుల్లో తేలింది. ఆన్ లైన్ వ్యవస్థలోని కొందరు ఉద్యోగులు డీలర్లతో కుమ్మకై తమ శాఖకు రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించడం పై డీలర్ల తో దోస్తీ చేసిన ఉద్యోగులపై యాక్షన్ కి సిద్దమవుతున్నారు రవాణా శాఖ కమీషనర్ PSR ఆంజనేయులు.

రవాణా శాఖలో జరిగిన అవినీతి దందాను అధారాలతో సహా సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పటికే నివేదిక అందచేసిన కమీషనర్ ఇంటి దొంగల జాబితాని రెడీ చేస్తున్నారు. ఇక ఏపి వ్యాప్తంగా అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ AP 39 పేరుతో జరిగిన దోపిడీ లో గత ప్రభుత్వం లోని పెద్దల హస్తం వుండటం తో వారి పాత్ర పై ఆధారాలు సేకరిస్తున్నారు రవాణా శాఖ కమీషనర్ PSR ఆంజనేయులు. AP 39 సిరీస్ వల్ల రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు ఒకే నంబర్ వుండటం వల్ల ఏ వాహనం రిజిస్ట్రేషన్ ఏ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో జరిగిందో తెలియని గందరగోళం రవాణా శాఖ లో నెలకొంది. ఈ విధానం ప్రారంభించిన ఆరునెలల్లోనే RTA కి ఏడుకోట్ల రూపాయలు నష్టం వచ్చిందని నిర్ధారించారు రవాణా శాఖ అధికారులు.

గతంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ముఖ్యమైన నంబర్లకు ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట ద్వారా ఆర్టీఏ శాఖకు లక్షల్లో ఆదాయ౦ వచ్చేది… అయితే AP 39 సిరీస్ విధానం వల్ల డిమాండ్ వున్న వాహనల నంబర్ను ఇప్పుడు ఉచితంగా ఇచ్చేస్తున్నారు అధికారులు. దీని వల్ల గత ఆరునెలల్లో సంస్థకు కోట్ల రూపాయలలో కన్నం పడిందని రవాణా శాఖ కమీషనర్ ఆంజనేయులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఐదేళ్ల కాలం లో స్వైపింగ్ మిషన్ల ద్వారా చేసిన లావాదేవీలకు ఇప్పుడు లెక్క తేలకపోవడంతో దాదాపు నలభై కోట్ల రూపాయల గోల్మాల్ పై విచారణ కు సిద్దమవుతున్నారు కమీషనర్.

ఇక ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకున్ని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడిపి నేత రవాణా శాఖ లో LLR మేళాల పేరిట 30 వేలమందికి ఉచితంగా లైసెన్సు లు చేపట్టారు. అప్పటి ప్రభుత్వంలోని అధికారులతో లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదట ఉచితంగా LLR అని చెప్పి..తర్వాత మేళా ముగిసిన తర్వాత ముప్పై వేల LLR లకు తాను ఖర్చు పెట్టానని దీనికి పెద్దమొత్తం లో ఖర్చు అయ్యిందని తెలుగు దేశం ప్రభుత్వం హయామ్ లో డబ్బులు మెత్తం వసూలు చేసాడు. ఓ వైపు ప్రజలకు ఉచితంగా సర్వీస్ అంటూనే ప్రభుత్వం దగ్గర బిల్లులు వసూళ్లు చేసుకున్న కుంభకోణం ఇప్పుడు RTA శాఖలో సంచలనంగా మారింది. దీనిపై ఎంత మొత్తం చేతులు మారాయన్న దానిపై ఆర్థిక శాఖ అధికారుల వద్ద సాక్ష్యాలు సేకరిస్తున్నారు రవాణా శాఖ కమీషనర్ ఆంజనేయులు.

రవాణా శాఖ లో సంస్కరణల పేరిట జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన రవాణా శాఖ కమీషనర్ తదుపరి చర్యలపై సీఎం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయవనరుల్లో ఒకటైన రవాణా శాఖ లో కోట్ల రూపాయలు స్కాం లు బయటపడుతుండటం ఇంకా లోతుగా విచారణ చేస్తే ఇంకెన్ని స్కాం లు బయట పడుతాయో అని అవినీతి అధికారులు భయపడుతున్నారు.

Video link :

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Published

on

ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణరావు సూపర్ మార్కెట్’. బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలనే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీ నటులు – కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురం
నిర్మాత‌లు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్

కథ:

అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఇక అర్జున్ ప్రేమను చూసిన సంజన కూడా అతని ప్రేమలో పడుతుంది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సడన్ గా ఒక చెడు పరిణామం సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంజనను చంపుతాడు. అతను ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అతన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ లు తమ వారసులను హీరోలుగా సినీ ప్రపంచంలోకి తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కమెడియన్ల కొడుకులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ వంతు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. మొదటి సినిమా అయినా కూడా అలాంటి భావన మనకు ఎక్కడా కనిపించదు. కిక్-బాక్సింగ్ చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటి లాగే తన నటనతో సూపర్ అనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. చాలా బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కృష్ణారావు సూయర్ మార్కెట్. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసాడు. భవిషత్తులో అతనికి మరిన్ని మంచి సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం కృష్ణారావు సూపర్ మార్కెట్.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు
హీరో కృష్ణ నటన
విలన్ సస్పెన్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
దర్శకత్వం

రేటింగ్: 3.5/5

Comments

comments

Continue Reading

Uncategorized

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Published

on

తెలంగాణ ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ స్వాహా చేసేస్తోంది అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదు. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్కి చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో మేఘ 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Published

on

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గానూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం (07-09-2019) హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డ్ లను అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, అతితక్కువ కాలంలో పూర్తిచేసిన ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కు ఐసీఐ అవార్డును అందించింది.  ఈ అవార్డును ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఇఐఎల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని మరోసారి రుజువైంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో ఎంఇఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. లింక్-1లోని మూడు పంప్ హౌస్ లలో దాదాపు 21 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించాం. ఇలాంటి అరుదైన ఘనతను సాధించినందుకు గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో పనిచేసిన 1500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’ అని ఆయన చెప్పారు.ఈ ఇక కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఐసీఐ తెలంగాణ సెంటర్ ఛైర్మన్ పీ. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*సాగునీటి పథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తికావడానికి దశాబ్దాల సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన మేఘా చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంచేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను మేఘా సొంతం చేసుకుంది.
*మేడిగడ్డ పంప్ హౌస్ లో 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే.
*అదేవిధంగా అన్నారం ఎత్తిపోతల పథకంలో 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటుచేసే పనిని మేఘా పూర్తిచేసింది.
*ఇక సుందిళ్ల విషయానికి వస్తే 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తిచేసింది.  ఈ పంపు హౌస్ లన్నింటిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసింది.
*ఇక ఈ మూడు పంప్ హౌస్ లలో మొత్తం  దాదాపు 21 లక్షల కాంక్రీట్ పనిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసి  తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించింది.

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending