Connect with us

Uncategorized

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Published

on

తెలంగాణ ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ స్వాహా చేసేస్తోంది అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదు. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్కి చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో మేఘ 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Published

on

ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణరావు సూపర్ మార్కెట్’. బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలనే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీ నటులు – కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురం
నిర్మాత‌లు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్

కథ:

అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఇక అర్జున్ ప్రేమను చూసిన సంజన కూడా అతని ప్రేమలో పడుతుంది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సడన్ గా ఒక చెడు పరిణామం సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంజనను చంపుతాడు. అతను ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అతన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ లు తమ వారసులను హీరోలుగా సినీ ప్రపంచంలోకి తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కమెడియన్ల కొడుకులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ వంతు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. మొదటి సినిమా అయినా కూడా అలాంటి భావన మనకు ఎక్కడా కనిపించదు. కిక్-బాక్సింగ్ చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటి లాగే తన నటనతో సూపర్ అనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. చాలా బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కృష్ణారావు సూయర్ మార్కెట్. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసాడు. భవిషత్తులో అతనికి మరిన్ని మంచి సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం కృష్ణారావు సూపర్ మార్కెట్.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు
హీరో కృష్ణ నటన
విలన్ సస్పెన్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
దర్శకత్వం

రేటింగ్: 3.5/5

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Published

on

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గానూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం (07-09-2019) హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డ్ లను అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, అతితక్కువ కాలంలో పూర్తిచేసిన ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కు ఐసీఐ అవార్డును అందించింది.  ఈ అవార్డును ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఇఐఎల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని మరోసారి రుజువైంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో ఎంఇఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. లింక్-1లోని మూడు పంప్ హౌస్ లలో దాదాపు 21 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించాం. ఇలాంటి అరుదైన ఘనతను సాధించినందుకు గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో పనిచేసిన 1500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’ అని ఆయన చెప్పారు.ఈ ఇక కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఐసీఐ తెలంగాణ సెంటర్ ఛైర్మన్ పీ. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*సాగునీటి పథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తికావడానికి దశాబ్దాల సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన మేఘా చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంచేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను మేఘా సొంతం చేసుకుంది.
*మేడిగడ్డ పంప్ హౌస్ లో 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే.
*అదేవిధంగా అన్నారం ఎత్తిపోతల పథకంలో 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటుచేసే పనిని మేఘా పూర్తిచేసింది.
*ఇక సుందిళ్ల విషయానికి వస్తే 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తిచేసింది.  ఈ పంపు హౌస్ లన్నింటిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసింది.
*ఇక ఈ మూడు పంప్ హౌస్ లలో మొత్తం  దాదాపు 21 లక్షల కాంక్రీట్ పనిని మేఘా రికార్డు సమయంలో పూర్తి చేసి  తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించింది.

Comments

comments

Continue Reading

Uncategorized

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Published

on

పుడమి తల్లిని చీల్చుకుని భీకర శబ్ధంతో గంగ ఉబికి ఉప్పొంగుతోంది. భూమి దిగువ నుంచి గాయత్రి మేఘా పంపింగ్జలాలు ఉబికి వస్తున్న తీరు కళ్ళను కట్టిపడేస్తోంది. అగ్ని పర్వతం పేలితే లావా ఎగసిపడినట్లు నీళ్ళు నిప్పులు కక్కుతోంది. రైతు నమ్ముకున్న భూమితల్లికి పచ్చని పైరు పంటతో ప్రాణం పోసేందుకు ఎగిరి ఎగిరి పడుతోంది. నదిలో వరదను మరిపించేలాగ గాయత్రి భూగర్భ పంపింగ్కేంద్రం నుంచి నీరు ఉవ్వెత్తున పైకి ఎగసిపడి కాలువలోకి ఉరకలు వేస్తూ జాలువారుతున్నాయి. వరదలు వచ్చినప్పుడు నది సుడులు తిరిగినట్లుగా భూమిలోనుంచి పైకి కాళేశ్వరం నీటిని ఎగచిమ్ముతోంది. దృశ్యం కళ్ళకు కనువిందు చేస్తోంది. గుండెను ఆహ్లాదయంగా తడిమి పులకరింపజేస్తోంది. ఎండిన చేనుకు తడితగలగానే విత్తనం మొక్కగా పైకి చీల్చుకువచ్చినట్లు భూమి పొరల్లోంచి నీరు తన్నుకు వస్తోంది. సముద్రపు అలల్ని తలపించేలాగా, నిండు కుండను మరిపించేలాగ  గోదారమ్మ మానేరులో గాయత్రి పంపింగ్తో కళకళలాడుతోంది. ఎండిన భూముల్లో పచ్చదనంగా పంటలు విస్తరించటానికి ఉవ్విళ్ళూరుతూ వడివడిగా మిడ్మానేరు వైపు పరుగులు పెడుతోంది.

మేఘా ఇంజనీరింగ్భూగర్భంలో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పంపింగ్కేంద్రాన్ని ఆగస్టు 11 ప్రారంభించి ఇప్పటి వరకు నిరంతరాయంగా పంపింగ్కొనసాగిస్తూ క్రమంగా మిషన్ల వినియోగాన్ని పెంచుతోంది. మొదటి దశలో రోజుకు 2 టిఎంసీల నీటిని పంపింగ్చేసే విధంగా 5 మిషన్లను ఏర్పాటు చేయగా ఇప్పటికి నాలుగు మిషన్లు (మూడవ మిషన్మినహా) వినియోగంలోకి తెచ్చింది. వీటి ద్వారా సరాసరిన 15 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్చేస్తోంది.

22 రోజుల్లో 3 మిషన్లతో 11 టిఎంసిల పంపింగ్‌ 

ప్రపంచంలో అతిపెద్ద పంపింగ్కేంద్రం గాయత్రి (లక్ష్మీపూర్‌) భూగర్భ పంపింగ్కేంద్రం ఇప్పటి దాకా, అంటే 22 రోజుల్లో 3 మిషన్ల ద్వారా 11.40 టిఎంసీల నీటిని పంపింగ్చేసి మిడ్మానేరుకు చేర్చింది. అందులో 5 మిషన్మొదట ప్రారంభించగా 380 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసింది (16 రోజులపాటు). 2 మిషన్‌ (క్రమ సంఖ్య 4) అదే రోజుల్లో 378 గంటలపాటు పనిచేసింది. రెండు మిషన్లు సరాసరిన ఒక్కొక్కటి 4.30 టిఎంసీల చొప్పున నీటిని పంప్చేశాయి. మూడవ మిషన్‌ (క్రమసంఖ్య 1) 10 రోజులపాటు (అంటే ఆలస్యంగా ప్రారంభించారు) 248 గంటలు పనిచేసి 2.80 టిఎంసిల నీటిని పంప్చేసింది పంపింగ్కేంద్రం భూమి దిగువన 470 అడుగుల నుంచి నీటిని పైకి వెదజిమ్ముతోంది. భూగర్భంలో మెగామహాద్భుతాన్ని ఆవిష్కరించి 22 రోజులు కావస్తుండగా నీటి పంపింగ్తీరు చూపరులను ఆకట్టుకుంటోంది. 327 మీటర్ల పొడవున నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదయిన నిర్మాణంలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లు (మోటారు, పంపు కలిపి ఒక్కో మిషన్‌) ఏర్పాటయ్యాయి. 2 దశ కింద మరో రెండు మిషన్లు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి డ్రైరన్కూడా పూర్తయింది

గోదావరికి గాయత్రి కొత్త నడక

బీడువారిన చేలకు నీరు అందించే విధంగా రైతుల్లో ఆశలు చిగురింపచేస్తూ గోదావరి పరవళ్లకు వ్యతిరేక దిశలో కొత్త నడకలు నేర్పుతూ నీటిని ఎగువకు పంపింగ్చేయడంలో భూగర్భ గాయత్రి పంపింగ్కేంద్రం గుండెకాయ వంటి పాత్రను పోషిస్తోంది. జులైలోనే లింక్‌-1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్చేస్తున్న మేఘా తన రికార్డును తానే అధిగమించింది. ఇంత పెద్ద స్థాయిలో నిర్మించిన పంపింగ్కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు అనివార్యమంటూ సన్నాయి నొక్కులు నొక్కినవారి ముక్కున వేలేసుకునే విధంగా మేఘా పంపింగ్కేంద్రాలు నీటిని ఎగువకు ఎగజిమ్ముతూ ఇంజనీరింగ్అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటి దాకా అతిపెద్ద పంపింగ్కేంద్రాలుగా హంద్రీనీవాలోని మొదటిదశలోని 12 కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఇదే పధకంలోని 2 దశలో 18 కేంద్రాలు పనిచేస్తున్నవి. అలాగే ప్రాముఖ్యత సంతరించుకున్న పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో పంపింగ్కేంద్రం చూసినా మేఘా ఇంజనీరింగ్నిర్మించినవే.

చిన్నబుచ్చుకున్న పట్టిసీమ

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపింగ్కేంద్రాలు పనితీరును పరిశీలిస్తే తన రికార్డును తానే మేఘా ఇంజనీరింగ్బద్దలుకొట్టింది. రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడంతో పాటు గోదావరికృష్ణ నదులను అనుసంధానం చేసిన పట్టిసీమలో 24 మిషన్లు వున్నాయి. పథకాన్ని గడువులోగా నిర్మించి, మేఘా లిమ్కా బుక్ఆఫ్రికార్డుకెక్కింది. గత ఐదేళ్లుగా విజయవంతంగా నీటిని పంపుచేస్తున్న పథకం 2015 నుంచి ఇప్పటి దాకా (ఆగస్టు 31వరకు) 289.8 టిఎంసీల నీటిని పంపు చేసింది. 2018లో 76,068 గంటలు పంపు చేసి 96.94 టిఎంసిల కృష్ణలోకి చేర్చింది. ఏడాది (2019) ఇప్పటి (ఆగస్టు 31) వరకు 21,356 గంటలు పనిచేసి, 27.22 టిఎంసిల నీటిని అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణకు తరలించింది

ఎగసిపడుతున్నమేఘాపంపింగ్

పథకంతో పోల్చితే గాయత్రి (లక్ష్మీపూర్‌) భూగర్భ పంపింగ్కేంద్రం భూమికి దిగువన 470 అడుగుల లోతులో వుంది. అయినప్పటికీ 22 రోజుల్లో 1006 గంటలు పనిచేసి 11.40 టిఎంసిల నీటిని మిడ్మానేరుకు చేర్చింది. మిడ్మానేరు సామర్ధ్యం 25 టిఎంసిలు కాగా, అందులో అంత మొత్తం నీటిని 22 రోజుల్లో మూడు మిషన్ల ద్వారా చేర్చిందంటే మేఘా మిషన్ల విశిష్టత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజంగానే పట్టిసీమ లాగ 21,356 గంటలు పనిచేస్తే ఎంత నీరు చేరుతుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంచుమించు 230 టిఎంసిల నీరు మిడ్మానేరుకు చేరుతుంది. జలాశయం సామర్ధ్యం 25.60 టిఎంసిలు (పదో వంతు మాత్రమే). దీన్ని బట్టి చూస్తే పంపింగ్కేంద్రం గొప్పతనం అర్ధమవుతుంది.

ప్రాణహిత నీటిని ఎగువకు వడిసినడుతున్న లక్ష్మి

లింక్‌-1 లోని లక్ష్మీ (మేడిగడ్డ) పంపింగ్కేంద్రం జూన్ 21 ముఖ్యమంత్రలు, నాటి గవర్నర్ప్రారంభించిన సంగతి తెలిసిందే! ప్రాణహిత నీటిని వెనక్కి ఒడిసిపట్టి ఎగువకు మళ్లించడంలో పంపింగ్కేంద్రం కీలకమైనది. ఇందులో ఆరు మిషన్లు పనిచేస్తుండగా 36 రోజుల్లో 1593 గంటలు (అన్ని మిషన్లు కలిపి) నీటిని 12.20 టిఎంసిలు పంపు చేశాయి. ముఖ్యమంత్రులు ప్రారంభించిన ఆరవ మిషన్అత్యధికంగా 22 రోజుల్లో 367 గంటల పాటు 2.80 టిఎంసిల నీటిని పంపు చేసింది. దాదాపు అదే విధంగా 4, 3, 1, 5 మిషన్లు కూడా పనిచేశాయి. ఆలస్యంగా ప్రారంభమైన 2 మిషన్ఇప్పటి దాకా (ఆగస్టు 31) 0.7 టిఎంసిల నీటిని అందించింది

సరస్వతి (అన్నారం) పంపింగ్కేంద్రం ఇప్పటి దాకా 6 మిషన్లను 16 రోజుల్లో 461 గంటల పాటు పనిచేయించి 4.86 టిఎంసిల నీటిని పంపు చేసింది. అందులో ప్రధానంగా 1 మిషన్‌ 8 రోజుల్లో 161 గంటలు పనిచేసి 1.70 టిఎంసిల నీటిని సుందిళ్లకు అందించింది. ఇక ఎల్లంపల్లికి నీటిని చేర్చి లింక్‌-1, లింక్‌-2 మధ్య అనుసంధానంగా వుండే పార్వతి (సుందిళ్ల) పంపింగ్కేంద్రం 11 రోజుల్లో 23.67 గంటలపాటు ఆరు మిషన్లను పనిచేయించింది. అయితే  గోదవరికి వరద వచ్చి ఎల్లంపల్లి నిండటంతో పంపింగ్కేంద్రం వినియోగం ద్వారా నీటి తరలింపు అంతంత మాత్రంగానే వుంది.

అంత పెద్ద హంద్రీనీవా గాయత్రి ముందు ….

పంపింగ్కేంద్రాల నిర్మాణంలో విశిష్టత చాటుకున్న మేఘా ఇంజనీరింగ్దేశంలో నిర్మించిన అతిపెద్ద పంపింగ్కేంద్రాలతో పోల్చితే ప్రాజెక్టులోని లింక్‌-1లోని మూడు కేంద్రాలు లింక్‌-2లోని గాయత్రి పంపింగ్కేంద్రం ఎంత పెద్దదో ఇట్టే అర్ధమవుతుంది. అతి పెద్దది, ముఖ్యంగా అతి పొడవైనదిగా ఎక్కువ పంపింగ్కేంద్రాలతో హంద్రీనీవా ప్రసిద్ధి చెందింది. ఇందులో మొదటిదశలో 12 కేంద్రాలు, 2 దశలో 18 కేంద్రాలు వున్నాయి. మొదటి దశలోని మొదటి పంపింగ్కేంద్రం కృష్ణ నదివద్ద శ్రీశైలం ఎగువ భాగంలో మాల్యాల దగ్గర నిర్మించారు. పంపింగ్కేంద్రంలో 12 మిషన్లు వున్నాయి. ఒక్కొక్క మిషన్ద్వారా 9.56 క్యూమెక్కుల నీటిని 5 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించారు. సరాసరి నీటి పంపింగ్ఎత్తు 38 మీటర్లు. మళ్లీ మనం కాళేశ్వరంలోకి వస్తే లింక్‌-1లో ఒక్కొక్క మిషన్సామర్ధ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీకేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. వీటి మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు హంద్రీనీవా మాల్యాల పంపింగ్కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే దాని కన్నా లక్ష్మీ (కాళేశ్వరంలో) పంపింగ్కేంద్రం ఎంత పెద్దదో ఇట్టే అర్ధమైపోతుంది

లక్ష్మీ కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్కేంద్రం మరింత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7 మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించినది. అంటే పంపింగ్కేంద్రాలతోనూ గాయత్రి కేంద్రానికి అసలు పోలికే లేదు. హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్పధకం అయినప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలలోనిది (అంటే మొదటి కేంద్రం). ఇక్కడ 2012 నుంచి పంపింగ్జరుగుతుండగా ఇప్పటి దాకా 8 ఏళ్లలో 1242 రోజులపాటు పంపింగ్జరిగి 163.4 టిఎంసిల నీటిని ఎత్తిపోశారు. అదే సమయంలో పట్టిసీమ నుంచి ఐదేళ్ల కాలంలో 289 టిఎంసిల నీటిని అందించారు. పంపింగ్కేంద్రాలు పనిచేసిన విధంగా లింక్‌-1, లింక్‌-2లోని నాలుగు మెగా పంపింగ్కేంద్రాలు పనిచేస్తే ఎంత నీరు తెలంగాణ బీడు భూములకు చేరుతుందో అంచనా వేయొచ్చు.

కాళేశ్వరం లక్ష్యం నెరవేర్చడంలో మేఘా తన ఇంజనీరింగ్ప్రావిణ్య ప్రత్యేకతను అద్భుత పంపింగ్ద్వారా చాటుకుంటోంది. ప్రారంభంలోనే అంత భారీ స్థాయిలో నీటిని అందిస్తుంటే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల తరహాలో వేల గంటలు వంద రోజులు పనిచేస్తే తెలంగాణలో నీటి విప్లవం కళ్లెదుట కనిపిస్తుంది.

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending