Connect with us

Uncategorized

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Published

on

జాతీయ స్థాయిలో విద్యుత్ఉత్పత్తి, సరఫరా రంగంలో చెరగని ముద్రను వేసుకున్న ఎంఇఐఎల్ థర్మల్విద్యుత్ఉత్పత్తిలోను  దిగ్విజయంగా ప్రస్థానాన్ని ప్రారంభించింది. జల, సోలార్విద్యుత్ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఎంఇఐఎల్ తమిళనాడు రాష్ట్రంలో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మించింది. ముందుగా నాగపట్నం జిల్లాలో నాగాయ్విద్యుత్కేంద్రాన్ని ప్రారంభానికి సిద్ధం చేసింది. అలాగే  ట్యూటికోరిన్ జిల్లాలో ఎస్ఇపిసి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కేంద్రం 525 మెగావాట్ల బొగ్గు ఆధారితమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసింది

నాగాయ్లో 150 మెగావాట్లతో… 

నాగాయ్థర్మల్పవర్ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే 150 మెగావాట్లతో నిర్మిస్తుండగా ప్రస్తుతం 60 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తి సౌలభ్యంతో గ్రిడ్కు అనుసంధానం చేశారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో నిర్మిస్తోన్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఈపిసి పద్ధతిలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్),  కెవికె ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచరుగా నిర్మిస్తున్న ప్రాజెక్టును ఈ నెలలో ప్రారంభించడానికి సిద్ధం చేసింది.  నాగపట్నంకు 15 కిలో మీటర్ల దూరంలోన్న ధర్మల్ ప్లాంటు రాకపోకలకు రోడ్డు, రైలు, విమాన మార్గాలతో పాటు సముద్ర మార్గం కూడా ఉంది. 230 ఏకరాల్లో 530 టిపిహెచ్ సామర్థ్యంతో బాయలర్ లుండగా, ఎంఇఐఎల్ 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్, 125 మీటర్ల చిమ్నీ (పొగ గొట్టం) అలాగే ఏయిర్ కూల్డ్ కండెన్సర్ ఏర్పాటు చేసింది. ఇందులో బిహెచ్ఇఎల్ బాయిలర్లను తయారు చేసింది. ప్లాంటులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం 70శాతం బొగ్గును దేశీయంగా  సమీకరిస్తుండగా, 30శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకోనున్నారుఉత్పత్తి అయిన విద్యుత్ ను తరలించేందుకు 24.6 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను 230కెవి తిరువూరు సబ్ స్టేషన్ వరకు ఎంఇఐఎల్ నిర్మించగా, 3700 టన్నుల స్టీల్ను కూడా సొంతంగా సరఫరా చేసి అమర్చింది. 7 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేయడానికి 114 టిపిహెచ్ నిల్వ సామర్థ్యం ఉండగా ఇప్పటికే దాదాపు 130 మెగావాట్లకు ప్రైవేట్ ఏజెన్సీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పూర్తయ్యాయి. జూలై 10. 2019 నాడు కమీషనింగ్ అవడంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

525 మెగావాట్ల విద్యుత్ కేంద్రం

ట్యూటికోరిన్ జిల్లాలో 525 మెగావాట్ల సామర్ధ్యం గల బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం. ఆర్థిక, సాంకేతిక అంశాల అధారిత అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్కు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్‌) అర్హత సాధించి ఇపిసి పద్దతిలో కాంట్రాక్టును సొంతం చేసుకుంది. ఎస్ఇపిసి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ బొగ్గు ఆధారిత ట్యూటికోరిన్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్కు సంబంధించి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ తో ఎస్ఇపిసి సంస్థ విద్యుత్కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నది. విద్యుత్ కేంద్రం కోసం వి..చిదంబరం పోర్ట్ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకుని కోల్ జెట్టీ, కన్వేయర్, కూలింగ్ వాటర్ సిస్టమ్, 500 టిపిహెచ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, గంటకు 6700 క్యూమెక్స్ సముద్ర జలాల ఇంటెక్, గంటకు 66000 క్యూమెక్స్ సామర్థ్యంతో కూలింగ్ వాటర్ సిస్టమ్, 15000 టన్నులు స్టీల్, 10 కిలో మీటర్ల సిబ్ల్యు పైప్ లైన్ ఏర్పాటు చేస్తోంది. 275మీటర్ల ఎత్తయిన చిమ్నీ (పొగ గొట్టం)ను ఏర్పాటు చేశారు. బిహెచ్ఇఎల్ థర్మల్ ప్లాంటులో 1700 టిపిహెచ్ సామర్థ్యంతో బాయలర్, 555 మెగావాట్ల సామర్థ్యంతో టర్భైన్ జనరేటర్ లను తయారు చేసింది. అలాగే వడక్కు కరసేరి గ్రామంలో బూడిద చెరువు (యాష్ పాండ్) ను ఏర్పాటుకు 100 హెక్టార్ల స్థలాన్ని సేకరించగా, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (టాన్జెడ్కో) ఎంఇఐఎల్ కు 48 కిలో మీటర్ల 400 కెవి ట్రాన్సమిషన్ లైన్లను ఏర్పాటు చేసే పనులను అప్పగించింది. ఇప్పటికే ఎస్ఇపిసి టిఎన్ఈబీ తో విద్యుత్ అమ్మకాల కోసం 30 సంవత్సరాలకు ఒప్పందాలు, బొగ్గును సరఫరా చేసేందుకు గాను దేశీయ మరియు విదేశీ సంస్థలతో చేసుకుంది. 2018 డిసెంబర్ 28 బాయిలర్ హైడ్రో టెస్ట్ విజయవంతంగా చేయడంతో పాటు 90% పనులు పూర్తయ్యాయి. త్వరలో ఎంఇఐఎల్ ఎలక్ట్రో మెకానికల్ పనులు ముగించి విద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

దేశాభివృద్ధిలో కీలకమైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎంఇఐఎల్ ఇప్పటికే నాలుగు సౌర విద్యుత్ కేంద్రాల్లో 112 మెగావాట్ల సౌర విద్యుత్ ను అందుబాటులో ఉంచింది. గుజరాత్ లోని వడోదర బ్రాంచ్ కెనాల్ పై 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ కోసం ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు వడోదర బ్రాంచ్ కెనాల్ పై 26 కిలో మీటర్ల నుంచి 37 కిలో మీటర్ల మధ్య 5.5 కిలో మీటర్ల వరకు ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీ KPMG ఎకానమీ పవర్ ప్రాజెక్టుల నివేదికలో వంద సృజనాత్మక ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆవిష్కరణల్లో నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టును రికార్డుల్లోకి ఎక్కింది. మన దేశం నుంచి ఎంపికైన ఆరింటిలో ఎంఇఐఎల్ నిర్మించిన సోలార్ ప్లాంటే అగ్రగామి కావడం విశేషం.

మహారాష్ట్రలో ఫొటో వోల్టిక్ టెక్నాలజీతో రెండు సోలార్ విద్యుత్ కేంద్రాలను మహా జెన్కో కోసం ఎంఇఐఎల్ నిర్మించింది. ఇందులో రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ను 2014-15 మధ్యలో చంద్రాపూరులో ఏర్పాటు చేయగా, ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం నాగలాపూరం వద్ద 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఎంఇఐఎల్ సొంతంగా బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (బీఓఓటీ) పద్ధతిలో నిర్మించింది. జల విద్యుత్ ఉత్పత్తి రంగం విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ లో ఎంఇఐఎల్ 25 మెగావాట్ల లాంబడ్గ్జల విద్యుత్ కేంద్రం సొంతంగా నిర్మిస్తోంది. గుజరాత్ లోని సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్ పై 45 మెగావాట్ల సామర్థ్యంతో మూడు హైడ్రో పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో రెండు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడో విద్యుత్ కేంద్రం పనులు పూర్తయ్యాయి.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Published

on

ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణరావు సూపర్ మార్కెట్’. బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలనే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీ నటులు – కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురం
నిర్మాత‌లు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్

కథ:

అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఇక అర్జున్ ప్రేమను చూసిన సంజన కూడా అతని ప్రేమలో పడుతుంది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సడన్ గా ఒక చెడు పరిణామం సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంజనను చంపుతాడు. అతను ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అతన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ లు తమ వారసులను హీరోలుగా సినీ ప్రపంచంలోకి తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కమెడియన్ల కొడుకులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ వంతు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. మొదటి సినిమా అయినా కూడా అలాంటి భావన మనకు ఎక్కడా కనిపించదు. కిక్-బాక్సింగ్ చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటి లాగే తన నటనతో సూపర్ అనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. చాలా బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కృష్ణారావు సూయర్ మార్కెట్. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసాడు. భవిషత్తులో అతనికి మరిన్ని మంచి సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం కృష్ణారావు సూపర్ మార్కెట్.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు
హీరో కృష్ణ నటన
విలన్ సస్పెన్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
దర్శకత్వం

రేటింగ్: 3.5/5

Comments

comments

Continue Reading

Uncategorized

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Published

on

తెలంగాణ ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ స్వాహా చేసేస్తోంది అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదు. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్కి చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో మేఘ 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Published

on

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గానూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం (07-09-2019) హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డ్ లను అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, అతితక్కువ కాలంలో పూర్తిచేసిన ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కు ఐసీఐ అవార్డును అందించింది.  ఈ అవార్డును ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఇఐఎల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని మరోసారి రుజువైంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో ఎంఇఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. లింక్-1లోని మూడు పంప్ హౌస్ లలో దాదాపు 21 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించాం. ఇలాంటి అరుదైన ఘనతను సాధించినందుకు గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో పనిచేసిన 1500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’ అని ఆయన చెప్పారు.ఈ ఇక కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఐసీఐ తెలంగాణ సెంటర్ ఛైర్మన్ పీ. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*సాగునీటి పథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తికావడానికి దశాబ్దాల సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన మేఘా చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంచేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను మేఘా సొంతం చేసుకుంది.
*మేడిగడ్డ పంప్ హౌస్ లో 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే.
*అదేవిధంగా అన్నారం ఎత్తిపోతల పథకంలో 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటుచేసే పనిని మేఘా పూర్తిచేసింది.
*ఇక సుందిళ్ల విషయానికి వస్తే 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తిచేసింది.  ఈ పంపు హౌస్ లన్నింటిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసింది.
*ఇక ఈ మూడు పంప్ హౌస్ లలో మొత్తం  దాదాపు 21 లక్షల కాంక్రీట్ పనిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసి  తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించింది.

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending