Connect with us

Uncategorized

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Published

on

ఇంజనీరింగ్చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలోమేఘానీటి పంపింగ్కేంద్రం నీటిని పంప్చేయడం ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు, పరిశోధనలు, నిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరం చేయగా తెలంగాణాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్కేంద్రాల నిర్మాణంలో అగ్రభాగాన నిలబడింది. పంపింగ్కేంద్రం వ్యవసాయఇంజనీరింగ్‌ (ఎలక్ట్రోమెకానికల్‌) చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించి భవిష్యత్లో అన్నదాత నీటిసమస్యలు తీర్చే కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. ఎంత లోతున నీరు వున్నా, ఎంత ఎత్తులో అవసరమైనా వ్యవసాయం కోసం నీటిని పంప్చేసే విధంగా పంపింగ్కేంద్రాన్ని నిర్మించడం సుసాధ్యమని మేఘా నిరూపించింది. అన్నింటా అరుదుగా నిలిచిపోయే లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ పంపింగ్కేంద్రంలోని 5 పంపు నుంచి నీటి పంపింగ్ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సుమారు 3000 క్యూసెక్కుల నీరు 111 మీటర్ల ఎగువకు ఎగజిమ్మింది. ఉవ్వెత్తున లేచివచ్చిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఆగష్టు 14, బుధవారం నాడు 4,5 పంపులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం మేఘా ఇంజినీరింగ్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరంగ్సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవిత కాలపు అవకాశంగానూ, గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే తక్కువ కాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది. అని బి. శీనివాస్రెడ్డి అభిప్రాయపడ్డారు.

 ‘మేఘా మహాద్భుత సృష్టి

ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటి పంపింగ్లక్ష్యం, పరిమాణంఇలా ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్కళాఖండం. మేఘా ఇంజనీరింగ్తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూ గర్భ పంపింగ్కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. ఇక మొత్తం పంపింగ్కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతిపెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్మోటార్పంప్హౌస్ల్లోనే కాకుండా మొత్తంగా ప్రపంచంలో రంగంలోనూ అంటే పరిశ్రమలు, విద్యుత్ఉత్పత్తి, మరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదు. దీన్ని బట్టి పంపింగ్కేంద్రం మేఘా స్థాయి ఎంత గొప్పదో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు.

కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2 టీఎంసీల పంపింగ్ కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ్  సామర్థ్యం అవసరం కాగా ఎంఐఈఎల్మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం రికార్డ్‌.  ప్రపంచంలో ఇంతకు ముందెన్నడు భారీ స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేయలేదు

మూడున్నరేళ్లలోనే…

అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో భారీ శక్తి సామర్ధ్యాతో భూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ ఎక్కడా లేవు. అటువంటిది ఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం అందులోనూ రోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీలను 111.4 మీటర్ల ఎగువకు పంప్చేయడం అనేది అసామాన్యమైనది. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్ధ్యాలతో మేఘా ఇంజనీరింగ్ పంపింగ్కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అదీ కేవలం మూడున్నరేళ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాల సమయం పడుతున్న పరిస్థితుల్లో పథకంతోపాటు పంపింగ్కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితం చేయడం మేఘా ఇంజనీరింగ్కే సాధ్యమైంది. పథకంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు. ఆశ్చర్యగొలిపే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇంజనీరింగ్కళాఖండాన్ని ఆవిష్కరింపచేసింది. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. వ్యవసాయఇంజనీరింగ్రంగంలో అగ్రభాగాన నిలబడింది. దిగువన వున్న గోదావరి నీటిని ఎగువప్రాంతాల్లో వున్న రైతు భూముల చెంతకు చేర్చేందుకు మరెక్కడా లేని పథకం అమల్లోకి వచ్చింది.

ఈఫిల్టవర్కన్నా పెద్దది.. 

లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్కేంద్రం పొడవు ఈఫిల్టవర్పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్టవర్ఎత్తు 324 మీటర్లు కాగా, పంప్హౌస్పొడవు 327 మీటర్లు. కలకత్తాలోని దేశంలోనే అతిపొడవైన భవంతిది 42’ కంటే పంప్హౌస్లోతు ఎక్కువ. ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే పంప్హౌస్ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు. పంప్హౌస్నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు

భారీ  పంప్హౌస్లో విశిష్టత అంతా జంట టన్నెల్స్. రెండింటినీ పక్కపక్కనే 10 మీటర్ల వ్యాసంతో భూమిని తవ్వి ఒక్కో టన్నెల్ను 4133 మీటర్ల పొడవుతో నిర్మించాం. సర్జ్పూల్‌, అదనపు సర్జ్పూల్స్కూడా ప్రపంచంలోనే అతి పెద్దవి. భూగర్భంలో ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 470 అడుగుల దిగువన 327 మీటర్లు పొడవు,  25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తుతో పంప్హౌస్నిర్మాణం అంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చుఅని బి. శ్రీనివాస్రెడ్డి పంప్హౌస్విశిష్టతలను వివరించారు

అత్యధిక మేఘా వాట్ల సామర్థ్యం… 

పంప్చేయడానికి అవసరమైన నీటిని నిల్వ చేయడం కోసం నిర్మించిన సర్జ్పూల్కూడా ఈఫిల్టవర్కన్నా పొడవులో పెద్దది. మొత్తం 4 సర్జ్పూల్స్ఉండగా అందులో ప్రధాన సర్జ్పూల్‌ 325 మీటర్ల పొడవుతో నిర్మించడం ప్రపంచంలోనే అరుదైన ఇంజనీరింగ్అద్భుతం. ప్రపంచంలో కొలరాడో (అమెరికా), గ్రేట్మేన్మేడ్రివర్‌ (లిబియా) లాంటి ఎత్తిపోత పథకాలు ఇప్పటి వరకూ అతిపెద్దవి కాగా కాళేశ్వరం ముందు అవి చిన్నవైపోయాయి. ఒక్కో మిషన్వారీగా చూసినా మొత్తం అన్ని మిషన్లు సామర్ధ్యంతో పోల్చి చూసినా లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ పంపింగ్కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దది. పైగా ఇది భూగర్భంలో నిర్మించింది కావడం మరో ప్రత్యేకత.

ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లను పంపింగ్కు సిద్ధం చేయగా ఇవి ఎంత పెద్దవంటే అనుబంధ పరికరాల తో కలిపి ఒక్కో మిషన్బరువు 2376 మెట్రిక్టన్నులు. ఒక్కో లారీలోను 20 టన్నుల సరుకు రవాణా చేస్తుంటారు. మిషన్లో ప్రధానమైనవి స్టార్టర్‌, రోటర్లు. స్టార్టర్బరువు 216 టన్నులు కాగా రోటర్బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. తద్వారా 300 టన్నులు బరువు మోయగలిగిన ఇఒటి క్రేన్సముదాయాన్ని ఏర్పాటు చేశారు.

పంప్హౌస్నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్తో పాటు 50 వేల టన్నుల సిమెంట్కాంక్రీట్వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టిఎంసీల నీటిని పంప్చేసే విధంగా నిర్మాణ పని పూర్తయింది. మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్కుడికాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్ధ్యం 11,000 క్యూసెక్కులు అయితే ఇక్కడ 22,000 క్యూసెక్కుల నీరు పంపింగ్ద్వారా వస్తుంది

భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్చేసే విధంగా మిషన్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్చేయడమే అరుదు. అటువంటిది పథకంలో అంత ఎత్తుకు రోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీల వరకు పంప్చేసే సామర్ద్యం వుందీ అంటే మేఘా పంపింగ్కేంద్రం ఎంత ఘనమైనదో ఊహించుకోవచ్చు. మేఘా ఇంజనీరింగ్తో పాటు దేశీయ ప్రభుత్వ ఎలక్ట్రికల్ఇంజనీరింగ్దిగ్గజం బిహెచ్ఇఎల్తోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విదేశీ కంపెనీలు Telk, Siemens, Wartsila, MMT, LS Cables, Hilti, Atlas Copco, Normet, Sandvik తదితర సంస్థలు మేఘా ఇంజనీరింగ్కు తమ సేవలను అందించాయి. ఇందులో 160 ఎంవిఎ పవర్ట్రాన్స్ఫార్మర్లు ఒక్కో మిషన్కు ఒక్కోటి చొప్పున అమర్చారు. 400 కెవిఎ సబ్స్టేషన్నుంచి విద్యుత్అండర్గ్రౌండ్కేబుల్ద్వారా మిషన్లకు సరఫరా అవుతుంది.

ప్రపంచంలో అతి పెద్ద పంప్హౌస్ను అతిస్వల్పకాలంలో పూర్తి చేసిన సందర్భంగా మేఘా ఇంజినీరింగ్ అండ్ఇన్ఫ్రాస్ట్రక్చర్స్డైరెక్టర్శ్రీ బి. శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూఇదొక అత్యద్బుతమైన అండర్గ్రౌండ్పంప్హౌస్‌.  భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్పూల్స్నిర్మించాం. అల్డ్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యం గల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. మెషీన్లను కంప్యూటేషనల్ఫ్ల్యూయిడ్ డైనమిక్స్‌ (సీఎఫ్డీ) టెక్నాలజీతో దేశంలో తయారు చేసి మేక్ఇన్ఇండియాకు ప్రతిరూపంగా పంప్హౌస్ను నెలకొల్పాం. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి పెద్ద విద్యుత్మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అందులో 400 కేవీ 220కేవీ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, 260 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్లైన్లు, ఏడు కిలోమీటర్ల మేర 400 కేవీ ఎక్స్ఎల్పీఈ అండర్గ్రౌండ్కేబుల్వ్యవస్థను ఏర్పాటు చేశాం. రకంగా చూసినా ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. మహాఅధ్బుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజినీరింగ్కే దక్కుతుందిఅని అన్నారు

శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ జల విద్యుత్ తో సమానం..

సాధారణంగా నీటి పంపింగ్కేంద్రాలు భూ ఉపరితలం మీదే వుంటాయి. మొట్టమొదటిసారిగా అతిపెద్ద పంపింగ్కేంద్రాన్ని భూగర్భంలో మేఘా ఇంజనీరింగ్నిర్మించింది. దీని విద్యుత్వినియోగ, పంపింగ్సామర్ధ్యం 973 మెగావాట్లు అంటే నమ్మగలరా? విడివిడిగా చూస్తే శ్రీశైలంలోని రెండు జలవిద్యుత్కేంద్రాల కన్నా, నాగార్జునసాగర్లో ఒక జలవిద్యుత్కేంద్రం ఉత్పత్తి స్థాయి కన్నా దీని వినియోగం ఎక్కువ. వాస్తవానికి విద్యుత్ఉత్పత్తి కేంద్రం, పంప్హౌస్వేర్వేరు రకాలు. కాని విద్యుత్పరిమాణాన్ని ఉదహరించడానికి అలా చెప్పాల్సి వచ్చింది.

ఉపరితలంలో నిర్మించే పంప్హౌస్కు పునాదులతోపాటు నిర్మాణ సమయంలోనూ మార్పులు- చేర్పులు సులభమవుతాయి. కానీ భూగర్భ పంపింగ్కేంద్రాన్ని నీటి లభ్యత, నీటిమట్టం ఆధారంగానే అవసరమైన లోతులో నిర్మించాలి. ఇష్టం వచ్చిన తరహాలో భూగర్భంలో మార్పులు- చేర్పులు చేయడానికి వీలు పడదు. అంటే నిర్మాణ పరంగా ఎంత క్లిష్టమైన పనిని మేఘా ఇంజనీరింగ్తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో మూడున్నరేళ్లలో పూర్తి చేసిందో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు. పంప్హౌస్ఆకృతి నిర్మాణంలో కీలకమైన ప్రదేశాలు.. సర్వీస్బే: భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున వుండగా, పంప్బే: 190.5 మీటర్లు, యాన్సిరీ బే: 195.5 మీటర్లు, ట్రాన్స్ఫార్మర్బే: 215 మీటర్లు, కంట్రోల్రూం: 209 మీటర్లు లోతున వున్నాయి. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 పంపింగ్కేంద్రాలను ( పథకం బహుళదశ ప్రపంచంలో పెద్దది) నిర్మిస్తుండగా అందులో 17 కేంద్రాలను ఎంఇఐఎల్నిర్మిస్తోంది.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Published

on

ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణరావు సూపర్ మార్కెట్’. బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలనే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీ నటులు – కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురం
నిర్మాత‌లు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్

కథ:

అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఇక అర్జున్ ప్రేమను చూసిన సంజన కూడా అతని ప్రేమలో పడుతుంది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సడన్ గా ఒక చెడు పరిణామం సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంజనను చంపుతాడు. అతను ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అతన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ లు తమ వారసులను హీరోలుగా సినీ ప్రపంచంలోకి తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కమెడియన్ల కొడుకులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ వంతు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. మొదటి సినిమా అయినా కూడా అలాంటి భావన మనకు ఎక్కడా కనిపించదు. కిక్-బాక్సింగ్ చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటి లాగే తన నటనతో సూపర్ అనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. చాలా బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కృష్ణారావు సూయర్ మార్కెట్. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసాడు. భవిషత్తులో అతనికి మరిన్ని మంచి సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం కృష్ణారావు సూపర్ మార్కెట్.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు
హీరో కృష్ణ నటన
విలన్ సస్పెన్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
దర్శకత్వం

రేటింగ్: 3.5/5

Comments

comments

Continue Reading

Uncategorized

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Published

on

తెలంగాణ ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ స్వాహా చేసేస్తోంది అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదు. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్కి చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో మేఘ 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Published

on

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గానూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం (07-09-2019) హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డ్ లను అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, అతితక్కువ కాలంలో పూర్తిచేసిన ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కు ఐసీఐ అవార్డును అందించింది.  ఈ అవార్డును ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఇఐఎల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని మరోసారి రుజువైంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో ఎంఇఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. లింక్-1లోని మూడు పంప్ హౌస్ లలో దాదాపు 21 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించాం. ఇలాంటి అరుదైన ఘనతను సాధించినందుకు గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో పనిచేసిన 1500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’ అని ఆయన చెప్పారు.ఈ ఇక కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఐసీఐ తెలంగాణ సెంటర్ ఛైర్మన్ పీ. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*సాగునీటి పథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తికావడానికి దశాబ్దాల సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన మేఘా చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంచేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను మేఘా సొంతం చేసుకుంది.
*మేడిగడ్డ పంప్ హౌస్ లో 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే.
*అదేవిధంగా అన్నారం ఎత్తిపోతల పథకంలో 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటుచేసే పనిని మేఘా పూర్తిచేసింది.
*ఇక సుందిళ్ల విషయానికి వస్తే 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తిచేసింది.  ఈ పంపు హౌస్ లన్నింటిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసింది.
*ఇక ఈ మూడు పంప్ హౌస్ లలో మొత్తం  దాదాపు 21 లక్షల కాంక్రీట్ పనిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసి  తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించింది.

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending